BigTV English

OTT Movie : ఒకరిని బలి తీసుకుని, మరొకరికి వరాలిచ్చే రాక్షసి… క్లైమాక్స్ వరకు క్షణ క్షణం ఉత్కంఠభరితం

OTT Movie : ఒకరిని బలి తీసుకుని, మరొకరికి వరాలిచ్చే రాక్షసి… క్లైమాక్స్ వరకు క్షణ క్షణం ఉత్కంఠభరితం

OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా దుష్టశక్తుల చుట్టూ తిరుగుతుంటాయి. వీటిలో కొన్ని సినిమాలు ఎక్కువగా భయపడుతూ ఉంటాయి. అందుకే ప్రేక్షకులు వీటిని ఒంటరిగా చూడటం కంటే, ఎవరినైనా తోడుగా పెట్టుకుని చూస్తుంటారు. అయితే సినిమా చూసినంత సేపు బాగా ఎంటర్టైన్ అవుతారు. ఈ సినిమాలలో ఉండే ప్రత్యేకత భయపెడుతూ ఎంటర్టైన్ చేయడమే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో దుష్టశక్తి స్విమ్మింగ్ పూల్ లో ఉంటుంది. కొత్తగా ఆ ఇంట్లోకి వచ్చిన కుటుంబానికి ఈ దెయ్యం చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


స్టోరీలోకి వెళితే

వాలర్ ఒక ప్రొఫెషనల్ బేస్‌బాల్ ప్లేయర్ గా ఉండేవాడు. ఒక ప్రమాదం వల్ల అతడు ఆటకు దూరం కావాల్సి వస్తుంది. తన భార్య ఈవ్, టీనేజ్ కూతురు ఇజ్జీ, చిన్న కొడుకు ఎలియట్ తో కలిసి కొత్త ఇంటికి మారుతాడు. ఈ ఇంటిలో ఉన్న స్విమ్మింగ్ పూల్ పిల్లలకు సరదాగా ఉంటుందని, వాలర్ కి ఫిజికల్ థెరపీకి ఉపయోగపడుతుందని భావించి, వాళ్ళు ఈ ఇంటిని ఎంచుకుంటారు. అయితే ఈ పూల్‌లో ఒక దుష్ట శక్తి దాగి ఉందని వారికి తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం రెబెక్కా అనే ఒక చిన్న అమ్మాయి ఈ పూల్‌లో అదృశ్యమై ఉంటుంది. ఆ తరువాత కూడా కొన్ని సంఘటనలు జరిగిఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాలర్ కుటుంబం కూడా విచిత్రమైన, భయానక అనుభవాలను ఎదుర్కొంటుంది. పూల్‌లో ఈత కొడుతున్నప్పుడు ఈవ్, ఇజ్జీ, ఎలియట్‌లు భయంకరమైన దృశ్యాలను చూస్తారు. నీటిలో దెయ్యాలు కనిపించడం, ఎవరో తమను లాగుతున్నట్లు అనిపించడం జరుగుతుంటాయి.


వాలర్ కి మాత్రం పూల్‌లో ఈత కొట్టడం వల్ల తన ఆరోగ్యం మెరుగుపడుతోందని గమనిస్తాడు. కానీ ఈ ఆరోగ్యం వెనుక భయంకరమైన రహస్యం దాగి ఉందని తెలుస్తుంది. ఈవ్ కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ పరిశోధనలో, ఈ పూల్ లోకి నీరు ఒక పురాతన నీటి ఊట నుండి వస్తుందని, అది మనుషుల బలిని కోరే దుష్ట శక్తిని కలిగి ఉందని తెలుస్తుంది. ఈ శక్తి ఒకరి కోరికను నెరవేరుస్తూ, దానికి బదులుగా మరొకరిని బలి తీసుకుంటుంది. వాలర్ ఈ శక్తి ఆధీనంలోకి వెళ్తాడు. కుటుంబం ఈ దుష్ట శక్తి నుండి తమను తాము రక్షించుకోవడానికి పోరాడాల్సి వస్తుంది. చివరికి ఆ దుష్ట శక్తి ఎవరిని బలి తీసుకుంటుంది ? వీళ్ళంతా దానిని ఎలా ఎదుర్కుంటారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : ఒక్క మర్డర్ ఎన్నో అనుమానాలు, థ్రిల్లింగ్ ట్విస్టులు… క్రిప్టో కరెన్సీతో కిక్కెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

 

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ సూపర్‌ నాచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నైట్ స్విమ్’ (Night Swim). దీనికి బ్రైస్ మెక్‌గ్యురే దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2014లో విడుదలైన ఒక షార్ట్ ఫిల్మ్ ఆధారంగా రూపొందించబడింది. వ్యాట్ రస్సెల్, కెర్రీ కాండన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. జాసన్ బ్లమ్, జేమ్స్ వాన్ ఈ మూవీని బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్, అటామిక్ మాన్‌స్టర్ బ్యానర్‌ల క్రింద నిర్మించారు. 2024 జనవరి 5న యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా

OTT Movie : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : కథలు చెప్తూనే పని కానిచ్చే అమ్మాయి… చలికాలంలోనూ చెమటలు పట్టించే సీన్లు… సింగిల్స్ కి మాత్రమే

Param Sundari on OTT: ఓటీటీలోకి జాన్వీ కపూర్ 100 కోట్ల రొమాంటిక్ మూవీ… చూడాలంటే కళ్ళు బైర్లుకమ్మే కండిషన్స్

OTT Movie : ఏం సిరీస్ గురూ… సరస్సులో అమ్మాయి మృతదేహం… ప్రైవేట్ వీడియో లీక్… క్షణక్షణం ఉత్కంఠ, బుర్రబద్దలయ్యే ట్విస్టులు

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ

OTT Movie : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×