Brahmamudi serial today Episode: కంపెనీ ఎంప్లయీస్ దుగ్గిరాల ఇంటికి వస్తారు. వీళ్లందరూ ఈ టైంలో ఎందుకు వచ్చారు అని సుభాష్ అడగ్గానే.. రాజ్‌కు ఘనంగా నివాళి అర్పించడానికి వచ్చారని రుద్రాణి చెప్తుంది. దీంతో ఇదిరాదేవి కోపంగా రుద్రాణిని తిడుతుంది. ఇది ఇలాంటి పనేదో చేస్తుందని ముందే అనుకున్నాను అంటుంది. దీంతో రుద్రాణి అమ్మా రేపు అన్ని బ్రాంచెస్ నుంచి మెయిన్ బ్రాంచుకు వచ్చి రాజ్‌కు శ్రద్దాంజలి ఘటించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు మెయిన్ బ్రాంచ్ వాళ్లే చేద్దాం అనుకున్నారట. నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు చాలా కోపం వచ్చింది. మిగతా వాళ్లకు రాజ్ బాస్ కాదా..? అని గట్టిగా తిట్టాను.
వాళ్లందరిని ఒకే దగ్గరకు రప్పిస్తున్నాను అని చెప్పగానే ఇందిరాదేవి చాల్లే ఆపు బుద్ది లేని గాడిద అంటుంది. దీంతో రుద్రాణి అమ్మా నన్నెందుకు తిడుతున్నావు అంటుంది. దీంతో అపర్ణ అత్తయ్య కాబట్టి తిట్టడంతోనే ఆగిపోయింది. నేను అయితేనా అంటూ కోపంగా రుద్రాణి మీదకు వెళ్లి కొట్టబోతుంది. దీంతో నన్నెందుకు తిడుతున్నారు వదిన. నేనేం చేశాను అంటుంది రుద్రాణి. దీంతో రాజ్ బతికే ఉన్నాడు.. వాడు వస్తాడు అని చెప్పాను ఇంకొక్కసారి నా కొడుకు గురించి మాట్లాడితే మర్యాద ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ.
కావ్య పార్క్ లో కూర్చుని ఉండగా..? రాజ్ స్టైలిష్‌గా రెడీ అయి వస్తాడు. దీంతో కావ్య ఏంటండి మొత్తం స్టైలే కనిపెట్టేశారు అని అడుగుతుంది. దీంతో రాజ్ మీరు కూడా కనిపెట్టేశారా..? నాకు కూడా నేను ఎవరో తెలిసి పోయింది. నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది. ఏంటి అలా చూస్తున్నారు. మీరు చెప్పకుండానే నాకు గతం ఎలా గుర్తుకు వచ్చిందని షాక్ అయ్యారా..? అంటాడు. దీంతో కావ్య ఏవండి మీకు ఏం తెలిసిపోయింది అని అడుగుతుంది. దీంతో రాజ్ నేను ఒకప్పుడు ‘రా’ ఏజెంట్‌ను అవును నిన్ను మీరు నాకు గిఫ్టుగా పంపించిన షర్ట్ పోలీస్ వాళ్లు పంపిస్తే వచ్చిందని పూర్తిగా గుర్తుకు వచ్చింది అని రాజ్ చెప్పగానే.. ఏజెంటా.? ఇన్సూరెన్స్ కట్టిస్తారు వాళ్లేనా..? అని అడుగుతుంది.
