BigTV English

OTT Movie : తప్ప తాగి గర్ల్ ఫ్రెండ్ ను చంపే తాగుబోతు బాయ్ ఫ్రెండ్… 15 ఏళ్ళ తరువాత వెలుగులోకి నిజం

OTT Movie : తప్ప తాగి గర్ల్ ఫ్రెండ్ ను చంపే తాగుబోతు బాయ్ ఫ్రెండ్… 15 ఏళ్ళ తరువాత వెలుగులోకి నిజం

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అనతి కాలంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూసేటప్పుడు ఆ కిక్కే వేరు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆత్రుతతో మూవీ లవర్స్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ను చూస్తారు. అటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈరోజు మన మూవీ సజేషన్. ఆ మూవీ పేరేమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఈ మూవీ పేరు “ద డిగ్” (The Dig). ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో హీరో తాగిన మత్తులో తన గర్ల్ ఫ్రెండ్ ను చంపేస్తాడు. ఆమె బాడీని వెతికే క్రమంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని చంపిన కారణంగా 15 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి తిరిగి ఇంటికి వస్తాడు. అతడు ఏం చేస్తున్నాడో తెలియనంతగా తాగి తన గర్ల్ ఫ్రెండ్ ని చంపి ఎక్కడ పూడ్చి పెట్టాడో కూడా మరచిపోయి ఉంటాడు. హీరో తన ఇంట్లోకి వచ్చిన తర్వాత మందు బాటిల్స్ చూసి వాటిని పారబోస్తాడు. ఎందుకంటే ఆ మందు తాగే అతడి జీవితం ఇలా అయిందనుకొని బాధపడుతూ ఉంటాడు. ఈలోగా ఆ ఇంటికి దగ్గరలో కొంచెం చప్పుడు రావడంతో అటు వెళ్లగా ఇతని గర్ల్ ఫ్రెండ్ తండ్రి, చెల్లెలు అక్కడ ఏదో తవ్వుతూ ఉంటారు. దగ్గరకు వెళ్లి చూడగా వాళ్లు 15 సంవత్సరాల నుంచి ఆమె శవాన్ని వెతుకుతూ ఉంటారు. అది చూసి హీరో మరింత బాధపడతాడు. హీరోని ఆమె తండ్రి నా కూతుర్ని ఎందుకు చంపావు అంటూ అతన్ని దుర్భాషలాడుతాడు.

నువ్వు మందు తాగి నా కూతుర్ని చంపావు. మళ్లీ మందు తాగి ఆమె శవం ఎక్కడుందో గుర్తుకొస్తుందేమో ట్రై చెయ్యి అంటాడు. హీరో మళ్లీ ఎక్కువగా మందు తాగుతాడు అయినా ఏమీ గుర్తుకు రాదు. ఈలోగా చనిపోయిన ఆమె చెల్లెలు ఏమిలి ఇతని దగ్గరికి వస్తుంది. అప్పుడు అతను ఆమె మెడలో హీరో గర్ల్ ఫ్రెండ్ ధరించిన ఒక చైన్ చూస్తాడు. ఈ చైన్ నీకు ఎక్కడ దొరికింది అని హీరో ఆమెను అడుగుతాడు. ఇది మా అమ్మ చనిపోతూ నాకు ఇచ్చింది అని సమాధానం చెబుతుంది. హీరోకి అప్పుడే అనుమానం కలుగుతుంది. తాగిన మత్తులో నేను చంపానా, లేదా మరి ఏమైనా జరిగిందా అని ఆలోచిస్తుండగా దిమ్మ తిరిగే విషయాలు హీరో తెలుసుకుంటాడు. హీరో తెలుసుకున్న ఆ విషయాలు ఏమిటి? నిజంగానే హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని చంపాడా? 15 సంవత్సరాలుగా ఆ శవం వాళ్లకు ఎందుకు దొరకలేదు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ మీడియా(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి.

Related News

OTT Movie : బిగ్ బాస్ తనూజ నటించిన మొట్ట మొదటి తెలుగు మూవీ… ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

OTT: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న కొత్త మూవీ.. అదిరిపోయే క్యాప్షన్!

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు .. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Netflix Top Movies: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 మూవీస్ ఇవే.. ట్రెండింగ్ లో ఆ మూవీ..!

OTT Movie : 1 గంట 54 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్… రన్నింగ్ ట్రైన్ లో ఊహించని ట్విస్టులు… బుర్రకు పదును పెట్టే కథ

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో జల్సా… ఒక్కొక్కరు ఒక్కోలా … క్లైమాక్స్ బాక్స్ బద్దలే

OTT Movie : వింత జంతువుతో అమ్మాయి సరసాలు… ఫ్రెండ్ తో కలిసి పాడు పని… ఇది అరాచకమే

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

Big Stories

×