E-Paper
Advertisement

Retro Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూర్య యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

Retro Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూర్య యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
Advertisement

Retro Movie OTT : తమిళ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం రెట్రో.. మే డే సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ తమిళ్లో మాత్రం భారీ విషయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట మంచి క్రేజ్ ను అందుకుంది. అంతేకాదు కలెక్షన్స్ కు భారీగా వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం పెద్దగా ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు మేకర్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ మూవీ ఓటీటీ హక్కులను ఏ సంస్థ సొంతం చేసుకుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఓటీటీ డీటెయిల్స్.. 

Advertisement

రెట్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ ఫామ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను జూన్ తొలి వారంలో స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.. ఈ మూవీని ముందుగా జనవరి మొదటి వారం లో స్ట్రీమింగ్ కు తీసుకురావాలని నెట్ ఫ్లిక్స్ అనుకుంది. కానీ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో మే చివరి వారంలోనే ఓటీటీ లోకి తీసుకురానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Also Read:సక్సెస్‌ఫుల్ మూవీకి సీక్వెల్… షూటింగ్ స్టార్ట్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

Advertisement

రెట్రో మూవీ స్టోరీ.. 

హీరో సూర్య గత ఏడాది నటించిన కొంగువా సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయింది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బోల్తా కొట్టడంతో ఆయన అభిమానులు నిరాశ పడ్డారు. అయితే రెట్రో విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకొని సూర్య ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్లో అయితే మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా పూజా హెగ్డే ఈ మూవీలో మేకప్ లేకుండా డీగ్లామరస్ లుక్‍లో పూజా కనిపించారు. గడ్డం తో సూర్య గెటప్ కూడా మూసీగా ఉంది. 1990ల బ్యాక్‍డ్రాప్‍ లో రొమాంటిక్ యాక్షన్ మూవీగా రెట్రో ను తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. లవ్ స్టోరీ, గ్యాంగ్‍స్టర్ల వార్ గా ఈ మూవీ స్టోరీ సాగుతుంది. జోజూ జార్జ్, జయరాం, నాజర్, ప్రకాశ్ రాజ్, కరుణాకరన్, స్వసిక కూడా కీలకపాత్రలు పోషించారు.. ఇక రెట్రో చిత్రం సుమారు రూ.70కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటిందని మూవీ టీమ్ ప్రకటించింది..ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‍మెంట్స్, స్టోన్‍బీచ్ ఫిల్మ్స్ బ్యానర్ల పై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా నిర్మించారు..

సూర్య సినిమాల కు క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య మాత్రం ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. అందుకే ఇకమీదట చేసే సినిమాల విషయంలో సూర్య తగు జాగ్రత్తలు తీసుకొని కథలను ఎంపిక చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×