OTT Movie : మలయాళం సినిమాల తరువాత, బెంగాల్ ఇండస్ట్రీ నుంచి, కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకులు వీటిని కూడా బాగా ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. 2024 లో విడుదలై ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన బెంగాలీ మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ క్లైమాక్స్ వరకూ కదలనీయకుండా చేస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఒక పేద కుటుంబానికి చెందిన ఇక్లాఖ్ అలం అనే వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. ధనవంతులు, పేదలను చిన్నచూపు చూస్తారని గ్రహించి, అతను ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక రోజు అతను సెయింట్ బెంజమిన్ స్కూల్ నుండి ఒక చిన్న అమ్మాయి అవంతికను కిడ్నాప్ చేస్తాడు. ఒక ఆఫీసు భవనంలో ఆ అమ్మాయిని బంధీగా ఉంచుతాడు. తన ఉద్యోగం తిరిగి తనకు కావాలని డిమాండ్ చేస్తాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. టివి లలో కూడా హెడ్‌లైన్స్‌లో వస్తుంది. పోలీసులు అతన్ని ఎలాగైనా పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అయితే అతను ఆమె తలపై గన్ గురిపెట్టి అందరినీ బెదిరిస్తాడు. ఇది తెలుసుకున్న అవంతిక తల్లి ఐరా, ఇక్లాఖ్ కొడుకు గుడ్డును కిడ్నాప్ చేస్తుంది. ఆమె కూడా నా పాపాకు ఏమైనా జరిగితే నీ కొడుకుని చంపేస్తానని సందేశం పంపిస్తుంది.
ఈ క్రమంలో ACP మాయా ఖస్తోగిర్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ బృందం అమ్మాయిని రక్షించే బాధ్యతను తీసుకుంటుంది. మాయా తన వృత్తిపరమైన జీవితంతో పాటు, ప్రెగ్నెన్సీ సమస్యలతో పోరాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు జర్నలిస్టులు కూడా ఈ కేసును ఒక కొలిక్కి తేవడానికి ప్రయత్నిస్తారు . 48 గంటల పాటు ఉత్కంఠభరితమైన డ్రామా నడుస్తుంది. ఇందులో అనేక ట్విస్ట్‌లు, సీక్రెట్స్ బయటపడతాయి. చివరికి ఇక్లాఖ్ ని పోలీసులు పట్టుకుంటారా ? ఆ పాప సురక్షితంగా బయటపడుతుందా ? ఇక్లాఖ్ ఉద్యోగం పోవడానికి కారణం ఎవరు ? అతను ఉద్యోగం తిరిగి పొందుతాడా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ప్రేమ ప్రేమా అంటూ అందరూ కరువులోనే… ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో … ఇది లవ్ బర్డ్స్‌కి ఎక్స్ట్రా స్టఫ్
హోయిచోయ్ (Hoichoi)
ఈ బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘టెక్కా'(Tekka). 2024 లో విడుదలైన ఈ సినిమాకి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇది భాస్కర్ చటోపాధ్యాయ్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కింది. 2022 లో జరిగిన వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ స్కామ్ నుండి ఈ స్టోరీ స్ఫూర్తి పొందింది. దీనిలో దేవ్, స్వస్తికా ముఖర్జీ, రుక్మిణీ మైత్రా, పరణ్ బందోపాధ్యాయ్, సుజన్ ముఖర్జీ, ఆర్యన్ భౌమిక్, శ్రీజా దత్తా, అమీయా వంటి నటులు నటించారు. ఈ మూవీ హోయిచోయ్ (Hoichoi) ఓటీటీలో 2024, డిసెంబర్ 27,నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.