Singer Saketh :సాధారణంగా సెలబ్రిటీలు ఒక స్టేజ్ కి చేరుకున్నారు అంటే ఆ స్థాయి వెనుక ఎంత కష్టం అనుభవించి ఉంటారో వారికే తెలుసు. అయితే వారు అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, ఊహించని రూపంలో ఎదురయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కావు అని చెప్పాలి. నా అనుకున్న వాళ్ళే నమ్మించి, మోసం చేస్తే ఇక ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పటికే నమ్మిన వారి చేతిలో మోసపోయి, ఇంకొకరిని నమ్మాలంటేనే భయపడే స్టేజ్ కి చేరుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారిలో సింగర్ సాకేత్ కొమాండూరి (Saketh Komanduri) కూడా ఒకరు అని తెలుస్తోంది. రాత్రికి రాత్రే నమ్మిన వాడు మోసం చేశాడని తెలుసుకున్నాను అంటూ తెలిపారు. అంతేకాదు అతడు తనను బాగా వాడుకొని ఆ తర్వాత మోసం చేశాడు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు సాకేత్. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం
అతడు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయా – సాకేత్
తాజాగా తెలుగు ఆహా ఓటీటీ వేదికగా.. తేజస్విని గౌడ (Tejaswini Gowda) యాంకర్ గా వ్యవహరిస్తున్న ‘కాకమ్మ కథలు- సీజన్ 2’ కార్యక్రమానికి సింగర్ సాకేత్ కొమాండూరి తో పాటు పర్ణిక మణ్య (Parnika manya) గెస్ట్లుగా హాజరయ్యారు. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని మేకర్స్ విడుదల చేయగా.. ఇందులో తేజస్విని అడిగే ఒక్కో ప్రశ్నకు ఏమాత్రం తడబడకుండా సమాధానం చెబుతూ ప్రోమోని మరింత ఆసక్తిగా మార్చారు. వీరు సింగర్లు కాదు మహా ముదుర్లు అనేలా తమ సమాధానాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక అందులో భాగంగానే తమ కష్టాలను కూడా చెప్పుకొని అందరి చేత కన్నీళ్లు పెట్టించారు. ఆ ప్రోమోలో తేజస్విని మాట్లాడుతూ..”మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన, బాధాకరమైన విషయం ఏమిటి..?” అని ప్రశ్నించగా సాకేత్ మాట్లాడుతూ..” నేను ఒక వ్యక్తిని నా తమ్ముడి కంటే ఎక్కువగా నమ్మాను. ఇక సొంత మనిషి కంటే కూడా అతడికే ఎక్కువ విలువనిచ్చాను. కానీ అతడు రాత్రికి రాత్రే మోసం చేసి పారిపోయాడు. ఒకరకంగా చెప్పాలి అంటే అతడు నన్ను ఉపయోగించుకున్నాడు. ఆ క్షణం మోసపోయానని తెలిసి జీర్ణించుకోలేకపోయాను..ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను” అంటూ తన బాధను చెప్పుకొని అందరి చేత కన్నీళ్లు పెట్టించారు సాకేత్. ఇక ప్రస్తుతం సాకేత్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సాకేత్ కెరియర్..
సాకేత్ జీవిత విశేషాల విషయానికి వస్తే.. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు. సాకేత్ ఎవరో కాదు సంగీత అధ్యాపకులు, గాయకులు, సంగీత దర్శకులు అయినటువంటి కొమాండూరి రామాచారి , సుజాత దంపతులకు జన్మించారు. సంగీత కుటుంబ నేపథ్యం ఉన్నందున చిన్నప్పటి నుంచి పాటలు, సంగీతం అంటే ఎక్కువగా ఇష్టపడేవాడు సాకేత్. రెండవ తరగతి లోనే మొదటి కచేరి చేశాడు. చిన్నతనంలోనే ఆర్పి పట్నాయక్, మణిశర్మల దగ్గర కోరస్ తో తన సంగీత జీవితాన్ని మొదలుపెట్టారు. ‘బద్రీనాథ్’ మొదలుకొని ‘బాహుబలి’ వరకు వారి దగ్గరే పని చేసిన ఈయన.. పూర్తిస్థాయి ప్లే బ్యాక్ సింగర్ గా మారాక.. సాయి కార్తీక్ అవకాశం ఇచ్చారు. అలా మొత్తం మీద 30 సినిమాలలో పాటలు పాడిన ఈయన ఫైనల్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ కూడా చేశాడు. ఒక కీరవాణి, సాయి కార్తీక్, గోపి సుందర్ వంటి సంగీత దర్శకుల దగ్గర కూడా రెగ్యులర్గా పాటలు పాడుతూ ఉంటారు. ఇక ఇలా తన టాలెంట్ తో , అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించే ఈయన జీవితంలో కూడా విషాదం ఉందని తెలిసి అభిమానులు నిట్టూరుస్తున్నారు.
ALSO READ:HBD Sandeep Kishan: రోజూ 350మందికి అన్నదానం.. త్వరలో పేదల కోసం మరో పనికి శ్రీకారం..!