Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మను బాబ్జీ ఫాలో చేస్తున్నాడని తెలుసుకున్న అమర్ పోలీసులతో కలిసి వెళ్తాడు. మిస్సమ్మ వస్తున్న కారు డ్రైవర్ ఒక దగ్గర కారు ఆపేస్తాడు. దీంతో మిస్సమ్మ ఏంటన్నా కారు ఇక్కడ ఆపారు అని అడుగుతుంది. దీంతో ఆ డ్రైవర్ మేడం వెంటనే కారు దిగండి.. సారు వాళ్లు వస్తున్నారు అని చెప్తాడు. ఏంటన్నా నువ్వు చెప్పేది అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది మిస్సమ్మ. ఇంతలో అక్కడికి పోలీసులు, అమర్ వస్తారు. వాళ్లను చూసిన బాబ్జీ భయంతో లారీ దిగి పారిపోతుంటాడు. అమర్ మిస్సమ్మను కారులోంచి బయటకు తీసుకొచ్చి రాథోడ్ నువ్వు భాగీని తీసుకుని ఇంటికి వెళ్లిపో అని చెప్తాడు. ఇంతలో పోలీస్ బాబ్జీని చూసి సార్ వాడు పారిపోతున్నాడు అని చెప్పగానే.. అందరూ ఆ బాబ్జీని ఫాలో పట్టుకోవడానికి పరుగెడతారు.
మిస్సమ్మ కోపంగా ఏంటి రాథోడ్ ఇదంతా అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఆ బాబ్జీ ఇక్కడ ఎందుకున్నాడో చెప్పు అంటూ అడగ్గానే రాథోడ్ అయ్యో మిస్సమ్మ నీకు ఇంకా అర్థం కాలేదా..? కొడైకెనాల్ రావడం దగ్గర నుంచి నిన్ను బయటికి రమ్మనడం వరకు అంతా ఆ బాబ్జీని పట్టుకోవడానికి సార్ వేసిన ప్లాన్ పద మిస్సమ్మ అని చెప్పగానే.. మిస్సమ్మ బాధగా ప్లానా..? అంటే వాణ్ని పట్టుకోవడానికి నన్ను ఒంటరిగా ఎర వేశారా..? అంటుంది. రాథోడ్ అవును మిస్సమ్మ అని చెప్పగానే.. మిస్సమ్మ ఏడుస్తూ అనుకుంటూనే ఉన్నాను ఏంట్రా ఉన్నటుండి ఇంత ప్రేమ వచ్చింది అనుకుంటూ కారులో ఒక్కతే ఇంటికి వెళ్లిపోతుంది.
బాబ్జీని పోలీసులు తరుముతుంటారు. దొరకకుండా పారిపోతాడు బాబ్జీ.. ఇంతలో బాబ్జీకి మనోహరి ఫోన్ చేస్తుంది. రేయ్ ఏమైంది చెప్పు అది చచ్చిందా..? చచ్చింది అనే మాట చెప్పు అంటుంది. దీంతో బాబ్జీ మేడం అదంతా ప్లాన్ అమరేంద్ర వేసిన ప్లాన్.. అయన మనం ఏం చేయాలనుకుంటే అది మనం చేశాము. నేను తప్పించుకున్నాను మీకు కూడా ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ ఫోన్ కట్ చేస్తాడు. మనోహరి తాను బాబ్జీతో మాట్లాడిన ఫోన్ స్విచ్చాప్ చేసి దాచేస్తుంది.
