BigTV English

OTT Movie : వర్షం పడితే అమ్మాయిల్ని చంపే సైకో … శవాలని కూడా వదలకుండా … ఇదెక్కడి అరాచకం మావా

OTT Movie : వర్షం పడితే అమ్మాయిల్ని చంపే సైకో  … శవాలని కూడా వదలకుండా … ఇదెక్కడి అరాచకం మావా

OTT Movie : సియోల్ నగరంలో రాత్రి వేళల్లో వర్షంలో యువతులను కిరాతకంగా హత్య చేసే సీరియల్ కిల్లర్ కాంగ్-చెన్ ఒక హిట్-అండ్-రన్ కేసులో డిటెక్టివ్ టే-సూ చేతిలో చిక్కుతాడు. ఆ తరువాత కాంగ్-చెన్ గతం తెలిసి షాక్ అవుతాడు డిటెక్టివ్. ఈ కిల్లర్ చేతిలో డిటెక్టివ్ చెల్లెలు సూ-క్యుంగ్ కాంగ్-చెన్ చివరి బాధితురాలని తెలుస్తుంది. కాంగ్-చెన్‌కు మరణశిక్ష పడినా, అతను శవాలను ఎక్కడ దాచాడో చెప్పకుండా, టే-సూ అతని బావ సెంగ్-హ్యున్ లను మానసికంగా కుంగదీస్తాడు. మూడు సంవత్సరాల తర్వాత, ఒక గ్యాంగ్‌స్టర్ హత్య కేసులో సెంగ్-హ్యున్ అనుమానితుడిగా తేలుతాడు. ఇది తెలిసి డిటెక్టివ్ షాక్  అవుతాడు.  టే-సూ న్యాయం కోసం పోరాడుతాడా ? కుటుంబ బంధాలు అతన్ని ఆపుతాయా?  ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా స్టోరీ సియోల్‌లో సీరియల్ కిల్లర్ కాంగ్-చెన్‌ను డిటెక్టివ్ టే-సూ ఒక హిట్-అండ్-రన్ కేసులో పట్టుకోవడంతో ప్రారంభమవుతుంది. టే-సూ చెల్లెల్ని కిల్లర్ చివరిసారిగా హత్య చేసినట్లు తెలుస్తుంది. కానీ కిల్లర్ శవం ఆచూకీ చెప్పకుండా డిటెక్టివ్ టే-సూని ఇబ్బంది పెడతాడు. కాంగ్-చెన్‌కు మరణశిక్ష విధించబడినా, అతను బాధితుల శవాలను దాచడం వల్ల టే-సూ, సెంగ్-హ్యున్ మానసిక బాధలో మునిగిపోతారు. దక్షిణ కొరియాలో 1997 నుండి మరణశిక్షలు అమలు కాకపోవడం వీళ్ళకు మరింత నిరాశ కలుగుతుంది.


మూడు సంవత్సరాల తర్వాత, టే-సూ ఒక గ్యాంగ్‌స్టర్ బాస్ హత్య కేసును దర్యాప్తు చేస్తుండగా, సెంగ్-హ్యున్ అనుమానితుడిగా తేలుతాడు. ఈ కేసులో  కాంగ్-చెన్‌తో సెంగ్-హ్యున్ చేసిన ఒక రహస్య డీల్‌ వల్ల, మాఫియాతో ఇతనికి ఉన్న సంబంధాలు బయట పడతాయి.టే-సూ న్యాయం కోసం పోరాడుతూ, సెంగ్-హ్యున్ చర్యలు,ఆ డీల్ వెనుక సీక్రెట్స్ ను కనిపెట్టాలనుకుంటాడు. ఈ చిత్రం వర్షంలో చిత్రీకరించిన బ్రూటల్ యాక్షన్ సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. సెంగ్-హ్యున్ చేసిన డీల్ ఏమిటి? ఇది కాంగ్-చెన్‌తో ఎందుకు చేశాడు ? గ్యాంగ్‌స్టర్ హత్య కేసులో సెంగ్-హ్యున్ ఎలా అనుమానితుడయ్యాడు ? అనే వివరాలను మూవీని చూసి తెలుసుకోవల్సిందే.

Read Also : పాటల ప్రపంచంలో రారాజుగా ఓ అనాథ … ప్రియురాలితో స్టేజ్ షో లు … దుమ్ముదులుపుతున్న పంజాబీ మూవీ

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది డీల్’ (The Deal). 2015 లో వచ్చిన ఈ సినిమాకి సన్ యాంగ్-హో దర్శకత్వం వహించారు. ఇందులో కిమ్ సాంగ్-క్యుంగ్ (టే-సూ), కిమ్ సంగ్-క్యున్ (సెంగ్-హ్యున్), పార్క్ సంగ్-వూంగ్ (కాంగ్-చెన్), యూన్ సెంగ్-ఆ (సూ-క్యుంగ్) వంటి నటులు నటించారు. ఈ సినిమాకి IMDbలో 6.1/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో అందుబాటులో ఉంది.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×