OTT Movie : ఒక రిఫ్రెషింగ్ కన్నడ కామెడీ-హారర్ సినిమా థియేటర్లలో టాప్ లేపుతోంది. ఇది సమాజంలోని స్త్రీల బాధలను సున్నితంగా చూపిస్తూ, కామెడి తో పాటూ , ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తోంది. స్నేహితులతో కలిసి థియేటర్‌లో ఈ సినిమా చుస్తే కడుపుబ్బా నవ్వుకుని ఒక కేక కూడా పెడతారు. ఈ సినిమా కన్నడ బాక్స్ ఆఫీస్ వద్ద 2025లో అత్యధిక కలెక్షన్ లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఏ ఓటీటీలో
‘Su From So’ 2025లో విడుదలైన కన్నడ కామెడీ-హారర్ సినిమా. ఇది J.P. తుమినాడ్ తొలి దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో షనీల్ గౌతమ్, J.P. తుమినాడ్, సంధ్య ఆరకేరె, ప్రకాష్ తుమినాడ్, దీపక్ రాయ్ పనాజే, మైమ్ రామదాస్, రాజ్ B. షెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. లైటర్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్‌పై షషిధర్ షెట్టి బరోడా, రాజ్ B. షెట్టి దీనిని నిర్మించారు. ఈ చిత్రం కన్నడ భాషలో 2025 జూలై 25న థియేటర్లలో విడుదలై, మలయాళ డబ్బింగ్ వెర్షన్ 2025 ఆగస్టు 1న విడుదలైంది. 2 గంటల 17 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో సెప్టెంబర్ నెలలో స్ట్రీమింగ్ కు రానుంది.
స్టోరీలోకి వెళితే
మర్లూర్ అనే తీరప్రాంత గ్రామంలో, సోమేశ్వరానికి సమీపంలో ఈ కథ జరుగుతుంది. అశోక్ అనే యువకుడు, గ్రామంలోని సమస్యలను పరిష్కరించే రవి అన్న ను ఆదర్శంగా తీసుకుంటాడు. రవి అన్న గ్రామంలో గౌరవనీయమైన వ్యక్తి. ఎటువంటి సమస్య అయినా అతని రాకతో పరిష్కారమవుతుంది. అశోక్ ఒక రోజు సోమేశ్వరం నుండి వచ్చిన సులోచన అనే అమ్మాయిని ఇష్టపడతాడు. కానీ ఈ ఇష్టం ఊహించని సంఘటనలకు దారితీస్తుంది. ఎందుకంటే అతను ప్రేమిస్తోంది ఒక ఆత్మని. గ్రామస్తులు అశోక్ శరీరంలో సులోచన ఆత్మ ప్రవేశించిందని పుకార్లు పుట్టిస్తారు. దీంతో గ్రామంలో గందరగోళం మొదలవుతుంది. మొదటి భాగంలో ఈ ఆత్మ మిస్టరీ చుట్టూ కామెడి నడుస్తుంది.
Read Also : మీ ఫ్రెండ్స్ తో కలిసి చూడాల్సిన బెస్ట్ సినిమాలు… అన్నీ తెలుగులోనే
గ్రామస్తులు సులోచన ఆత్మను తరిమికొట్టడానికి వివిధ ఆచారాలతో ప్రయత్నాలు చేస్తారు. అయితే రెండవ భాగంలో కథ మలుపు తిరుగుతుంది. సులోచన కుమార్తె భాను జీవితం, ఆమె ఎదుర్కొన్న సమస్యలు బయటపడతాయి. భాను అనే యువతి, ఆమె తల్లి మరణం తర్వాత సమాజంలోని మగవాళ్ల వలన అవమానాలను ఎదుర్కొంటుంది. ఆమె చుట్టూ ఉన్న పురుషులు, ఆమె మామతో సహా, ఆమెపై చెడు ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఈ సమయంలో అశోక శరీరంలో సులోచన ఆత్మ ఉందనే పుకారు వస్తుంది. ఇక స్టోరీలో అసలు ట్విస్టులు బయటికి వస్తాయి. ఈ సులోచన ఎవరు ? నిజంగానే ఆమె ఆత్మగా మారిందా ? అశోక్ శరీరంలో ఆవహించిందా ? అశోక్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాడు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.