BigTV English

OTT Movie : ఓటీటీలో గత్తర లేపుతున్న రాధికా ఆప్టే మూవీ… ఇదెక్కడి అరాచకంరా అయ్యా

OTT Movie : ఓటీటీలో గత్తర లేపుతున్న రాధికా ఆప్టే మూవీ… ఇదెక్కడి అరాచకంరా అయ్యా

OTT Movie : ‘రాధికా ఆప్టే’ ఈ పేరు వింటే కుర్ర కారు హుషారుగా షికారు చేస్తారు. పిచ్చెక్కించే అందాలతో తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను క్రియేట్ చేసుకుంది.  ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక మూవీ రీసెంట్ గా, మే 30వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. మరో సారి తన గ్లామర్ తో  కనువిందు చేసింది. ఈ సినిమా ఒక డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే ..


ప్రైమ్ వీడియో (prime video) లో

ఈ బ్లాక్ కామెడీ మూవీ పేరు ‘సిస్టర్ మిడ్‌నైట్’ (Sister midnight). 2024 లో ఈ సినిమాకి కరణ్ కంధారి దర్శకత్వం వహించారు. ఇందులో రాధికా ఆప్టే, అశోక్ పాఠక్, ఛాయా కదమ్, స్మితా తంబే నటించారు. ఈ మూవీ 2024 మే 19న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ సెక్షన్‌లో వరల్డ్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడింది. 2025 మే 30న భారతదేశంలో థియేట్రికల్‌గా విడుదలైంది. ఇది అరేంజ్డ్ మ్యారేజ్‌లో చిక్కుకున్న ఒక మహిళ డార్క్ ప్రయాణాన్ని, సామాజిక సంప్రదాయాలపై విమర్శాత్మక దృష్టితో, కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది. 1 గంట 56 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDb లో 6.0/10 రేటింగ్ ను కలిగి ఉంది.  ఈ సినిమా యూకే లో ఆపిల్ టీవీ, ప్రైమ్ వీడియో (prime video), ప్లెక్స్ (Plex) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో ఈ సినిమా ఇంకా అందుబాటులో లేదు. ఓటీటీ రిలీజ్ తొందర్లోనే ఉండబోతోంది.


స్టోరీలోకి వెళితే

ఉమా (రాధికా ఆప్టే) అనే అమ్మాయి, గోపాల్ (అశోక్ పాఠక్) అనే సున్నితమైన మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటుంది. అతనితో కలిసి ముంబైకి వస్తుంది. వీళ్ళు ఇరుకుగా ఉండే ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుంటారు. ఇక్కడ ఉమా తన కొత్త జీవితం అలవాటు చేసుకోవడానికి పోరాడుతుంది. గోపాల్ పగటిపూట పనికి వెళ్తాడు, రాత్రి తిరిగి వస్తాడు. కానీ ఉమాతో అతను సరిగ్గా మాట్లాడడు, ఆమెతో శారీరక సంబంధం కూడా పెట్టుకొడు. దీని వల్ల ఉమా ఇంట్లో ఒంటరితనంతో బాధపడుతుంటుంది.

ముంబై లో ఉండే రద్దీ, అలాగే ఆమె చుట్టూ ఉన్న పొరుగువాళ్ళ వల్ల ఉమాకి  లైఫ్ మీద చిరాకు పుడుతుంది. ఈ సమయంలో ఆమె పక్కింటి షీతల్ తో కొంత స్నేహం పెంచుకుంటుంది. కానీ షీతల్ సంతోషకరమైన వైవాహిక జీవితం ఉమాకు మరింత బాధను కలిగిస్తుంది. ఆమె ఈ ఒంటరితనం నుంచి బయటపడటానికి, రాత్రిపూట జనిటర్‌గా పనిచేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల ఆమె పగటిపూట నిద్రపోతూ, రాత్రి మేల్కొని ఉంటుంది. ఈ షిఫ్ట్ ఆమె జీవితంలో వింత మార్పులను తీసుకొస్తుంది.

ఉమా క్రమంగా ఒక వింత జబ్బుతో బాధపడుతుంది. ఆమె తిండి సరిగ్గా తినలేకపోతుంది, ఓ మాదిరి శబ్దాలకు కూడా వినలేకపోతుంది. శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతుంది. ఈ లక్షణాలు ఆమె లోపల దాగి ఉన్న సైకో లక్షణాలు బయటపడతాయి. ఆ తరువాత స్టోరీ ఊహించని రీతిలో సాగుతుంది. చివరికి ఆమె సైకిక్ లక్షణాల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ? ఆమె తన జీవితాన్ని ఎలా జీవిస్తుంది ? తన భర్తతో జీవితాన్ని పంచుకుంటుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : బ్రతికుండగానే చచ్చినట్టు నటించి సైకో డాక్టర్ చేతికి చిక్కే హీరోయిన్… కిక్కెక్కించే కిల్లర్ మూవ

Related News

OTT Movie : భర్తను కంట్రోల్ చేయడానికి మాస్టర్ ప్లాన్… సైకో భార్యకు దిమాక్ కరాబ్ అయ్యే ట్విస్ట్

OTT Movie : ఈ సైకో చేతికి అమ్మాయి దొరికితే అరాచకమే… వదలకుండా అదే పని… గూస్ బంప్స్ తెప్పించే కథ

OTT Movie : దొంగతనం చేసే పిల్లి… థ్రిల్లింగ్ ట్విస్టులు… ఊహించని సర్ప్రైజ్ లతో థ్రిల్ ఇచ్చే మలయాళ మూవీ

OTT Movie : పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన ఏజ్ లో వేషాలేస్తే ఇదే గతి

OTT Movie : మిస్టీరియస్ ప్లేస్ లో అమ్మాయి ట్రాప్… ఒక్కో ట్విస్ట్ కు మతి పోవాల్సిందే

OTT Movie : హెయిర్ కట్ కోసం ఇదెక్కడి అరాచకం సామీ… మనసును కదిలించే కన్నడ మూవీ

Big Stories

×