Spy Thriller OTT : సిరియా నేపథ్యంలో ఒక స్పై థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో టాప్ రేటింగ్ తో స్ట్రీమ్ అవుతోంది. ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న ఒక అమ్మాయిని కాపాడే క్రమంలో ఈ స్టోరీ ఉంటుంది. ఇందులో యాక్షన్ సీన్లు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. సిరియాలోని యుద్ధ వాతావరణాన్ని చూపించడానికి సినీ బృందం ఏకంగా మొరాకోలోని డేంజర్ ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. అక్కడ ఉన్న ఇరుకైన వీధులు, పాత బిల్డింగ్‌లు చూస్తుంటే నిజంగానే మనం సిరియాలో ఉన్నామా అన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా గన్ ఫైట్స్, బాంబు పేలుళ్ల సీక్వెన్స్‌లు హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. దీనికి ఐయండిబిలో 8.1 రేటింగ్ ఉండటం విశేషం. దీని క్లైమాక్స్ కూడా బీభత్సంగా ఉంటుంది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది ఫ్రీలాన్సర్’ (The Freelancer). ఈ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే నిర్మించగా, భావ్ ధులియా దర్శకత్వం వహించారు. ఇందులో మోహిత్ రైనా ప్రధాన పాత్ర పోషించగా, కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. పరదేశి పాత్రలో మోసపోయిన అమ్మాయిగా కాశ్మీర నటించింది. ఇది శిరీష్ థోరట్ రాసిన ‘ఎ టికెట్ టు సిరియా’ (A Ticket to Syria) అనే నవల ఆధారంగా రూపొందింది. ఈ నవల కూడా ఒక రియల్ స్టోరీనే. ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లతో, 2023 సెప్టెంబర్ 1 నుంచి Jio Hotstarలో స్ట్రీమింగ్
అవుతోంది.
ఈ కథలో ఒక అమ్మాయి తన భర్తను నమ్మి పెళ్లి చేసుకుని హనీమూన్ అని విదేశాలకు వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసేది ఏంటంటే, తన భర్త ఫ్యామిలీ అంతా కలిసి తనని మోసం చేసి సిరియాలోని ఉగ్రవాదుల దగ్గరికి తీసుకెళ్లారని. అక్కడ నరకం చూస్తున్న ఆ అమ్మాయి ఎలాగైనా తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్తుంది. తన కూతురు ప్రాణాపాయంలో ఉందని తెలిసి, ఆ తండ్రి తన స్నేహితుడైన అవినాష్ కామత్ సహాయం కోరతాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ తండ్రి చనిపోవడంతో, ఆ బాధ్యత మొత్తం అవినాష్ మీద పడుతుంది.
హీరో అవినాష్ కామత్ మామూలోడు కాదు, ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్‌గా ఉండి ఇప్పుడు డబ్బుల కోసం దేశాలు దాటి సీక్రెట్ మిషన్లలో కూడా ఉంటాడు. అయితే ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడి కూతురిని ఆ నరకం నుండి బయటపడేస్తానని మాట ఇస్తాడు. అప్పటికే ఆ అమ్మాయి అక్కడ ఉగ్రవాదుల మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటుంది. ఇప్పుడు హీరో ఒక పక్క పక్కా స్కెచ్ వేస్తూ, సిరియా బోర్డర్ దాటి లోపలికి వెళ్లడానికి ప్లాన్ చేస్తాడు. ఇక అసలు ఆట మొదలవుతుంది. చుట్టూ తుపాకులు పట్టుకున్న ఉగ్రవాదులు, ఎప్పుడు ఎటు నుండి బాంబులు పడతాయో తెలియని సిరియా వీధులు. ఇలాంటి చోట హీరో ఒంటరిగా వెళ్లి ఆ అమ్మాయిని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. చివరికి అవినాష్ కామత్ ఉగ్రవాదుల చెర నుంచి ఆ అమ్మాయిని కాపాడతాడా ? అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : మాఫియా డాన్ల మధ్య మొదలయ్యే వేట… ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టించేలా చేసే సినిమా