విమానాలు ఆయా కారణాలతో ఆలస్యం అవుతుంటాయి. ఈ విషయాన్ని, కొన్ని విమానయాన సంస్థలు ప్రయాణీకులు ఎయిర్ పోర్టుకు చేరక ముందే చెప్పవు. తీరా ఎయిర్ పోర్టుకు వెళ్లిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్తాయి. కొద్ది గంటల పాటు వెయిట్ చేయాలంటాయి. అయితే, విమానం ఎన్ని గంటలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది? అనే విషయం పైనా క్లారిటీ ఇవ్వవు. గంటల తరబడి ఎయిర్ పోర్టులో నిరీక్షించాల్సి రావచ్చు. అయితే, ఫ్లైట్ డిలే అయిన సమయంలో ప్రయాణీకులకు ఆయా విమానయాన సంస్థలు కొన్ని బెనిఫిట్స్ అందించాల్సి ఉంటుంది. ఇంతకీ అవేంటంటే..
విమానం ఆలస్యం అయితే, అందించే బెనిఫిట్స్
పౌర విమానయాన సంస్థ గైడ్ లైన్స్ ప్రకారం.. ఒకవేళ విమానం ఆలస్యం అయితే, ముందుగానే ప్రయాణీకులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఎయిర్ పోర్టుకు వచ్చి కూర్చున్న తర్వాత చెప్పకూడదు. ఒకవేళ ప్రయాణీకులు ఎయిర్ పోర్టుకు వచ్చిన తర్వాత విమానం డిలే అవుతుందని తెలిస్తే? ప్యాసింజర్లకు కొన్ని బెనిఫిట్స్ అందించాల్సి ఉంటుంది. ఒకవేళ విమానం 3 గంటలు ఆలస్యం అయితే, ఫ్రీగా మీల్స్, రీఫ్రెష్ మెంట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. విమానం 6 గంటలు ఆలస్యం అవుతుందని తెలిస్తే, ఆల్టర్నేటివ్ ఫ్లైట్ కు టికెట్ ఫ్రీగా బుక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే, ప్రయాణీకులు టికెట్ మీద ఖర్చు పెట్టిన మొత్తాన్ని రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే వెయిటింగ్ నైట్ చేయాల్సి వస్తే.. హోటల్ లో ఫ్రీగా రూమ్ బుక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి చేయకపోయినా, సివిల్ ఏవియేషన్ అధికారులకు ఫిర్యాదు చేసే అధికారం ప్రయాణీకులకు ఉంటుంది.
Read Also: రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు.. ఎందుకో తెలుసా?
సో, ఒకవేళ ఇకపై మీరు ఎయిర్ పోర్టుకు వెళ్లిన తర్వాత మీ విమానం లేట్ అవుతుందని తెలిస్తే, ఆయా విమానయాన సంస్థలను అడిగి మరీ, మీకు అందాల్సిన బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ, సదరు విమానయాన సంస్థ మీకు ఎలాంటి బెనిఫిట్స్ అందించకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, రావాల్సిన బెనిఫిట్స్ పొందే ప్రయత్నం చేయాలి.
ఆ నగరాలకు విమాన రాకపోకలు బంద్
ఇక ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించన తర్వాత పాక్ నుంచి డ్రోన్లు భారత గగనతలంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో విమానయాన సంస్థు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు ఉత్తర, పశ్చిమ ప్రాంతంలోని పలు విమానాశ్రయాలకు విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతను పరిగణలోకి తీసుకుని తమ విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. జమ్మూ, అమృత్ సర్, చండీగఢ్, లెహ్, శ్రీనగర్, రాజ్ కోట్ కు విమాన రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపాయి.
Read Also: ఆధార్ ఒక్కటే కాదు, వాటితోనూ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు, అసలు విషయం చెప్పిన ఆర్టీసీ ఎండీ!