దీంతో రాజ్ షాక్ అవుతాడు. వెంటనే రా అంటే ఏంటో ఎక్సప్లెయిన్ చేస్తాడు. దీంతో కావ్య ఇలా కూడా అనిపిస్తుందా..? మీకు.. అని అడగ్గానే.. రాజ్ అనిపించడం ఏంటి..? ఇదే నిజం అంటాడు. దీంతో కావ్య ఇలా మీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది. రోజూ అనిపిస్తుందా..? అప్పుడప్పుడు అనిపిస్తుందా..? అని అడుగుతుంది. దీంతో ఇంకా కవర్ చేయకండి కళావతి గారు. మనం ఇద్దరం అండర్ కవర్ క్రాప్ అని తెలిసిపోయింది. అని చెప్పగానే.. సరే చెప్పండి రా ఏజెంట్ రామ్ మనోహర్ గారు ఇంకా మీకు ఏవేవీ గుర్తుకు వస్తున్నాయి అని కావ్య అడగ్గానే.. గతంలో మనిద్దరం కలిసి సీక్రెట్స్ ఏజెంట్స్‌గా రాలో పని చేస్తూ.. ఎన్నో సక్సెఫుల్ ఆపరేషన్స్ కూడా చేశాము అంటాడు. దీంతో కావ్య పార్ట్‌టైంగా మీరు మెడిసిన్ కూడా చదివారా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ మెడిసిన్ ఏంటి అంటాడు. అదే ఆపరేషన్ చేయాలంటే మెడిసిన్ చదవాలి కదా అంటుంది కావ్య.
దీంతో రాజ్ ఆ ఆపరేషన్ కాదండి.. క్రిమినల్స్ ఆపరేషన్ అది మీకు గుర్తు ఉంది అయినా లేనట్టు నటిస్తున్నారు అంటాడు. దీంతో కావ్య వావ్ మీరు చాలా గ్రేట్ అండి ఎంతైనా మీరు సీక్రెట్ ఏజెంట్ కదా గతాన్ని భలే గుర్తు చేసుకున్నారు మీరు చెప్పింది అంతా విన్న తర్వాత నా రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోవాలనిపిస్తుందండి. కానీ జేబులు లేవని నేను ఆగిపోయానండి అంటుంది. దీంతో రాజ్ ఇప్పటికే నిజం ఒప్పుకుంటారా..? లేక ఇంకా ఏదైనా దాచాలనుకుంటున్నారా..? అని అడగ్గానే కావ్య వెంటనే సార్ మీరు ఇంత ఫర్పెక్టుగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా దాచాలనుకుంటారా..? మీరు నిజంగా సీక్రెట్ ఏజెంటే.. ఐ యామ్ కళావతి నాయర్ రిపోర్టింగ్ సార్ అంటూ నాకు ఆఫీసు టైం అయిపోతుంది. నన్ను ఆఫీసు దగ్గర డ్రాప్ చేస్తారా..? అని అడుగుతుంది. దీంతో రాజ్ ఏయ్ ఈ ఆఫీసు అంతా బయటి ప్రపంచాన్ని నమ్మించడానికే కదా అని అడుగుతాడు. కావ్య అవును మీరు సూపర్ అండి అంటూ పొడిగేస్తుంది.
తర్వాత కావ్యను ఆఫీసుకు కారులో తీసుకెళ్తూ.. ఒక దొంగ బ్యాగు కొట్టేస్తుంటే.. రాజ్ చూసి కారు ఆపి వెళ్లి ఆ దొంగను కొట్టి పోలీసులకు పట్టిస్తాడు. పోలీసులు మీరు ఎవరు అని రాజ్ ను అడగ్గానే.. నేను రా ఏజెంట్‌ను అని బిల్డప్ ఇస్తాడు. దీంతో కావ్య పక్కకు తీసుకెళ్లి పోలీసులతో ఓవర్ చేస్తున్నారు. మీరు రా ఏజెంట్ కాదు కద కనీసం ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా కాదు అంటుది. దీంతో రాజ్ బయపడతాడు. అయినా నాకు వచ్చిన కొరియర్ పోలీస్ వాళ్ల నుంచి వచ్చిందని ఎందుకు చెప్పారు అని అడగ్గానే కావ్య నా చెల్లెలు పోలీస్ కాబట్టి అదే విషయం చెప్పారు అని కావ్య చెప్పగానే రాజ్ కూల్‌గా సర వెళ్దాం పద అంటూ వెళ్లిపోతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?