OTT Movie : హారర్, ఫాంటసీ, అడ్వెంచర్… ఇలా ఓటీటీలో ఎన్నో జానర్ల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అందులోనూ ఈ మూడు జానర్లు కలిసి ఉన్న సినిమాలు చాలా అరుదు. ఒకే సినిమాలో ఇన్ని జానర్లు కలిసి ఉంటే వచ్చే కిక్కే వేరప్పా అన్పించక మానదు ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీని చూస్తే. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చు? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్…
ఈ మూవీ పేరు “Shortcut”. 2020లో ఇంగ్లీష్ భాషలో రిలీజ్ అయిన ఇటాలియన్ హారర్, ఫాంటసీ, అడ్వెంచర్ చిత్రం ఇది. అలెసియో లిగురీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జాక్ కేన్ (నోలన్), జాక్ సుట్‌క్లిఫ్ (రెగ్గీ), సోఫీ జేన్ ఒలివర్ (బెస్), జాండర్ ఎమ్లానో (కారల్), మోలీ డ్యూ (క్వీనీ) ప్రధాన పాత్రలు నటించారు. ఈ మూవీ గిఫ్ఫోని ఫిల్మ్ ఫెస్టివల్‌లో 2020లో ప్రీమియర్ అయింది. ఈ చిత్రం 1.3 మిలియన్ల బడ్జెట్‌తో తెరకెక్కగా, 800,000 మిలియన్ల వసూళ్లు సాధించింది.
కథలోకి వెళ్తే…
ఈ చిత్రం ఒక యువకుడు (పసుపు జాకెట్‌లో) అడవిలో భయంతో పరుగెత్తుతూ, నిస్సహాయంగా పడిపోవడం కనిపించడంతో ప్రారంభమవుతుంది. బ్రిటన్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో ఐదుగురు టీనేజర్లు… నోలన్ (జాక్ కేన్), బెస్ (సోఫీ జేన్ ఒలివర్), క్వీనీ (మోలీ డ్యూ), రెగ్గీ (జాక్ సుట్‌క్లిఫ్), కారల్ (జాండర్ ఎమ్లానో) ఉంటారు. వీళ్లంతా తమ బస్ డ్రైవర్ జోసెఫ్ (టెరెన్స్ ఆండర్సన్)తో కలిసి ఒక ఫీల్డ్ ట్రిప్ కి వెళ్తారు. అలా వెళ్తుండగా, రోడ్డుపై ఒక చెట్టు కూలడంతో జోసెఫ్ ఒక షార్ట్‌కట్ రోడ్డులో వెళ్లాలని డిసైడ్ అవుతాడు.
కానీ ఆ రోడ్లో మానవ మాత్రుడన్న వాడే కన్పించడు. పైగా అదొక అడవి మార్గం. అలా వెళ్తుండగా, రహదారిపై ఒక చనిపోయిన జంతువును తొలగించడానికి జోసెఫ్ బస్సు నుండి దిగి, బయటకు వెళ్తాడు. అప్పుడు పెడ్రో మిన్‌గెల్లా (డేవిడ్ కీస్) అనే ఒక ఎస్కేప్డ్ కాన్విక్ట్ గన్‌తో బస్సును హైజాక్ చేస్తాడు. అతన్ని తమతో పాటు తీసుకెళ్లమని బెదిరిస్తాడు. టీనేజర్లను సహాయం కోసం కాల్ చేయకుండా ఉండేలా తమ ఫోన్‌లను విసిరేయమని ఆదేశిస్తాడు.
ఈ ప్రయాణంలోనే రాత్రి సమయంలో బస్సు ఒక టన్నెల్‌లో ఆగిపోతుంది, సడన్ గా లైట్లు అన్నీ ఆగిపోతాయి. జోసెఫ్ బస్సును రిపేర్ చేయడానికి బయటకు వెళ్తాడు. కానీ ఒక రాక్షస జీవి (బ్యాట్ లాంటి, రక్తం తాగే జీవి) అతన్ని దారుణంగా చంపేస్తుంది. పెడ్రో కూడా ఈ జీవి చేతిలో చనిపోతాడు. టీనేజర్లు టన్నెల్‌లో ఒంటరిగా మిగిలిపోతారు. వాళ్ళు ఆ బస్సు నుండి పారిపోయి, ఒక భూగర్భ బంకర్‌లో దాక్కుంటారు. అది ఆ జీవి గూడుగా కావడం ఇక్కడం ఊహించని ట్విస్ట్. మరి ఇంతకీ ఆ టన్నెల్ నుంచి వాళ్ళల్లో ఎవరైనా బయటపడ్డారా? ఒకవేళ వస్తే ఎలా ప్రాణాలు కాపాడుకోగలిగారు? ఆ వింత జీవి ఏంటి? వాళ్ళను ఏం చేసింది? అనేది తెరపై చూడాల్సిన కథ.
Read Also : ఓటీటీలోకి న్యూ ఏజ్ యూత్ ఫుల్ డ్రామా… బెడ్ నుంచి ఆ సీన్ల దాకా అన్నీ ఉన్న స్టోరీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?