E-Paper
Advertisement

యాక్సిడెంట్ కేసులో అడ్డంగా ఇరుక్కునే పోలీస్… మిస్టీరియస్ మనిషి బ్లాక్ మెయిల్ తో మెంటలెక్కించే ట్విస్ట్

యాక్సిడెంట్ కేసులో అడ్డంగా ఇరుక్కునే పోలీస్… మిస్టీరియస్ మనిషి బ్లాక్ మెయిల్ తో మెంటలెక్కించే ట్విస్ట్
Advertisement

Korean Thriller : ఓవైపు చిరుజల్లులు కురుస్తుంటే… మరోవైపు ఓ సీట్ ఎడ్జ్ క్రైమ్ డార్క్ కామెడీ థ్రిల్లర్ చూస్తుంటే ఎలా ఉంటుంది ? మూవీ లవర్స్ కి ఆ ఊహ ఎంత బాగుంటుందో కదా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ కూడా ఇలాంటి వారి కోసమే. ఈ సినిమా పేరు ‘ఏ హార్డ్ డే’ (A Hard Day). 2014లో రిలీజ్ అయిన ఈ కొరియన్ మూవీని ఎక్కడ చూడొచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇందులో మన హీరో పేరు కొ గన్ సూ. అతను ఒక పోలీస్ ఆఫీసర్. ఇతని జీవితం ఎంత దయనీయమైన పరిస్థితిలో బ్యాడ్ లక్ తో నడుస్తుందంటే… ఒక్కరోజులోనే చెప్పలేని కష్టాల్లో కూరుకుపోతాడు. భార్యతో గొడవ జరిగి ఆమె డివోర్స్ ఇస్తానని చెప్తుంది. అదే రోజు వాళ్ళ అమ్మ చనిపోతుంది. అంతలోనే ఆఫీస్ లో వాళ్ల డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతిపై ఇంటర్నల్ అఫైర్స్ అధికారులు రైడ్ చేస్తున్నారని, తన డెస్క్ కూడా తనిఖీ చేస్తున్నారని చెప్తారు. దీంతో అతను అర్థ రాత్రి తన కారు తీసుకొని స్టేషన్ కి బయలుదేరుతాడు. ఆ ఇన్స్పెక్షన్ కారణంగా పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన డిటెక్టివ్ కు మరో దారుణమైన పరిస్థితి ఎదురవుతుంది.

Advertisement

కంగారులో రోడ్డుపై వేగంగా వెళ్తున్న అతని కారుకి కుక్క అడ్డుపడుతుంది. దీంతో కారును పక్కకు తప్పించే క్రమంలో అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి కారు కిందపడి చనిపోతాడు. ఈ హఠాత్పరిణామానికి విస్తబోయిన సు భయపడి చుట్టూ చూస్తాడు. అక్కడ ఎవరూ కనిపించరు. అప్పటికే తనపై అవినీతి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ హిట్ అండ్ రన్ కేసు కూడా తోడైతే, తన ఉద్యోగం పోయి జైలుకి వెళ్లడం ఖాయమని అనుకుంటాడు. అందుకే ఫోన్ చేయకుండా ఆ శవాన్ని తన కారు డిక్కీలో వేసుకుని, తిరిగి తల్లి అంత్యక్రియలు జరుగుతున్న చోటుకి వెళ్ళిపోతాడు.

ఆ శవాన్ని ఎక్కడ దాచాలా అని ఆలోచిస్తున్న సూకీ ఓ మంచి ఆలోచన తడుతుంది. తల్లి శవపేటికలో ఆ గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని పెట్టీ, ఎవ్వరికీ తెలియకుండా పూడ్చేస్తాడు. హమ్మయ్య… అంతా అయిపోయింది అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఇదంతా జరిగిన కొన్ని రోజుల తర్వాత సూ పోలీస్ స్టేషన్ కి ఓ మర్డర్ కేస్ వస్తుంది. గ్యాంగ్ మిన్ అనే ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేస్తారు. ఆ వ్యక్తి మరెవరో కాదు సు కార్ కింద పడి చనిపోయిన వ్యక్తి. ఇక అతని గురించి ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను కూడా సూ టీం తీసుకుంటుంది.

Advertisement

ఇంకోవైపు ఓ మిస్టీరియస్ వ్యక్తి సుకి ఫోన్ చేసి ఆ శవాన్ని తనకు అప్పగించాలని, తనకు విషయం అంతా తెలుసు అని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఓవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మరోవైపు ఆ అజ్ఞాత వ్యక్తి ఫోన్ తో హీరో ఇబ్బందుల్లో పడతాడు. మరి ఆ చనిపోయిన వ్యక్తిని హీరో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ? ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు ? చనిపోయిన శవం జేబులో ఉన్న సీక్రెట్ కి వెనుకున్న రహస్యం ఏంటి ? క్లైమాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సినిమాపై ఒక లుక్కేయాల్సిందే. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమా తెలుగులో మాత్రం అందుబాటులో లేదు. భాష అడ్డు కాదనుకునేవారు ఈ మూవీని ఇంగ్లీషులో వీక్షించవచ్చు.

Read Also : పాపులర్ ఆటగాడికి 10 ఏళ్ల జైలు శిక్ష… ఎఫ్‌బీఐ సీక్రెట్ ఆఫర్ తో ఊహించని మలుపు

Related News

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

17 ఏళ్ల తర్వాత కిల్లర్ కి విడుదల… అమాయకులను ఇరికించే లాయర్లను వేటాడే కిల్లర్… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

మనుషుల్ని వేటాడే కోటీశ్వరులు… వేటలో చిక్కుకున్న అమ్మాయే వేటగాళ్లను వేటాడితే ? బ్లడీ సర్వైవల్ థ్రిల్లర్

బిగ్ బాస్ తరహాలో మరో రియాలిటీ షో.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×