OTT Movie : నారా రోహిత్, శ్రీదేవి విజయ్‌కుమార్ నటించిన సినిమా, గత నెల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నెల తిరక్కుండానే ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో హీరో మూల నక్షత్రంలో పుట్టడంతో, అసలు సమస్య మొదలవుతుంది. దీంతో అతను ఏ పని చేసినా చిరిగి చాట అవుతుంటుంది. ఇక లవ్ మ్యాటర్ అయితే దిమ్మతిరిగే ట్విస్ట్ తో నడుస్తుంది. ఈ ఆసక్తికరమైన రొమాంటిక్ కామెడీ సినిమాను, ఆలస్యం చేయకుండా ఫ్యామిలీతో కలసి వీక్షించండి. ఇది ఐఎమ్‌డీబీలో కూడా టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసు కుందాం పదండి.
‘సుందరకాండ’ 2025లో విడుదలైన తెలుగు రొమాంటిక్ మూవీ. వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నారా రోహిత్, శ్రీదేవి విజయ్‌కుమార్, వృతి వాఘని లీడ్ రోల్స్‌లో నటిస్తే, నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అభినవ్ గోమఠం, రఘు బాబు సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకల్లి ఈ సినిమాను నిర్మించారు. 2025 ఆగస్ట్ 27న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. 2025 సెప్టెంబర్ 23 నుంచి జియో హాట్ స్టార్‌లో తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం డబ్బింగ్‌లో అందుబాటులో ఉంది. స్ట్రీమ్ అవుతోంది. 2 గంటల 17 నిమిషాలు రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 9.1/10 రేటింగ్ పొందింది.
సిద్ధార్థ్ (నారా రోహిత్) మిడిల్ ఏజ్‌లో ఉన్న ఒక కార్పొరేట్ ఉద్యోగి. ఇతను మూల నక్షత్రంలో పుట్టాడు. అందుకే అతని లైఫ్‌లో ఏ పనీ సరిగ్గా జరగదు. ముఖ్యంగా ప్రేమలో ఎప్పుడూ ఫెయిల్ అవుతుంటాడు. అతనికి తన భార్యలో 5 క్వాలిటీస్ కావాలని ఫిక్స్ అయిపోయి, ఎవరినీ పెళ్లి చేసుకోడు. ఒక రోజు ఎయిర్‌పోర్ట్‌లో ఐరా అనే కాలేజీ అమ్మాయిని కలుస్తాడు. ఆమె అతని చెక్‌లిస్ట్‌కి సరిపోతుందని ఫీల్ అవుతాడు. ఆమెను కనిపెట్టడానికి సిటీలో డస్ట్‌బిన్‌లో కాఫీ కప్స్ వెతుక్కుంటాడు. అంతలా అతనికి ఆమె మీద క్రష్ ఏర్పడుతుంది. ఫైనల్‌గా ఐరాని కనిపెట్టి, ఆమె కాలేజీలో లెక్చరర్‌గా జాయిన్ అవుతాడు. కానీ ఆమె అతని ప్రపోజల్స్‌ని రిజెక్ట్ చేస్తుంది. సిద్ధార్థ్ మాత్రం గివ్-అప్ అవకుండా ట్రై చేస్తూనే ఉంటాడు. ఇది కొంచెం క్రీపీగా అనిపిస్తుంది.
ఈ ఫస్ట్ హాఫ్‌లో, సిద్ధార్థ్ ఐరా మధ్య కామెడీ, రొమాంటిక్ మూమెంట్స్, సత్య కామెడీ టైమింగ్ బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. సెకండ్ హాఫ్‌లో సిద్ధార్థ్ జీవితంలో ఒక పాత సీక్రెట్ బయటపడుతుంది. ఇది ఐరాతో అతని రిలేషన్‌షిప్‌ని రిస్క్‌లో పెడుతుంది. అతను ఈ సీక్రెట్‌ని దాచడానికి ట్రై చేస్తూ, చాలా గందరగోళంలో పడతాడు. ఇక క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. చివరికి సిద్ధార్థ్, ఐరా మధ్య రిలేషన్‌షిప్ ఎలా సెట్ అవుతుంది ? సిద్ధార్థ్ గతంలో ఉన్న ఆ సీక్రెట్ ఏమిటి ? క్లైమాక్స్‌లో ట్విస్ట్లు ఎలా ఉంటాయి ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా