OTT Movie : మార్వెల్ సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. అంతలా ఈ సినిమాలను ప్రజలు ఆదరించారు. చిన్న పిల్లలైతే వీటిని ఎంతగా అభిమానిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే టిఫిన్ బాక్స్ ల నుంచి, స్కూల్ బ్యాగ్ ల వరకూ వీటి బొమ్మలనే చూస్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మార్వెల్ కి చెందిన ఒక సూపర్ హీరో మూవీ. ఇందులో ఉండే యాక్షన్ సీన్స్ కి ప్రేక్షకుల మతిని పోగొట్టాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్టరెమినగ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
‘షాంగ్-చీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ (Shang chi and the legend of the ten rings). 2021 లో వచ్చిన ఈ సినిమాకి డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు. ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి చెందిన సూపర్ హీరో మూవీ. ఇందులో లియు షాంగ్, అవ్క్వాఫినా, మెంగర్ జాంగ్, ఫాలా చెన్, ఫ్లోరియన్ ముంటియాను, బెనెడిక్ట్ వాంగ్, మిషెల్ యో, బెన్ కింగ్స్లీ టోనీ లియుంగ్ వంటి నటులు నటించారు. ఈ కథ మార్షల్ ఆర్ట్స్, మిస్టికల్ ఎలిమెంట్స్, కుటుంబ డైనమిక్స్ చుట్టూ తిరుగుతుంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకు IMDbలో 7.4/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
షాంగ్-చీ అనే యువకుడు శాన్ ఫ్రాన్సిస్కోలో హోటల్ వాలెట్‌గా పనిచేస్తూ, తన బెస్ట్ ఫ్రెండ్ కేటీతో సరదాగా జీవిస్తుంటాడు. అయితే షాంగ్-చీ టెన్ రింగ్స్ అనే శక్తివంతమైన ఆయుధాలను నియంత్రించే వెన్‌వు అనే నాయకుడి కొడుకు. వెన్‌వు టెన్ రింగ్స్ ఆర్గనైజేషన్‌ను నడిపిస్తుంటాడు. ఇది వేల సంవత్సరాలుగా ప్రపంచంలోని దుష్ట శక్తులను నియంత్రిస్తోంది. ఈ టెన్ రింగ్స్ అతనికి అమరత్వం, అసాధారణ శక్తిని ఇస్తాయి. వెన్‌వు ఒకప్పుడు యింగ్ లీ అనే మహిళను ప్రేమించాడు. ఆమె తాఓ అనే గ్రామం నుండి వచ్చిన ఒక శక్తివంతమైన యోధురాలు. వీళ్ళ ప్రేమ ఫలితంగా షాంగ్-చీ, అతని సోదరి జియాలింగ్ జన్మించారు. ఆమెతో ఉన్న రోజులు వేరే ప్రపంచం తెలీకుండా బతికాడు. ఆ తరువాత ఒక రోజు యింగ్ లీ చనిపోతుంది. ఇక వెన్‌వు తన పాత మార్గాలకు తిరిగి వస్తాడు. తన కొడుకు షాంగ్-చీకి ఒక హంతకుడిగా శిక్షణ ఇస్తాడు.
అయితే తన తండ్రి హింసాత్మక మార్గాలను తిరస్కరించిన షాంగ్-చీ, 14 ఏళ్ల వయసులో ఇంటిని విడిచి పారిపోతాడు. తన సోదరి జియాలింగ్‌ను వదిలిపెట్టి సాధారణ జీవితం గడపడానికి అమెరికాకు వస్తాడు. షాంగ్-చీ ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, టెన్ రింగ్స్ ఆర్గనైజేషన్ గూండాలు అతనిపై దాడి చేస్తారు. అతని తల్లి ఇచ్చిన ఒక పెండెంట్‌ను దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. ఈ దాడిలో షాంగ్-చీ తన అసాధారణ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను బయటికి తీస్తాడు. ఈ ఘటన తర్వాత, షాంగ్-చీ తన సోదరి జియాలింగ్‌ను కలవడానికి మకావుకు వెళ్తాడు. ఈ మధ్యలో ఇతనికి ఒక భయంకరమైన అడవి ఎదురుపడుతుంది. ఇది మనుషులను దారుణంగా చంపుతుంది. షాంగ్-చీ దానిని దాటి జియాలింగ్‌ను కలుస్తాడు. ఆమె దగ్గర కూడా తల్లి ఇచ్చిన ఒక పెండెంట్ ఉంటుంది. టెన్ రింగ్స్ ఆర్గనైజేషన్ దానిని లక్ష్యంగా చేసుకుందని అతను భావిస్తాడు.
మకావులో షాంగ్-చీ, జియాలింగ్‌ను ఒక అండర్‌గ్రౌండ్ ఫైట్ క్లబ్‌లో కలుస్తాడు. ఆమె ఇప్పుడు ఒక శక్తివంతమైన నాయకురాలిగా మారి ఉంటుంది. అయితే జియాలింగ్ తన అన్నపై కోపంగా ఉంటుంది. ఎందుకంటే అతను ఆమెను చిన్నప్పుడు విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఆమెకు కోపం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు మాట్లాడుతున్న సమయంలో, టెన్ రింగ్స్ ఆర్గనైజేషన్ దాడి చేస్తుంది. అంతే కాకుండా జియాలింగ్ పెండెంట్‌ను దొంగిలిస్తుంది. ఈ దాడిలో షాంగ్-చీ, జియాలింగ్ తమ తండ్రి ఉన్నాడని తెలుసుకుంటారు. వెన్‌వు ఈ పెండెంట్‌లను ఉపయోగించి తాఓ గ్రామాన్ని కనిపెట్టాలని ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే అతను తన భార్య యింగ్ లీని తిరిగి బతికించుకోగలనని అనుకుంటాడు. ఆ గ్రామంలో బంధీగా ఉండే ఒక దుష్ట శక్తి వెన్‌వును తన మాయలో పడేస్తుంది. ఆ దుష్ట శక్తి బయటికి వస్తే ప్రపంచాన్ని అంతం చేస్తుంది. ఈ క్రమంలో వెన్‌వును అడ్డుకోవడానికి ఆ గ్రామం తరపున షాంగ్-చీ, జియాలింగ్ పోరాడుతారు. చివరికి షాంగ్-చీ తండ్రిని అడ్డుకుంటాడా ? ఆ దుష్టశక్తి బయటికి వస్తుందా ? వెన్‌వు భార్య బతికే ఉంటుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ యాక్షన్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : బ్రతికుండగానే చచ్చినట్టు నటించి సైకో డాక్టర్ చేతికి చిక్కే హీరోయిన్… కిక్కెక్కించే కిల్లర్ మూవీ