BigTV English
Advertisement

OTT Movie : ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఇవేం పాడు పనులు పాపా… ఆఫీసర్ ముందే వేషాలు… ఎక్స్ట్రీమ్ హిలేరియస్ సీన్స్

OTT Movie : ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ఇవేం పాడు పనులు పాపా… ఆఫీసర్ ముందే వేషాలు… ఎక్స్ట్రీమ్ హిలేరియస్ సీన్స్

OTT Movie : టైటిల్ లో అరుపులు, పాడు పనులు, వేషాలు… వేషాలు చూసి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. పైగా బాలీవుడ్ కాప్ యాక్షన్-థ్రిల్లర్ సినిమా. కాకపోతే టైటిల్ కు కనెక్ట్ సీన్లు కూడా ఉంటాయి ఫన్నీగా. ఒక బ్రేవ్ పోలీసు అధికారి జీవితంలో జరిగే ఉత్కంఠభరిత సంఘటనలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, దేశభక్తి థీమ్‌లతో తెరకెక్కిన మూవీ ఇది. ఈ చిత్రం 1993 ముంబై బాంబు దాడుల నేపథ్యంలో ఒక భయంకరమైన ఉగ్రవాద కుట్రను ఆపడానికి ప్రయత్నించే స్టోరీ. మరి ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉందో తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…
1993 ముంబై బాంబు దాడుల (12 వేర్వేరు ప్రదేశాలలో 12 బాంబు పేలుళ్లు) నేపథ్యంలో కథ మొదలవుతుంది. ఇందులో DCP వీర్ సూర్యవంశీ (అక్షయ్ కుమార్) ముంబై యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) చీఫ్. ఈ దాడుల్లో ఆయన తన తల్లిదండ్రులను కోల్పోతాడు. మరోవైపు ఈ దాడుల వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఒమర్ హఫీజ్ (జాకీ ష్రాఫ్) అనే లష్కర్ ఉగ్రవాది, అతని సహచరుడు బిలాల్ అహ్మద్ పాక్-ఆక్యుపైడ్ కాశ్మీర్ (POK)కి పారిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒమర్ 26/11 ముంబై దాడుల తర్వాత మరిన్ని బాంబు దాడుల కోసం 40 మంది స్లీపర్ సెల్ ఉగ్రవాదులతో ఒక నెట్‌వర్క్‌ను రూపొందిస్తాడు. వీరు హిందూ పేర్లతో భారతీయులుగా జీవిస్తూ, దాడులు చేయడానికి సిద్ధంగా ఉంటారు.

ఒమర్ కుమారుడు రియాజ్ హఫీజ్ (అభిమన్యు సింగ్) ఈ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషిస్తాడు. వీర్ సూర్యవంశీ, తన సీనియర్ కబీర్ ష్రాఫ్ సహాయంతో, రియాజ్‌ను జైసల్మేర్‌లో (రాజ్‌బీర్ రాఠోడ్ అనే ఫేక్ ఐడెంటిటీతో) అరెస్ట్ చేస్తాడు. దీనితో ఒమర్ నెట్‌వర్క్ కదలిక మొదలవుతుంది. 1993లో ముంబైలోకి వచ్చిన 1000 టన్నుల RDXలో 400 టన్నులు ఉపయోగించారు, మిగిలిన 600 టన్నులు ఇంకా ఎక్కడో దాగి ఉన్నాయని వీర్‌కు తెలుస్తుంది. దీంతో మరో భారీ దాడి ప్లాన్ జరుగుతుందని సమాచారం అందుతుంది. ఈ ప్రమాదకరమైన కుట్రను అడ్డుకోవడానికి వీర్ తన బృందంతో (తారా మంచందాని – నీహారికా రైజాదా, వివాన్ సింగ్ – వివాన్ భటేనా, ఉమాకాంత్ భిడే – ఉమాకాంత్ పాటిల్) కలిసి రాత్రీ పగలు పని చేస్తాడు. అదే సమయంలో ఈ ఉద్యోగం వల్ల వీర్ తన వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కొంటాడు,


ఎందుకంటే అతని భార్య రియా (కత్రినా కైఫ్) విడాకులు ఇచ్చి, కొడుకు ఆర్యన్ ను తీసుకెళ్లిపోవాలి అనుకుంటుంది. మరోవైపు బిలాల్ భారతదేశానికి తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ అతను ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో ఒక థ్రిల్లింగ్ క్లైమాక్స్‌లో వీర్‌ ఈ భారీ ఉగ్రవాద కుట్రను ఆపుతాడు. ఆ ట్విస్ట్ ఏంటి? చివరకు వీర్ తన భార్యాబిడ్డలతో ఉన్నాడా లేదా ? అనేది తెరపై చూడాల్సిందే.

Read Also : వామ్మో… జంతువులుగా మారి మానవ జాతినే లేపేసే మనుషులు… స్పైన్ చిల్లింగ్ సీన్స్ మావా

ఏ ఓటీటీలో ఉందంటే?
రోహిత్ శెట్టి దర్శకత్వంలో తీసిన హిందీ యాక్షన్-థ్రిల్లర్ ‘సూర్యవంశీ’ (Sooryavanshi). అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పర్ఫెక్ట్ ఫ్యామిలి ఎంటర్టైనర్. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

Big Stories

×