BigTV English

OTT Movie : మ్యాడ్ సైంటిస్ట్ ప్రయోగం బెడిసికొట్టి కొత్త క్రియేచర్లా మారే వ్యక్తి…. పాములంటే భయపడే వాళ్ళు చూడకూడని మూవీ

OTT Movie : మ్యాడ్ సైంటిస్ట్ ప్రయోగం బెడిసికొట్టి కొత్త క్రియేచర్లా మారే వ్యక్తి…. పాములంటే భయపడే వాళ్ళు చూడకూడని మూవీ

OTT Movie : వింత వింత క్రియేచర్లను క్రియేట్ చేసి, ప్రేక్షకులపై వదలడంలో హాలీవుడ్ మేకర్స్ ముందు వరుసలో ఉంటారు. ఈరోజు మన మూవీ సజెషన్ కూడా ఇలాంటిదే. ఓ మ్యాడ్ సైంటిస్ట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టి ఏం జరిగిందన్నది స్టోరీ. ఈ మూవీని పాములు అంటే భయం ఉన్నవాళ్ళు చూడకూడదు అనే విషయం గుర్తు పెట్టుకోండి. ఇక ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే…
ఈ మూవీ డాక్టర్ కార్ల్ స్టోనర్ (స్ట్రోథర్ మార్టిన్) అనే హెర్పెటాలజిస్ట్ (పాముల అధ్యయన శాస్త్రవేత్త) చుట్టూ తిరుగుతుంది. అతను మానవులను పాములుగా మార్చే ఒక సీరంను సీక్రెట్ గా డెవలప్ చేస్తాడు. ఎందుకంటే మానవ జాతి పర్యావరణ విపత్తుల కారణంగా నాశనమవుతుందని అతను నమ్ముతాడు. పాములుగా మారడం ద్వారా మానవులు ఎలాగైనా బతికేస్తారని భావిస్తాడు.

డాక్టర్ స్టోనర్ ఒక కాలేజీ విద్యార్థి డేవిడ్ బ్లేక్ (డిర్క్ బెనెడిక్ట్)ని తన ల్యాబ్ అసిస్టెంట్‌ గా తీసుకుంటాడు. స్టోనర్ కంటే మునుపటి అసిస్టెంట్ టిమ్ (నోబెల్ క్రెయిగ్) ప్రయోగం వల్ల స్నేక్ మాన్‌గా మారతాడు. కానీ అనుకున్న రిజల్ట్ రాకపోగా, అతనొక విచిత్రమైన క్రియేచర్ గా మారిపోతాడు. దీంతో అతన్ని ఒక కార్నివాల్‌కు అమ్మేస్తాడు. తరువాత స్టోనర్ కొత్త అసిస్టెంట్ డేవిడ్‌కు పాము కాటు నుండి రక్షణ కల్పించడానికని చెప్పి రోజూ ఇంజెక్షన్‌లు ఇస్తాడు. కానీ వాస్తవానికి అది అతన్ని కింగ్ కోబ్రాగా మార్చే సీరం.


మరోవైపు డేవిడ్… స్టోనర్ కూతురు క్రిస్టినా (హీథర్ మెన్జీస్)తో ప్రేమలో పడతాడు. కానీ స్టోనర్ వీళ్ళ ప్రేమను ఒప్పుకోడు. ఎందుకంటే అతను డేవిడ్‌ను పాముగా మార్చాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక నెమ్మదిగా డేవిడ్ శరీరంలో మార్పులు (చర్మం ఊడిపోవడం, ఆకుపచ్చ రంగు, శరీర ఉష్ణోగ్రత తగ్గడం) గమనిస్తాడు. స్టోనర్ ప్రయోగం గురించి క్రిస్టినాకు అనుమానం కలుగుతుంది. డేవిడ్ పూర్తిగా కింగ్ కోబ్రాగా మారిపోతాడు. కానీ స్టోనర్ మరొక పాము కాటు వల్ల చనిపోతాడు. దీంతో డేవిడ్‌ ను తిరిగి మానవుడిగా మార్చే ఏకైక వ్యక్తి లేకుండా పోతాడు. మరి చివరికి డేవిడ్ పరిస్థితి ఏమైంది? అతను ప్రేమించిన అమ్మాయి పరిస్థితి ఏంటి? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే. ఈ మూవీ క్లైమాక్స్ డిస్టర్బింగ్ గా ఉంటుంది, జాగ్రత్త.

Read Also : కామెడీ నుంచి హారర్ దాకా… నెట్‌ఫ్లిక్స్‌ లో మేలో రిలీజ్ కాబోతున్న కొత్త సినిమాల లిస్ట్

రియల్ పాములతో షూటింగ్
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘Sssssss’. 1973లో రిలీజ్ అయిన ఈ అమెరికన్ బాడీ హారర్ ఫిల్మ్ ను బెర్నార్డ్ ఎల్. కౌల్స్కీ డైరెక్ట్ చేశారు. స్ట్రోథర్ మార్టిన్, డిర్క్ బెనెడిక్ట్, హీథర్ మెన్జీస్ ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాలో నిజమైన విషపూరిత పాములు (కింగ్ కోబ్రాలు, బ్లాక్ మాంబా, ఆఫ్రికన్ పైథాన్) ఉపయోగించారు. ఒక సన్నివేశంలో మాత్రమే ఫేక్ కోబ్రా వాడారు. నటీనటులు వీటితో నేరుగా ఇంటరాక్ట్ అవ్వడం అన్నది షూటింగ్‌ను ప్రమాదకరంగా మార్చింది. అయితేనేం 1975లో అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హారర్ ఫిల్మ్స్‌లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌కు ఈ మూవీ నామినేట్ అయింది. కాగా ఈ మూవీ Amazon Prime Videoలో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. 70ల హారర్, కల్ట్ క్లాసిక్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా ఒక నాస్టాల్జిక్ ట్రిప్.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×