E-Paper
Advertisement

నమ్మించి మోసం చేసే నకిలీ గురువు… కూతురికి నరకం చూపించే తండ్రి… మతిపోగొట్టే థ్రిల్లర్

నమ్మించి మోసం చేసే నకిలీ గురువు… కూతురికి నరకం చూపించే తండ్రి… మతిపోగొట్టే థ్రిల్లర్
Advertisement

Suspense Thriller Series on OTT : నరాలు తెగే ఉత్కంఠతో ఒక కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక పక్కా సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఇందులో రెగ్యులర్ సినిమాల్లోలాగా లవ్, కామెడీ, ఫైట్లు ఉండవు. ఇది చాలా సీరియస్ గా సాగే ఒక మైండ్ బెండింగ్ సిరీస్. సమాజంలో దేవుడి పేరుతో జరిగే మోసాలను, మూఢనమ్మకాలను నమ్ముకుని సామాన్య ప్రజలు ఎలా బలైపోతారో ఈ డ్రామాలో చాలా ప్రాక్టికల్‌గా, భయం పుట్టించేలా చూపించారు. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి ఒక రకమైన యాంగ్జైటీ, ఉత్కంఠ కలుగుతాయి. థ్రిల్లర్, మిస్టరీ, క్రైమ్ జోనర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక పర్‌ఫెక్ట్ వాచ్.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్

ఈ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘సేవ్ మీ” (Save Me). 2017లో వచ్చిన ఒక అద్భుతమైన థ్రిల్లర్ ఇది. ఈ 16 ఎపిసోడ్ల సిరీస్ ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది. ఇది జో గ్యుమ్-సాన్ రాసిన ‘అవుట్ ఆఫ్ ది వరల్డ్’ అనే పాపులర్ కొరియన్ వెబ్‌టూన్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సిరీస్‌ను OCN నెట్‌వర్క్ నిర్మించగా, ఇటు విమర్శకుల నుండి అటు ప్రేక్షకుల నుండి భారీ ప్రశంసలు దక్కాయి దీనికి. ముఖ్యంగా హీరోయిన్ సీయో యీ-జి, విలన్ పాత్ర పోషించిన జో సంగ్-హాల నటన ఈ సిరీస్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ సిరీస్ సాధించిన కల్ట్ సక్సెస్ వల్ల 2019లో “సేవ్ మీ 2” పేరుతో సరికొత్త సీజన్ కూడా వచ్చింది. ఈ రెండు సీజన్లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇది బెస్ట్ కొరియన్ డ్రామాలలో ఎప్పటికీ టాప్‌లో ఉంటుంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇం సాంగ్-మి అనే అమ్మాయి ఫ్యామిలీ బిజినెస్‌లో లాస్ వచ్చి, తమ్ముడు చనిపోయిన డిప్రెషన్‌లో ఒక పల్లెటూరికి షిఫ్ట్ అవుతుంది. ఆ టైమ్‌లో అక్కడ ఉన్న ఒక నకిలీ మత గురువు వీళ్ల అమాయకత్వాన్ని, బాధను వాడుకుని ఆ ఫ్యామిలీ మొత్తాన్ని మైండ్ వాష్ చేసి తన గుప్పిట్లోకి తెచ్చుకుంటాడు. ఆ ముఠా లీడర్ చూపు సాంగ్-మి మీద పడుతుంది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెడతాడు. ఆ నరకంలో మూడేళ్లు బంధీగా ఉన్న సాంగ్-మి, ఒకరోజు రోడ్డు మీద వెళ్తుండగా అనుకోకుండా తన పాత స్కూల్ ఫ్రెండ్స్ కనిపిస్తారు. వాళ్లను చూడగానే ఎవ్వరికీ తెలియకుండా, భయంతో నన్ను కాపాడండని నోటితో సైగ చేస్తుంది.

ఆమె ఆపదలో ఉందని అర్థం చేసుకున్న హన్ సాంగ్-హ్వాన్ స్నేహితులు సాంగ్-మిని ఎలాగైనా రక్షించాలని డిసైడ్ అవుతారు. అయితే ఆ మత ముఠా వెనుక ఊరిలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పోలీసులు ఉంటారు. దాంతో ఆ నలుగురు కుర్రాళ్లు ప్రాణాలకు తెగించి, ఆ ముఠా డెన్ లోకి ఎలా దూరారు? అక్కడ జరిగే దారుణాలను ఎలా బయటపెట్టారు? చివరకు ఆ అమ్మాయిని ఎలా కాపాడారు? అనేదే మెయిన్ స్టోరీ.

Advertisement

Read Also : ఐరోపా మాఫియాను గడగడలాడించిన దొంగ… నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తోన్న సిరీస్

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×