BigTV English

Unstoppable season 4: నిర్మాత పరువు తీసిన బాలయ్య.. పవన్ కళ్యాణ్ మూవీ ప్రస్తావన…

Unstoppable season 4:  నిర్మాత పరువు తీసిన బాలయ్య.. పవన్ కళ్యాణ్ మూవీ ప్రస్తావన…

Unstoppable season 4: టాలీవుడ్ హీరో మాస్ ఆఫ్ గాడ్ బాలయ్య హోస్ట్ గా చేస్తున్న షో అన్ స్టాపబుల్ విత్ బాలయ్య.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ షోను నిర్వహిస్తుంది. ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు నాలుగో సీజన్ ప్రసారం అవుతుంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్ లో పూర్తి అయ్యాయి. తాజాగా మూడో ఎపిసోడ్ కూడా వచ్చేస్తుంది. ఈ షోకు లక్కీ భాష్కర్ టీమ్ వచ్చారు. ఆ ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక నిన్న దీపావళి సందర్భంగా రెండో ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ లో లక్కీ భాస్కర్ టీమ్ తరపున దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, నాగవంశీ, మీనాక్షి చౌదరి గెస్టులుగా వచ్చారు.. ఈ షోలో అజ్ఞాతవాసి సినిమా ప్రస్తావన రావడం ఇప్పుడు వైరల్ గా మారాయి..


అన్ స్టాపబుల్ షోలో బాలయ్య కుండ బద్దలు కొట్టినట్లు అడిగే ప్రశ్నలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. అందుకే షో సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ షోలో మీ లైఫ్ లో అన్‌స్టాపబుల్ మూమెంట్ ఏంటి అని నిర్మాత నాగవంశీని అడిగారు. దీనికి నాగవంశీ స్పందిస్తూ.. 2018 లో బాగా అంచనాలు ఉన్న సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఆ తర్వాత ఏమవుతుంది, ఎటు వెళ్తుంది అని ఫీల్ అయ్యాను. అప్పుడు త్రివిక్రమ్ బయటకు వచ్చి మళ్ళీ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు. లైఫ్ లో ఇప్పటివరకు అదొక్కటే బాధ తప్ప ఇంకేమి లేదు అని అన్నారు.. అజ్ఞాతవాసి టు అలా వైకుంఠపురంలో అనే టాపిక్ ను తీసుకొని వచ్చారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

పవన్ కళ్యాణ్ సినీ కే్రీర్ లో ఇలాంటి భారీ డిజాస్టర్ ఎప్పుడు అందుకోలేదు.. అజ్ఞాతవాసి మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఆ సినిమా గురించి ఈ షోలో ప్రస్తావించడం పై గుసగుసలు వినిపిస్తున్నాయి. లైఫ్ లో ఇప్పటివరకు అదొక్కటే బాధ తప్ప ఇంకేమి లేదు అని ప్రొడ్యూసర్ అనడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నాయి. ఒక్కటి పోతే తర్వాత అన్ని సూపర్ హిట్ సినిమాలే పవన్ కళ్యాణ్ చేశారు. మరి ఈ మూవీ పేరునే మళ్లీ తీసుకురావడం అవసరం లేదు కదా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పైర్ అవుతున్నాయి. మొత్తానికి సోషల్ మీడియా దీనిపై పెద్ద చర్చే నడుస్తుంది. ఇక నిన్న దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాష్కర్ మూవీ పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మోత మొగిస్తుంది. ఇక ఎంత కలెక్షన్ ను రాబడుతుందో చూడాలి.. బాలయ్య ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. Nbk 109 మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అలాగే అఖండ 2 షూటింగ్ ను మొదలు పెట్టారు..


Related News

OTT: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న కొత్త మూవీ.. అదిరిపోయే క్యాప్షన్!

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు .. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Netflix Top Movies: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 మూవీస్ ఇవే.. ట్రెండింగ్ లో ఆ మూవీ..!

OTT Movie : 1 గంట 54 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్… రన్నింగ్ ట్రైన్ లో ఊహించని ట్విస్టులు… బుర్రకు పదును పెట్టే కథ

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో జల్సా… ఒక్కొక్కరు ఒక్కోలా … క్లైమాక్స్ బాక్స్ బద్దలే

OTT Movie : వింత జంతువుతో అమ్మాయి సరసాలు… ఫ్రెండ్ తో కలిసి పాడు పని… ఇది అరాచకమే

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

OTT Movie : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్

Big Stories

×