BigTV English

Ileana: రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న ఇలియానా.. కండిషన్స్ అప్లై!

Ileana: రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న ఇలియానా.. కండిషన్స్ అప్లై!

Ileana:ప్రముఖ గోవా బ్యూటీ ఇలియానా(Ileana D’Cruz) గురించి,ఈమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఈమె నటించే ప్రతి సినిమాలో కూడా ఈమె అందాన్ని పొగడడం కోసమే.. దర్శక రచయితలు కొన్ని సన్నివేశాలను క్రియేట్ చేసేవాళ్ళు.. దీన్ని బట్టి చూస్తే ఇలియానా అందానికి అటు ఆడియన్స్ ఎంతలా మోహితులయ్యేవారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ‘దేవదాసు’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) కు జోడిగా ‘పోకిరి’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో ‘జల్సా’ ,రవితేజ(Raviteja) తో ‘కిక్’ వంటి సినిమాలు చేసి , వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమె.. అక్కడే సినిమాలు చేస్తూ అటు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తోంది.


అభిమానులతో ముచ్చటించిన ఇలియానా..

నిజానికి బాలీవుడ్ లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. సడన్గా 2023లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు చెప్పి ఆశ్చర్యపరిచింది. దీంతో పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత కొడుకు పుట్టాక.. ఆ కొడుకుకి తండ్రి ఎవరు? అన్న విషయాన్ని వెల్లడించింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది ఇలియానా. ఇకపోతే వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ఎప్పుడూ ముచ్చటిస్తూ ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఇంస్టా వేదికగా అభిమానులతో కాస్త టైమ్ స్పెండ్ చేసిన ఈమె.. వారు అడిగిన ప్రశ్నలకు కూడా చక చకా సమాధానం తెలిపింది.


రీఎంట్రీ కి సిద్ధం.. కానీ కండిషన్స్ అప్లై..

ఇందులో భాగంగానే ఒక నెటిజన్ ఒక హిట్ మూవీ సీక్వెల్ గురించి ప్రశ్నిస్తూ..”మేడం.. రైడ్ 2 సినిమాలో మీరు ఎందుకు నటించలేదు? అసలు మీరు రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారు?” అని అడిగాడు. దానికి ఇలియానా మాట్లాడుతూ..” నేను కూడా ఇండస్ట్రీలోకి రావాలని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీని చాలా మిస్ అవుతున్నాను. ముఖ్యంగా ‘రైడ్’ సినిమా నాకెంతో ప్రత్యేకమైన మూవీ. ఆ సీక్వెల్లో కూడా భాగం కావాలనిపించింది. మాలిని పాత్రలో మళ్ళీ ఒదిగిపోవాలని ఉంది. మా డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా (Raj Kumar Gupta), నటుడు అజయ్ దేవగణ్ (Ajay Devgan) తో కలిసి పనిచేయాలని ఉంది. నిజం చెప్పాలంటే సీక్వెల్ తెరకెక్కించాలనుకున్నప్పుడు టీం కూడా నన్ను సంప్రదించింది. మళ్ళీ ఆక్ట్ చేయమని చెప్పింది. కానీ అప్పుడు నాకు కొడుకు పుట్టాడు. దీనివల్ల సినిమా చేయలేకపోయాను. మీ అందరి కోసం కచ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో కం బ్యాక్ అయితే ఇస్తాను. కానీ చిన్న కండిషన్స్ అప్లై అంటూ చెబుతూనే.. తనకు తన క్యారెక్టర్ కు తగ్గట్టుగా ఒక మంచి పాత్ర వచ్చి, తాను కంఫర్ట్ గా ఫీల్ అయ్యే పాత్ర లభిస్తే ఖచ్చితంగా నటిస్తానని” చెప్పుకొచ్చింది. ఇలియానా. మరి ఇలియానా కండిషన్స్ మేరకు అలాంటి పాత్రలు ఏ మేరకు లభిస్తాయో చూడాలి. ప్రస్తుతం ఇలియానా చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:Film industry: లక్ అంటే నీదేనయ్యా… ఈ హీరో కోసం పడిచస్తున్న హీరోయిన్స్.. నిన్న ఆలియా… నేడు త్రిష

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×