BigTV English

OTT Movie : ఎక్స్ తలపై ఎక్కి ఆటాడించే ఆడ డెవిల్… దెయ్యాలకే చెమటలు పట్టించే గ్యాడ్జెట్… కిక్కెంచే హర్రర్ థ్రిల్లర్

OTT Movie : ఎక్స్ తలపై ఎక్కి ఆటాడించే ఆడ డెవిల్… దెయ్యాలకే చెమటలు పట్టించే గ్యాడ్జెట్… కిక్కెంచే హర్రర్ థ్రిల్లర్

OTT Movie : స్పైన్ చిల్లింగ్ హర్రర్ మూవీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ ఎప్పటిలా రివేంజ్ హర్రర్ డ్రామాలు కాకుండా కొంచం కొత్తగా ఉంటే ఆ కిక్కే వేరు కదా. అలాంటి సినిమానే ఈ మూవీ. ఇందులో ఓ కెమెరా దెయ్యాలు ఎక్కడున్నా పట్టేస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ హర్రర్ కథా చిత్రం ఏ ఓటీటీలో ఉందో చూసేద్దాం పదండి.


కథలోకి వెళ్తే…
ఇదొక థాయ్ హర్రర్ సినిమా. ఇందులో ఫోటోగ్రాఫర్ థన్ (టన్), అతని స్నేహితురాలు జేన్ (నట్టవీరనుచ్ థోంగ్‌మీ) ఒక కారు ప్రమాదంలో ఒక అమ్మాయిని ఢీకొట్టి ఆమెను అలాగే వదిలేసి పారిపోతారు. ఆ తర్వాత టన్ తీసిన ఫోటోలలో విచిత్రమైన నీడలు, ముఖాలు కనిపిస్తాయి. ఈ నీడలు నాట్రే అనే అమ్మాయి ఆత్మవని తెలుస్తుంది. ఆమె టన్ మాజీ ప్రేయసి. టన్ తన అపార్ట్‌మెంట్‌లో నాట్రే ఆత్మ ఇంకా తనను వెంటాడుతోందని భావిస్తాడు. అతను ఒక పోలరాయిడ్ కెమెరాతో గదిలోని ప్రతి మూలను ఫోటోలు తీస్తాడు. నాట్రే ఆత్మను కనుక్కోవాలని ట్రై చేస్తాడు. అతని స్నేహితులు ఒక్కొక్కరూ ఆత్మహత్య చేసుకుంటారు.

కానీ ఏ ఫోటోలోనూ ఆమె కనిపించదు. దీంతో కోపంతో టన్ కెమెరాను నేలపైకి విసిరేస్తాడు. కానీ అది ఊహించని విధంగా క్లిక్ అవుతుంది. అతని ఫోటోను తీస్తుంది. టన్ ఆ ఫోటోను చూసి అతను షాక్ అవుతాడు. ఫోటోలో నాట్రే ఆత్మ అతని భుజాలపై కూర్చొని ఉంటుంది. ఆమె చేతులు అతని కళ్ళను కప్పుతూ ఉంటాయి. నాట్రే రూపం భయంకరంగా ఉంటుంది. ఆమె కళ్ళు ఖాళీగా, చీకటిగా ఉండగా, ఆమె చెదిరిన జుట్టు అతని ముఖం చుట్టూ వేలాడుతూ ఉంటుంది. ఆమె తెల్లటి దుస్తులు ధరించి, భయంకరమైన ఆత్మలా కనిపిస్తుంది. ఈ భయంకర దృశ్యం టన్‌ను గందరగోళంలో పడేస్తుంది. చివర్లో టన్ సీక్రెట్ బయటపడుతుంది. హీరోని మాజీ ప్రేయసి దెయ్యమై వెంటాడడానికి గల కారణం ఏంటి? మెడ దగ్గర టన్ వెన్నుముక వంగిపోవడానికి గల కారణం ఏంటి? అనే విషయాలు సినిమాలో చూడాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ ను మిస్ అవ్వొద్దు. అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది.


Read Also : టైమ్ ట్రావెల్ చేసి మరీ, సైకో కిల్లర్ చేతిలో అడ్డంగా బుక్కయ్యే అమ్మాయిలు… చెల్లెల్నే వదిలని వాడు వీళ్ళని వదులుతాడా?

ఈ చిత్రాన్ని ఏ ఓటీటీలో చూడవచ్చు?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ 2004లో థాయ్ హారర్ సినిమా Shutter. దర్శకులు బంజాంగ్ పిసన్‌థనకూన్, పార్క్‌పూమ్ వోంగ్‌పూమ్ ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాలోని ఒక ఐకానిక్ సీన్, అది కూడా క్లైమాక్స్‌లో వచ్చే సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘షట్టర్’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఉంది.

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

Big Stories

×