BigTV English

OTT Movie : గోడల్లో 42 కుళ్ళిన శవాలు … మాఫియాను ఢీ కొట్టే లేడీ సింగం … గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్

OTT Movie : గోడల్లో 42 కుళ్ళిన శవాలు … మాఫియాను ఢీ కొట్టే లేడీ సింగం … గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్

OTT Movie : అరిజోనాలోని ఒక శివారు ప్రాంతంలో, FBI ఏజెంట్ కేట్ మేసర్ ఒక డ్రగ్ కార్టెల్ సేఫ్‌హౌస్‌పై దాడి చేస్తుంది. అక్కడ గోడల్లో దాచిన డజన్ల కొద్దీ కుళ్ళిన శవాలను కనిపెడుతుంది. అక్కడ ఒక దాడిలో బాంబు పేలి ఇద్దరు పోలీసులు చనిపోతారు. ఈ భయంకర సంఘటన తర్వాత, కేట్‌ను ఒక సీక్రెట్ టాస్క్ ఫోర్స్‌లోకి తీసుకుంటారు. దానికి ఒక CIA ఏజెంట్ మాట్ గ్రేవర్, అలెజాండ్రో గిల్లిక్ , ఒక మాజీ మెక్సికన్ ప్రాసిక్యూటర్ నాయకత్వం వహిస్తుంటారు. వీళ్ళంతా సోనోరా కార్టెల్ లెఫ్టినెంట్ మాన్యువల్ డయాజ్‌ను పట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇందులో అలెజాండ్రో ఎవరు? ఈ టాస్క్ ఫోర్స్ నిజంగా ఏం చేయాలనుకుంటోంది? కేట్ ఈ మిషన్ ఎలా ఎదుర్కుంటుంది ? ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ  కథ అరిజోనా-మెక్సికో సరిహద్దులో, ఒక డ్రగ్ కార్టెళ్ళతో జరిగే యుద్ధంతో మొదలవుతుంది. అరిజోనాలో, FBI ఏజెంట్ కేట్ మేసర్, ఆమె పార్టనర్ రెజీ వేన్ కలసి ఒక సోనోరా కార్టెల్ సేఫ్‌హౌస్‌పై దాడి చేస్తారు. అక్కడ వీళ్ళు గోడల్లో దాచిన 42 కుళ్ళిన శవాలను కనుగొంటారు. ఈ క్రమంలో అక్కడ ఒక బాంబు దాడి పేలుడు జరిగి, ఇద్దరు పోలీసులు చనిపోతారు. ఈ మిషన్ తరువాత కేట్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ టాస్క్ ఫోర్స్‌లోకి రిక్రూట్ చేస్తారు. దానికి CIA ఏజెంట్ మాట్ గ్రేవర్ నాయకత్వం వహిస్తాడు. అతనితో పాటు అలెజాండ్రో గిల్లిక్, ఒక మాజీ మెక్సికన్ ప్రాసిక్యూటర్, CIA ట్రైన్డ్ హిట్‌మ్యాన్ ఉంటాడు.


టాస్క్ ఫోర్స్ లక్ష్యం సోనోరా కార్టెల్ లెఫ్టినెంట్ మాన్యువల్ డయాజ్‌ను పట్టుకోవడం. కానీ, కేట్ మిషన్‌లోకి వెళ్ళేకొద్దీ, ఈ ఆపరేషన్ అసలు ఉద్దేశ్యం ఏమిటో అర్థం కాదు. కేట్, అలెజాండ్రోతో ఒక రహస్య టన్నెల్ రైడ్‌లో పాల్గొంటుంది. అక్కడ అలెజాండ్రో ఒక నోగలెస్ అవినీతి పోలీసును ఇంటరాగేట్ చేస్తాడు. ఈ సన్నివేశంలో “మెడెల్లిన్” అనే పదం వినిపిస్తుంది.  దీని అర్థం కేట్‌కు తర్వాత తెలుస్తుంది. అలెజాండ్రో చర్యలు, మాట్ రహస్యాలు కేట్‌ను అనుమానంలోకి నెట్టివేస్తాయి. CIA నిజంగా సోనోరా కార్టెల్‌ను ఆపాలనుకుంటోందా, లేక వేరే ఏదైనా ఎజెండా ఉందా? అనే విషయాలను ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : వర్షం పడితే అమ్మాయిల్ని చంపే సైకో … శవాలని కూడా వదలకుండా … ఇదెక్కడి అరాచకం మావా

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ అమెరికన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Sicario’. 2015 లో వచ్చిన ఈ సినిమాకి డెనిస్ విలనెవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మెక్సికో-అమెరికా సరిహద్దులో జరిగే డ్రగ్ వార్‌ను రియలిస్టిక్ కోణంలో చూపిస్తుంది. ఇందులో ఎమిలీ బ్లంట్,బెనిసియో డెల్ టోరో, జోష్ బ్రోలిన్ ,డేనియల్ కలుయా వంటి నటులు నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×