BigTV English

Siddharth Rai Movie : వీడు ‘అర్జున్ రెడ్డి’ కన్నా ఘోరం… ప్రియురాలి ముందే ఆ పని చేస్తూ… ఎమోషన్స్ తో పిచ్చెక్కించే లవ్ స్టోరీ

Siddharth Rai Movie : వీడు ‘అర్జున్ రెడ్డి’ కన్నా ఘోరం… ప్రియురాలి ముందే ఆ పని చేస్తూ… ఎమోషన్స్ తో పిచ్చెక్కించే లవ్ స్టోరీ

Siddharth Rai Movie : లవ్ స్టోరీలతో సినిమాలు చాలానే వస్తున్నాయి. వస్తూ ఉంటాయి కూడా. మనిషికి కోపం, నవ్వు, బాధ అనే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వీటిలో లవ్ ఎమోషన్ కూడా మనుషుల్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో హీరో లాజికల్ గా బతుకుతుంటాడు. హీరోయిన్ అతనికి లవ్ ఎమోషన్స్ గురించి చెప్తుంది. అప్పటినుంచి హీరో ఆ ఎమోషన్ ని బ్యాలెన్స్ చేయలేకపోతాడు. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? పేరు ఏమిటి? వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో

ఈ లవ్ స్టోరీ మూవీ పేరు ‘సిద్ధార్థ్ రాయ్’ (Siddharth Rai).  2024 లో విడుదలైన ఈ సినిమాను శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్‌పై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మించగా, వి. యశస్వీ దర్శకత్వం వహించాడు. దీపక్ సరోజ్, తన్వి నేగి, నందిని, ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024  ఫిబ్రవరి 23న విడుదల చేశారు. ఈ సినిమా మే 3 నుంచి ఆహా (aha)  ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

సిద్ధార్థ్ తన ప్రియురాలు ఇందుకోసం పరిగెడుతూ వస్తాడు. అతడు ఆ అమ్మాయి కోసం పిచ్చోడిలా తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో లేదని హాస్టల్ కి వెళ్తాడు. అక్కడున్న సెక్యూరిటీలను కొట్టి, ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు లేకపోతే బ్రతకలేనని చెప్తాడు. ఆమె కూడా ఎమోషన్ అవుతూ, అతన్ని వదిలించుకుని వెళ్ళిపోతుంది. పోలీస్ ఆఫీసర్ పృద్వి, సిద్ధార్థ్ ఇంటికి వస్తాడు. అతని మీద కేసు ఫైల్ అవుతుంది. అతని గురించి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకుంటాడు. అతడు ఎందుకు ఇలా అయ్యాడు అనే విషయం సిద్ధార్థ్ తల్లి చెబుతుంది. సిద్ధార్థ్ తండ్రి కి బుక్స్ చదివే అలవాటు ఉంటుంది. అందువల్ల ఇంట్లో సైకాలజీ బుక్స్ ను ఒక లైబ్రరీ లా ఏర్పాటు చేస్తాడు. చిన్నప్పటినుంచి సిద్ధార్థ్ ఆ బుక్స్ చదువుతూ లాజికల్ గా బతకడం నేర్చుకుంటాడు. తిండి, నిద్ర, ఇవి కరెక్ట్ గా ఉంటే చాలు, మిగతావి ఏమి జీవితానికి అవసరం లేదని, ఎమోషన్ లేకుండా బ్రతుకుతూ ఉంటాడు. అలా ఇతడు చదువుకున్న కాలేజీకి, ఇందుఅనే అమ్మాయి వస్తుంది. ఇతడు ఒక అమ్మాయితో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. అనుకోకుండా ఇందు అక్కడికి వస్తుంది. కాసేపు ఎవరు రాకుండా చూస్తూ బయటే ఉండు అని ఇందుకే చెప్తాడు. మొదట సిద్ధార్థ ని ఒక సైకో అనుకుంటుంది. అయితే అతడు చదువులో టాపర్ అని కూడా తెలుసుకుంటుంది.

ఒకరోజు కాలేజ్ ఫంక్షన్ లో ఒక క్విజ్ పోటీ జరుగుతుంది. ఎప్పుడూ గెలిచే సిద్ధార్థ్, ఈసారి ఇందు రావడంతో పోటీ టైగా మారుతుంది. ఇప్పుడు కాలేజ్ నిర్వాహకులు ఎమోషన్స్ గురించి మాట్లాడమంటారు. సిద్ధార్థ్ తిండి, నిద్ర ఇవి ఉంటే చాలని, మిగతావన్నీ అవసరం లేదని తన స్పీచ్ ని ఇస్తాడు. ఆ స్పీచ్ కూడా బాగానే ఉంటుంది. అయితే ఇందు ఎమోషన్స్ గురించి చెప్తూ స్పీచ్ ఇస్తుంది. ఆ స్పీచ్ కి అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. సిద్ధార్థ్ కి అప్పుడు కోపమనే ఎమోషన్ కూడా వస్తుంది. లాజిక్కుల బతికేస్తే సుఖంగా బతకచ్చు, ఎమోషన్స్ తో బ్రతికితే ఆనందంగా బ్రతకవచ్చని తెలుసుకుంటాడు. ఇలా ఇందుకి, సిద్ధార్థకి లవ్ ట్రాక్ నడుస్తుంది. అయితే సిద్ధార్థ్ ఈ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు. అతడు ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేక చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇందు కూడా సిద్ధార్థ ని చూసి భయపడుతూ ఉంటుంది. చివరికి సిద్ధార్థ్ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాడా? ఇందు అతని ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×