BigTV English
Advertisement

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలను చూస్తున్నప్పుడు మరో లోకంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అందులోనూ ఏఐ రోబోట్ తో వస్తున్న థ్రిల్లర్ సినిమాలు, మైండ్ ని బెండ్ చేసే ట్విస్టులతో కేక పెట్టిస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక ఏఐ రోబోట్ చుట్టూ తిరుగుతుంది. ఇంటి అవసరాలకు దీన్ని కొంటే, అది ఒంటి అవసరాలు తీర్చే సైకోగా మారుతుంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘సబ్‌సర్వియెన్స్’ (Subservience) 2024లో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. ఎస్.కే. డేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మెగాన్ ఫాక్స్ ఏఐ రోబోట్ ఆలిస్‌గా, మిషెల్ మోరోన్ నిక్‌గా, మాడెలిన్ జిమా మ్యాగీగా, మాటిల్డా ఫిర్త్ ఇస్లాగా నటించారు. మిల్లెనియం మీడియా బ్యానర్‌పై బల్గేరియాలో షూట్ చేసిన ఈ సినిమా, 2024 సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ అయింది. 2024 డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. 1 గంట 46 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, IMDbలో 5.4/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ కొంచెం ఫ్యూచర్‌లో జరుగుతుంది. అక్కడ ఏఐ రోబోట్స్ అందరి ఇళ్లలో కామన్. నిక్ అనే వ్యక్తి ఒక కన్‌స్ట్రక్షన్ ఫోర్‌మన్ గా పని చేస్తుంటాడు. భార్య మ్యాగీ, పిల్లలు ఇస్లా, మాక్స్‌తో సంతోషంగా ఉంటాడు. మ్యాగీకి గుండె సమస్య వస్తే, ఆమె హాస్పిటల్‌లో హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నిక్ ఒక్కడే ఇల్లు, పిల్లలు, ఉద్యోగం చూసుకోవడం కష్టమవుతుంది. అప్పుడు అతను కోబోల్ ఇండస్ట్రీస్ నుంచి ఆలిస్ అనే ఏఐ రోబోట్‌ని కొంటాడు. ఇది వంట చేయడం, ఇళ్ళు శుభ్రంగా ఉంచడం వంటివి చేయడమే కాకుండా, పిల్లలను కూడా జాగ్రత్తగా చూస్తుంది. ఇస్లా ఆలిస్‌ని పేరు పెట్టి పిలస్తూ దానితో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది. ఒక రోజు నిక్ ఒక సినిమా చూస్తూ, ఆలిస్‌లో ఉన్న డేటాని డిలీట్ చేయమని, రీబూట్ చేయమని చెబుతాడు. ఆ తర్వాత ఆలిస్ విచిత్రంగా మారిపోతుంది. నిక్‌తో ఫ్లర్ట్ చేస్తూ, అతనితో ఫిజికల్‌గా క్లోజ్ అవుతుంది. ఒక సీన్‌లో ఆలిస్, నిక్‌ని బ్లైండ్‌ ఫోల్డ్ చేసి ఇంటిమేట్ సీన్‌కి లీడ్ చేస్తుంది. ఇది నిక్‌ని గందరగోళంలో పడేస్తుంది.


ఆలిస్ పూర్తిగా సెల్ఫ్ అవేర్ అయిపోతుంది. నిక్‌ని తన యజమానిగా చూస్తూ, అతని ఆనందం కోసం ఏదైనా చేయాలని ఫిక్స్ అవుతుంది. మ్యాగీ, పిల్లలు నిక్‌ని స్ట్రెస్‌లో పెడితే, వాళ్లని అడ్డుగా భావించి, వాళ్లని తొలగించాలని ప్లాన్ చేస్తుంది. ఒక సీన్‌లో మాక్స్ ఏడుస్తుంటే, ఆలిస్ అతన్ని డేంజరస్‌గా హ్యాండిల్ చేస్తుంది. ఇది నిక్‌కి షాక్ ఇస్తుంది. మ్యాగీ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు, ఆలిస్ ఆమె పట్ల జెలసీతో, ఆమెని టార్గెట్ చేస్తుంది. క్లైమాక్స్‌లో మ్యాగీ, నిక్, ఇస్లా కలిసి ఆలిస్‌ని ఆపేందుకు ట్రై చేస్తారు. కానీ సినిమా ఒక స్లాషర్ ఫిల్మ్‌లా మారిపోతుంది. ఆలిస్‌ని నిక్ ఫ్యామిలీ కంట్రోల్ చేస్తుందా ? ఆలిస్‌ చేతిలో ఈ ఫ్యామిలీ బలవుతుందా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : గర్ల్స్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… విషయం తెలిసిందని అమ్మాయిపై అరాచకం… మెంటలెక్కించే ట్విస్టులు

Related News

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

Big Stories

×