తర్వాత మిస్సమ్మ ఇంటికి రాగానే అనామిక ఏమైందని భయంగా అడుగుతుంది. జరిగింది చెప్పి లోపలికి వెళ్లిపోతుంది మిస్సమ్మ. తర్వాత కట్ చేస్తే.. రాత్రికి అమర్ ఇంటికి వస్తాడు. లాన్‌లో ఉన్న మిస్సమ్మను చూసి చూడనట్టు లోపలికి వెళ్తాడు. లోపలికి వచ్చిన అమర్, అనామికను చూసి పిల్లలు భోజనం చేశారా..? అని అడుగుతాడు. చేశారు సార్ అని చెప్పగానే.. భాగీ ఎక్కడ కనిపించడం లేదు అని అడుగుతాడు. దీంతో లాన్ లోనే ఉన్నారు సార్. ఈవెనింగ్ నుంచి అక్కడే ఉన్నారు బయటి నుంచి వచ్చేటప్పుడు కూడా బాధపడుతూ వచ్చారు అని చెప్పి.. సార్ మీరు ఏమీ అనుకోనంటే నేను ఒకటి అడగొచ్చా.. మీరు చేసిన ప్లాన్ వల్లా భాగీ గారికి ఏమైనా జరిగి ఉంటే ఇప్పుడు తప్పించుకున్న బాబ్జీ పగ పెంచుకుని మరోసారి భాగీని చంపడానికి వస్తే అని అడుగుతుంది.
దీంతో అమర్ ఇక రాడు అనామిక.. భాగీకి ఏ ప్రాబ్లమ్ లేదు.. ఏ ప్రమాదము రాదు అని చెప్తాడు. దీంతో అనామిక అంత కచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్. వాడు ఎన్నిసార్లు భాగీ గారి మీద అటాక్ చేశాడో మీకు తెలుసు కదా..? అనగానే వాడు అటాక్ చేసిన విషయమే మీకు తెలుసు మేడం.. కానీ మా సారు వాణ్ని పట్టుకున్న ధైర్యంతో చెప్తున్నాడు అంటాడు రాథోడ్. రాథోడ్ మాటలకు మనోహరి షాక్ అవుతుంది. అనామిక నాకు అర్థం కాలేదు సార్ ఎవరిని అటాక్ చేశారు అని అడగ్గానే అమర్, బాబ్జీని అరెస్ట్ చేశాము. ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు అని చెప్పగానే.. అనామిక హ్యాపీగా ఏంటి మీరు చెప్తుంది నిజమా..? నిజంగా బాబ్జీ దొరికేశాడా..? వాడు పారిపోయాడని భాగీ గారు చెప్పారు అనగానే వాడు పారిపోతుంటే మా సారు చూస్తూ ఊరుకుంటారా..? వెంబడించి వెంబడించి పట్టుకున్నారు అని చెప్తాడు.
పోలీసులు ఇచ్చే ట్రీట్‌మెంట్‌కు వాడు ఎలాగూ నిజం చెప్పేస్తాడు అంటాడు. చాటు నుంచి వింటున్న మిస్సమ్మ హ్యాపీగా బాబ్జీ ప్రాబ్లమ్ కూడా అయిపోయింది ఇక నా గురించి అడుగుతాడు. వచ్చి బతిమాలుతారు. గంట సేపు అయినా బెట్టు చేయాలి అని మిస్సమ్మ అనుకుంటుంటే అమర్ అవును మనోహరి ఎక్కడ అని అడగ్గానే పైనే ఉన్నట్టు ఉన్నారు సార్ అని అనామిక చెప్పగానే రాథోడ్, అమర్ పైకి వెళ్తారు. మిస్సమ్మ, అనామిక దగ్గరకు వచ్చి మనోహరిని తిడుతుంది. తర్వాత మళ్లీ లాన్‌లోకి వెళ్లిపోతుంది. ఇంతలో అమర్ కాళ్ల పట్టీలు తీసుకుని వచ్చి మిస్సమ్మకు చూపిస్తాడు. దీంతో మిస్సమ్మ హ్యాపీగా నాకేనా అండి అంటూ తీసుకోబోతుంటే.. అమర్ ఇవ్వకుండా తానే పట్టీలు తొడిగి మిస్సమ్మకు ఐలవ్యూ చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?