HBD Sandeep Kishan:ప్రముఖ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. నటనతోనే కాదు మంచి మనసుతో కూడా ఎంతోమంది హృదయాలను దోచుకున్నారు. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. మన సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినీ తారలకు కోట్లల్లో ఆస్తులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలా సంపాదించిన డబ్బులో కొంత బాగాన్ని పేద ప్రజలకు, అవసరమైన వారికి అందజేస్తున్నారు. అలా సేవా కార్యక్రమాలు చేస్తూ.. తమ మంచి మనసు చాటుకుంటున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ను మొదలుకొని చిన్న స్టార్స్ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారి జాబితాలోకి టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కూడా చేరిపోయారు.
నెలకు రూ.4.50 లక్ష ఖర్చు.. ప్రతిరోజు 350 మందికి అన్నదానం..
ప్రస్తుతం సందీప్ కిషన్ ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరికొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరొకవైపు ‘వివాహ భోజనంబు’ అనే రెస్టారెంట్ ను కూడా స్థాపించిన విషయం తెలిసిందే. గత ఏడాది ప్రారంభించిన ఈ రెస్టారెంట్ కి మొత్తం ఏడు బ్రాంచ్లు ఉన్నాయి..ఈ ప్రతి బ్రాంచ్ రెస్టారెంట్ నుంచి ప్రతి రోజు ఉచితంగా 50 మందికి భోజనాలు కూడా పంపిస్తున్నారు సందీప్ కిషన్
ఇలా మొత్తంగా చూసుకుంటే ప్రతిరోజు ఒక్కో రెస్టారెంట్ నుండి 50 మందికి మొత్తం 7 రెస్టారెంట్ల నుండి 350 మంది పేదల కడుపు నింపుతున్నారు ఈ టాలెంటెడ్ హీరో. ముఖ్యంగా అవసరం ఉన్న పేదలు, కూలీలు అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఆహారాన్ని ఉచితంగా పంపిస్తున్నారు. ఇకపోతే నెలకు రూ.4.50లక్షల విలువ చేసే ఆహారాన్ని సందీప్ కిషన్ ఉచితంగా పంపిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసి సెలబ్రిటీలు, ప్రజలు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సందీప్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
త్వరలో సబ్సిడీ క్యాంటీన్లు..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు తక్కువ ధరకే పేద ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి తరహాలోనే త్వరలోనే సబ్సిడీ క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట సందీప్ కిషన్. ప్రస్తుతం దాని గురించే పని చేస్తున్నానని గత ఏడాది వెల్లడించారు. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సందీప్ కిషన్ చేస్తున్న మంచి పనికి అభినందిస్తున్నారు. రియల్ హీరో అంటూ పొగుడుతున్నారు. ఇక సందీప్ కిషన్ విషయానికి వస్తే చివరిగా ‘మజాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇకపోతే ఈరోజు సందీప్ కిషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈయనకు సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఇలా ప్రజలకు మంచి చేస్తూ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ బిజీగా దూసుకుపోతున్నారు.
ALSO READ:Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఒక్కొక్కరిగా స్పందిస్తున్న సినీ తారలు..!