OTT Movie : మలయాళం సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమాలను తెరమీద చక్కగా ప్రెసెంట్ చేయగలుగుతున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక వ్యక్తి ఈజీగా డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. ఆతరువాత లేనిపోని కష్టాలు తెచ్చుకుంటాడు. ఈ సినిమా సరదా సన్నివేశాలతో సాగిపోతుంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలలోకి వెళితే …
మనోరమా మాక్స్‌లో స్ట్రీమింగ్
‘Super Zindagi’ ఒక మలయాళ కామెడీ సినిమా. ఇది వింటేష్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్, ముకేష్, పార్వతి నాయర్, జానీ ఆంటోనీ, సురేష్ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2024 ఆగస్టు 9న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం మనోరమా మాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఒక ట్రెజర్ స్కామ్ చుట్టూ తిరుగుతూ, కామెడీ, లైట్-హార్టెడ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా IMDbలో 4.9/10 రేటింగ్ ను సాధించింది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
సిద్ధు (ధ్యాన్ శ్రీనివాసన్) ఒక ఉద్యోగం కూడా లేని యువకుడు. పనిచేయకుండా కోట్లు సంపాదించాలనే పెద్ద కలలు కంటుంటాడు. అతను తన తల్లి, గర్ల్‌ఫ్రెండ్ విద్య (పార్వతి నాయర్) తో సమయం గడుపుతూ, ఎప్పుడూ గ్రాండ్ బిజినెస్ స్కీమ్‌ల గురించి ఆలోచిస్తుంటాడు. ఒక రోజు అతను మైసూర్‌కు వెళ్లినప్పుడు బస్సులో రుద్ర అనే కన్నడ వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి నుండి మళ్ళీ ఒక కాల్ వస్తుంది. రుద్ర తన గ్రామంలో దొరికిన బంగారాన్ని విక్రయించడానికి సిద్ధు సహాయం కోరుతాడు. దీనితో సిద్ధు ఈ అవకాశాన్ని సులభంగా డబ్బు సంపాదించే మార్గంగా భావిస్తాడు. సిద్ధు ఒక వ్యాపారవేత్త అయిన తన స్నేహితుడు ముజీబ్ ను ఈ స్కీమ్‌లో భాగస్వామిగా చేర్చుకుంటాడు. సిద్ధు తన గర్ల్‌ఫ్రెండ్ విద్యను కూడా ఈ స్కీమ్ కోసం డబ్బు ఇవ్వమని ఒప్పిస్తాడు.
Read Also : టీచర్ తో అలాంటి పనులు చేసే స్టూడెంట్… బుర్ర బద్దలయ్యే ట్విస్ట్ తో ఊహించని మలుపు… తెలుగులోనూ స్ట్రీమింగ్