WTC 2025 : ఐసీసీ టోర్నమెంట్ లు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతాయి. వీటిలో ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ ప్రతీ నాలుగేళ్లకొకసారి జరిగితే.. టీ-20 వరల్డ్ కప్ రెండేళ్లకొకసారి జరుగుతోంది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ రెండేళ్లకొకసారి జరుగుతుంది. వీటిలో విజయం సాధించిన వారు ఐసీసీ వన్డే వరల్డ్ కప్, టీ-20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీలు గెలుచుకుంటారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 12 ట్రోఫీలను గెలుచుకుంది. భారత జట్టు 06 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. అలాగే తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకున్న దక్షిణాఫ్రికా జట్టు 1998లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజయం సాధించింది. అంటే దాదాపు 27 ఏళ్ల తరువాత సౌతాఫ్రికా జట్టు ఐసీసీ ట్రోఫీ విజయం సాధించడం విశేషం. ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీలు ఎవరెవరు సాధించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Watch : ఇదెక్కడి క్యాచ్ రా నాయనా… వీపుతో కూడా పడతారా..
వన్డే వరల్డ్ కప్ 1975లో వెస్టిండీస్ జట్టు క్లైవ్ లాయిడ్ కెప్టెన్సీలో తొలిసారి టైటిల్ సాధించింది. అలాగే 1979లో కూడా క్లైవ్ లాయిడ్ కెప్టెన్సీలో వెస్టిండిస్ జట్టు గెలవడం విశేషం. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు మొదటిసారిగా వన్డే వరల్డ్ కప్ సాధించింది. 1987 వన్డే వరల్డ్ కప్ లో తొలిసారిగా ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. అప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ గా అలెన్ బోర్డర్ వ్యవహరించారు. అలాగే 1992లో పాకిస్తాన్ కెప్టెన్ గా ఇమ్రాన్ ఖాన్ ఉన్న సమయంలో వన్డే వరల్డ్ కప్ సాధించింది. 1996లో శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ ఆధ్వర్యంలో శ్రీలంక మొదటిసారిగా వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ సాధించింది. 1998లో ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభంలో దక్షిణాఫ్రికా జట్టు ట్రోఫీ గెలుచుకుంది. హాన్సీ క్రోన్జ్ కెప్టెన్ గా కొనసాగారు. స్టీవ్ వాఫ్ కెప్టెన్సీలో 1999 వన్డే వరల్డ్ కప్.. అలాగే స్టీఫెన్ ఫ్లేమింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు 2000 సంవత్సరంలో ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది.
Also Read : AB de Villiers : నాతో ఆడిన ప్లేయర్లందరూ… విష పాముల కంటే డేంజర్… ABD షాకింగ్ కామెంట్స్
ఇక 2002 భారత కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఆధ్వర్యంలో తొలిసారిగా ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది భారత్. అలాగే శ్రీలంక జట్టు కూడా సనత్ జయసూర్య కెప్టెన్సీలో 2002లో ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకుంది. 2003 వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. కెప్టెన్ గా రికీ పాంటింగ్ వ్యవహరించాడు. ఛాంపియన్ ట్రోఫీ 2004 వెస్టిండిస్ బ్రియన్ లారా కెప్టెన్సీలో గెలుచుకుంది. ఆస్ట్రేలియా జట్టు 2006లో ఛాంపియన్ ట్రోఫీ , 2007 వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. రెండింటికీ రికీ పాంటింగే కెప్టెన్. టీ-20 వరల్డ్ కప్ 2007 ఎం.ఎస్. ధోనీ కెప్టెన్సీలో తొలిసారిగా భారత్ విజయం సాధించింది. అలాగే 2009 టీ-20 వరల్డ్ కప్ పాకిస్తాన్ యూనిస్ ఖాన్ కెప్టెన్సీలో గెలుచుకుంది. 2009 ఛాంపియన్ ట్రోఫీ ఆస్ట్రేలియా జట్టు.. కెప్టెన్ రికీ పాంటింగ్ ఆధ్వర్యంలో గెలుచుకుంది. 2010 టీ-20 వరల్డ్ కప్ ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. కెప్టెన్ గా కాలింగ్ వుడ్ వ్యవహరించాడు.
భారత కెప్టెన్ మహేంధ్రసింగ్ ధోనీ ఆధ్వర్యంలో 2011లో వన్డే వరల్డ్ కప్ టైటిల్ సాధించింది. 2012 టీ-20 వరల్డ్ కప్ వెస్టిండీస్ విజయం సాధించగా.. కెప్టెన్ గా డారెన్ సామి వ్యవహరించాడు. ఎం.ఎస్. ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్ ట్రోఫీ 2013లో గెలుచుకుంది. టీ-20 వరల్డ్ కప్ 2014 లసిత్ మలింగ కెప్టెన్సీలో టీ-20 వరల్డ్ కప్ గెలుచుకుంది. వన్డే వరల్డ్ కప్ 2015లో ఆస్ట్రేలియా జట్టు మైకెల్ క్లర్క్ కెప్టెన్సీలో గెలిచింది. టీ-20 వరల్డ్ కప్ డారెన్ సామీ కెప్టెన్సీలో వెస్టీండిస్ మరోసారి గెలుచుకుంది. అలాగే ఛాంపియన్ ట్రోఫీ 2017ను పాకిస్తాన్ సర్పరాజ్ ఖాన్ కెప్టెన్సీలో గెలుచుకుంది. వన్డే వరల్డ్ కప్ 2019 ఇంగ్లాండ్ జట్టు తొలిసారి మోర్గాన్ కెప్టెన్సీలో సాధించింది. న్యూజిలాండ్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2021లో కేన్ విలియమ్సన్ కెప్టెన్.. టీ-20 వరల్డ్ కప్ 2021లో ఆస్ట్రేలియా జట్టు ఫించ్ కెప్టెన్సీలో గెలుచుకుంది. అలాగే టీ-20 వరల్డ్ కప్ 2022 జాస్ బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2023 పాట్ కమిన్స్ కెప్టెన్సీలో భారత జట్టు విజయం సాధించింది. వన్డే వరల్డ్ కప్ 2023 పాట్ కమిన్స్ కెప్టెన్సీలో గెలుచుకుంది ఆస్ట్రేలియా జట్టు. అదేవిధంగా టీ-20 వరల్డ్ కప్ 2004 రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు విజయం సాధించింది. ఛాంపియన్ ట్రోఫీ 2025 రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు విజయం సాధించింది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2025 టెంపా బవుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది.