India Railways: భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రైల్వే వ్యవస్థలలో ఒకటి. అంతేకాదు, ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా 7,000 కంటే ఎక్కువ స్టేషన్లను కలిగి ఉంది. రోజుకు 22,000కి పైగా రైళ్లను నడుపుతుంది. రోజుకు 2.4 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. దేశంలో వేలాది రైళ్లు ఉన్నప్పటికీ, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ గా పశ్చిమ బెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్వే స్టేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1854లో హౌరా రైల్వే స్టేషన్ కు పునాది రాయి
1854లో స్థాపించబడిన హౌరా రైల్వే స్టేషన్.. దేశంలోని పురాతన రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ దేశ రైల్వే చరిత్రలో కీలకపాత్ర పోషిస్తోంది. తూర్పు భారతదేశంలో 1854లో హౌరా నుంచి హుగ్లీ వరకు మొదటి రైలు ప్రయాణం చేసింది. కాలక్రమేణా, ఇది భారత రైల్వే నెట్ వర్క్ వృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఇది విస్తీర్ణం, ప్లాట్ ఫారమ్ ల సంఖ్యలో కూడా ఈ రైల్వే స్టేషన్ అతి పెద్దది. హౌరా రైల్వే స్టేషన్ 23 ప్లాట్ ఫామ్ లను కలిగి ఉంది. ఇది దేశంలోని అత్యంత రద్దీగా ఉండే, అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. హౌరా స్టేషన్ తూర్పు భారతదేశంలో రైల్వే రవాణాకు ప్రాథమిక గేట్ వేగా పని చేస్తుంది. పశ్చిమ బెంగాల్ ను దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలకు కలుపుతుంది. ఇది రోజువారీ పెద్ద మొత్తంలో ప్రయాణీకులతో పాటు సరుకు రవాణా చేస్తుంది.
ఐకానిక్ నిర్మాణ శైలి
హౌరా స్టేషన్ దాని ఐకానిక్ నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హాల్సే రికార్డో రూపొందించిన స్టేషన్ భవనం, ఎరుపు రంగు ఇటుకతో కూడిన ముఖభాగంతో కూడిన నిర్మాణం గంభీరంగా కనిపిస్తోంది. ఇది విక్టోరియన్, గోతిక్ శైలుల మిశ్రమాన్ని సూచిస్తుంది. హౌరా స్టేషన్ హుగ్లీ నది పశ్చిమ ఒడ్డున ఉంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ ల్యాండ్ మార్క్ లలో ఒకటైన హౌరా వంతెన ద్వారా కోల్ కతాకు నేరుగా అనుసంధానించబడి ఉంది. ఈ వంతెన కోల్ కతా కేంద్ర వ్యాపార ప్రాంతాలకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది.
Read Also: 2 గంటల పాటు రైలును ఆపేసిన ప్రయాణీకులు.. ఎక్కనే ఎక్కమంటూ ఇంజిన్ ముందు హంగామా!
రోజూ 10 లక్షల మంది ప్రయాణం
ఈ రైల్వే స్టేషన్ నుంచి రోజు వారీగా 10 లక్షలకు పైగా ప్రయాణీకులు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. 600 కంటే ఎక్కువ రైళ్లను నిర్వహించే హౌరా రైల్వే స్టేషన్ దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది సుదూర ఎక్స్ ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు రెండింటికీ సేవలు అందిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు కీలకమైన కనెక్టివిటీని అందిస్తుంది.
Read Also: రైలు కిందకు దూసుకెళ్లిన టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. తప్పు నాది కాదు, కారుదే అంటోన్న డ్రైవర్!