OTT Movie : ఓటీటీలో సైకలాజికల్ థ్రిల్లర్, సీరియల్ కిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. అలాంటి సినిమాల కోసం వెతుకుతున్న వారి కోసం ఓ క్రేజీ కల్ట్ క్లాసిక్ మూవీని తీసుకొచ్చేశాము. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
స్టోరీలోకి వెళితే
దిలీప్ ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్. బయటి నుండి చూస్తే సాధారణ, ఆకర్షణీయమైన వ్యక్తిలాగా కనిపిస్తాడు. అతను ఒక రెస్టారెంట్ నడుపుతాడు. సమాజంలో మంచి పేరు ఉన్న మనిషి. అయితే దిలీప్‌కు కు సంబంధించిన ఓ షాకింగ్ ట్విస్ట్ సినిమాను ఇక్కడ కీలక మలుపు తిప్పుతుంది. అతనొక సీరియల్ కిల్లర్. బాల్యం, తన తండ్రి చేసిన ఓ పని కారణంగా అతనికి మహిళలపై తీవ్రమైన విద్వేషం పెరుగుతుంది. అందుకే యువతులను ఆకర్షిస్తాడు, వారితో సన్నిహిత సంబంధం పెట్టుకుని, తర్వాత కిరాతకంగా హత్య చేస్తాడు. అంతేకాదు చంపాక ఆ శవాలను ఒక రహస్య స్థలంలో దాచిపెడతాడు.
శారద (శ్రీదేవి) అనే అమాయక యువతి ఒక రెస్టారెంట్‌లో పని చేస్తుంది. దిలీప్ ఆమెతో ప్రేమలో పడి, ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సరదా మొదట్లో దిలీప్‌ను మంచి వాడు అనుకుంటుంది. కానీ క్రమంగా అతని వింత ప్రవర్తన, సీక్రెట్ గా చేసే పనులపై సందేహం ఆమెకు సందేహం మొదలవుతుంది. ఒక రోజు దిలీప్ సీక్రెట్ రూంను కనిపెడుతుంది శారద. ఆ తరువాత హీరో రహస్యాలన్నీ బయట పడతాయి. అతనొక సీరియల్ కిల్లర్ అన్న విషయం తెలుస్తుంది. మరి నిజం తెలుసుకున్న శారద ఏం చేసింది? అసలు హీరో గతం ఏంటి? అమ్మాయిలంటే అతనికి ఎందుకు అంత ద్వేషం ? చివరికి హీరో ఏం అయ్యాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
ఫ్రీగానే చూడొచ్చు
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సినిమా పేరు ‘సిగప్పు రోజాక్కల్’ (Sigappu Rojakkal). కమల్ హాసన్, శ్రీదేవి మెయిన్ లీడ్స్ గా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఇదొక ఐకానిక్ తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ సినిమాల్లో సీరియల్ కిల్లర్ జానర్‌ను పరిచయం చేసిన మొదటి చిత్రాల్లో ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా 1978లో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పట్లో సూపర్ హిట్ కూడా. 1970లలో సీరియల్ కిల్లర్ థీమ్‌తో సినిమా తీయడం సాహసమే. అయితే భారతీరాజా మాత్రం అద్భుతంగా సినిమాను తీసి సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమాను ఫ్రీగా యూట్యూబ్ (Youtube) లో చూడవచ్చు.
Read Also : ఒకరిని బలి తీసుకుని, మరొకరికి వరాలిచ్చే రాక్షసి… క్లైమాక్స్ వరకు క్షణ క్షణం ఉత్కంఠభరితం