Operation Sindoor Fake News : భారతదేశం “ఆపరేషన్ సిందూర్” పేరుతో పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఈ దాడులు విజయవంతమయ్యాయని భారత ఆర్మీ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ దాడులపై పాకిస్తాన్ కూడా తక్షణమే స్పందించింది. తమ దేశ భద్రతా దళాలు భారత వైమానిక దళానికి చెందిన రెండు రాఫెల్ జెట్లు, ఒక సుఖోయ్-30 యుద్ధవిమానాన్ని కూల్చివేశాయని పాకిస్తాన్ పేర్కొంది. పాక్ మీడియా ఇలాంటి ఫేక్ వార్తలు ప్రసారం చేయడం చాలా ఆశ్చర్యకరం.
ది హిందూ మీడియా కథనం ప్రకారం.. ఈ విధ్వంసకర దాడులకు ప్రతీకారంగా పాక్ ఈ చర్య తీసుకుందని పేర్కొంది. అయితే, భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వాదనలను అబద్ధాలుగా కొట్టిపారేసింది. భారత్ వైమానిక దళానికి చెందిన ఏ ఒక్క యుద్ధ విమానం కూడా కోల్పోలేదని స్పష్టం చేసింది. ఈ దాడుల సమయంలో పాంపోర్, అఖ్నూర్ ప్రాంతాల మీదుగా విమానాలు డ్రాప్ ట్యాంకులు వదిలిన విషయాన్ని భారత రక్షణ వర్గాలు తెలిపాయి.
ఇదంతా పాక్ ఆర్మీ చేస్తున్న ప్రచారం.. అంతా ఫేక్ అని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రత్యేకంగా ‘ఫ్యాక్ట్ చెక్’ నిర్వహించి పాకిస్తాన్ కుట్రలను బయటపెట్టింది. పాకిస్తాన్ ఆర్మీ సోషల్ మీడియాలో.. పెడుతున్న వీడియోలన్నీ పాతవని, అవి భారత్ సైన్యం స్థావరాలకు సంబంధించివి కాదని వెల్లడించింది. కొన్ని వీడియోలు 2024లో ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో జరిగిన ఘర్షణలకు చెందినవని, మరికొన్ని ఐర్లాండ్‌లో జరిగిన ఘటనల దృశ్యాలని చెప్పింది. భారత పౌరులు ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
Social media posts falsely claims that Pakistan destroyed Indian Brigade Headquarters.#PIBFactCheck
❌ This claim is #FAKE
✅ Please avoid sharing unverified information and rely only on official sources from the Government of India for accurate information. pic.twitter.com/9W5YLjBubp
— PIB Fact Check (@PIBFactCheck) May 7, 2025
ఇండియా సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు
ఇదిలా ఉండగా, ఈ దాడుల అనంతరం భారతీయులు సంబరాల్లో మునిగిపోయారు. పాకిస్తాన్ మీద తగిన బుద్దిచెప్పినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. పహల్గాం దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలు కూడా ఈ ఆపరేషన్ పట్ల తమ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా చెరిపివేయాలంటే ఇలాంటివి ఇంకా జరగాలంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు.
దీంతో పాటు సోషల్ మీడియాలో భారత దాడులపై పలు ఫన్నీ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. “అర్థరాత్రి పాకిస్తాన్‌లో సూర్యోదయం జరిగిపోయింది”, “ఇది హ్యాపీ మిడ్‌నైట్ సన్‌రైజ్” అంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తూ నెటిజన్లు స్పందించారు. కర్ణాటక బీజేపీ కూడా అర్థరాత్రి 2 గంటలకే పాకిస్తాన్‌లో ఉదయం జరిగినట్లు ట్విట్టర్‌లో వ్యంగ్యపూరితంగా వ్యాఖ్యానించింది. ఇంకా కొన్ని సినిమాల డైలాగ్స్‌తో పాటు “దివాళీ ముందే వచ్చేసింది” అనే విధంగా వీడియోలతో ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.