E-Paper
Advertisement

Suspense Drama OTT : మొగుడు పోయాడని మరిదితో… అన్నదమ్ముల క్రేజీ థ్రిల్లర్

Suspense Drama OTT : మొగుడు పోయాడని మరిదితో… అన్నదమ్ముల క్రేజీ థ్రిల్లర్

Suspense Drama OTT : ఆర్మీ అంటే ప్రతి ఒక్కరికీ ఎనలేని గౌరవం ఉంటుంది. బార్డర్స్ లో మన కోసం తిండి, నిద్ర మాని కాపలా కాయడం… దేశ ప్రజల కోసం ఫ్యామిలీని సైతం వదిలేయడం, యుద్ధ పరిస్థితుల్లో వాళ్ళు చేసే అడ్వెంచర్స్, అవసరం అయితే ప్రాణాలను తృణప్రాయంగా త్యజించడం వంటివి చేస్తూ రియల్ హీరోలుగా మారతారు. ఇక ఇలాంటి స్టార్స్ మీద ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మాత్రం కాస్త డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఉంటుంది. మరి ఆ మూవీ ఏంటో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ఈ వార్ డ్రామా పేరు ‘బ్రదర్స్’ (Brothers). 2009లో విడుదలైన అమెరికన్ వార్ డ్రామా థ్రిల్లర్ మూవీ ఇది. 2009లో విడుదలైన ఈ అమెరికన్ వార్ డ్రామా థ్రిల్లర్ లో ఫ్యామిలీ రిలేషన్స్, వార్ ట్రామా, సర్వైవల్ థీమ్స్‌ను మెయిన్ గా తీసుకున్నారు. డానిష్ ఫిల్మ్ “Brodre” (2004) రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకు జిమ్ షెరిడాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అఫ్గాన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో సోదరుల మధ్య బంధం, పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (PTSD) అనే అంశాలతో సాగుతుంది. IMDbలో 7.1 రేటింగ్ ఉన్న ఈ మూవీలో టోబీ మాగువైర్ (కెప్టెన్ సామ్ కాహిల్), జేక్ గిల్లెన్‌హాల్ (టామీ కాహిల్ – సామ్ సోదరుడు), నటాలీ పోర్ట్‌మాన్ (గ్రేస్ కాహిల్ – సామ్ భార్య), సామ్ షెపర్డ్ (హ్యాంక్ కాహిల్ – తండ్రి), మారీ టోమీ, కారీ ముల్లిగన్ (కాసీ విల్లిస్) ప్రధాన పాత్రల్లో నటించారు. కేవలం 1 గంట 45 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా 2009 నవంబర్ లో యూఎస్ లో రిలీజ్ అయింది. 26 మిలియన్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే, బాక్సాఫీస్ దగ్గర 43 మిలియన్స్ కి పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు గానూ హీరోయిన్ నటాలీ పోర్ట్‌మాన్ గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ అందుకుంది. ‘బ్రదర్స్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.

Read Also :  ‘ది డెమోన్ హంటర్’ ఓటీటీ రిలీజ్ డేట్… చైనీస్ ఫ్యాంటసీ అడ్వెంచర్ డ్రామా ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే ?

స్టోరీలోకి వెళ్తే…

కథ ఇద్దరు సోదరులు సామ్ కాహిల్ (టోబీ మాగువైర్), టామీ కాహిల్ (జేక్ గిల్లెన్‌హాల్) మధ్య ఉండే బంధం చుట్టూ సాగుతుంది. సామ్ ఒక మెరైన్ ఆఫీసర్. కానీ అనుకోకుండా అఫ్గానిస్తాన్ వార్‌ కు వెళ్లాల్సి వేస్తుంది. అతనికి భార్య గ్రేస్ (నటాలీ పోర్ట్‌మాన్), ఇద్దరు కూతుర్లు ఉంటారు. సంతోషంగా ఉన్న ఫ్యామిలీ లైఫ్ కు వార్ కారణంగా దూరం అవుతాడు. ఇక అతని సోదరుడు టామీ ఎప్పుడూ సమస్యల్లో చిక్కుకుంటూనే ఉంటాడు. జైలు నుంచి తిరిగి వచ్చిన అతనికి తండ్రితో గొడవలు జరుగుతాయి. మరోవైపు వార్ లో సామ్ మిషన్ ‌లో హెలికాప్టర్ క్రాష్ అయి, మిస్ అవుతాడు. దీంతో అందరూ అతను చనిపోయాడని అనుకుంటారు.

విషయం తెలుసుకున్న టామీ సామ్ ఫ్యామిలీకి అండగా ఉంటాడు. త్వరగానే గ్రేస్ తో పాటు పిల్లలతో క్లోజ్ అవుతాడు. గ్రేస్, టామీ మధ్య రొమాన్స్ మొదలవ్వడానికి ఎక్కువ టైమ్ ఏమి పట్టదు. కానీ నిజానికి సామ్ అఫ్గాన్ తాలిబాన్ల చేతిలో టార్చర్ అనుభవిస్తాడు. అక్కడి నుంచి తప్పించుకుని PTSDతో తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సామ్ పూర్తిగా మారిపోయినట్టు కన్పిస్తాడు. బ్రదర్, భార్యకు మధ్య అఫైర్ ఉందేమో అని అనుమానపడతాడు. కారణం లేకుండా కోప్పడతాడు. మరి చివరకి హీరో తన సోదరుడిని, భార్యను ఏం చేశాడు ? క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×