E-Paper
Advertisement

OTT Movie : పెళ్లి ఒకరితో, పిల్లలు మరొకరితో… ఫ్యూజులు అవుటయ్యే కథ… తెలుగు సినిమానే

OTT Movie : పెళ్లి ఒకరితో, పిల్లలు మరొకరితో… ఫ్యూజులు అవుటయ్యే కథ… తెలుగు సినిమానే
Advertisement

OTT Movie : దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన సిద్ధు జోన్నలగడ్డ ‘తెలుసు కదా’ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రాశీ ఖన్నా భార్యగా, శ్రీనిధి షెట్టి ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా, ట్రయాంగిల్ స్టోరీ నడపిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఇద్దరి మధ్యలో సిద్ధు ఇరుక్కుపోయే లవ్ ట్రయాంగిల్ ను అందరూ బింజ్ వాచ్ చేస్తున్నారు. ‘డిజే టిల్లు’తో సిద్ధుకి స్టార్ డమ్ అమాంతం పెరిగింది. అయితే కామెడీ రొమాంటిక్ సినిమాలతోనే ఆడియన్స్ ని పలకరిస్తున్నాడు సిద్ధు. ఇతని కామెడీ టైమింగ్ కూడా ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఇప్పుడు ‘తెలుసు కదా’ లో ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తూ, ఒక ఎమోషనల్ కంటెంట్ ని పరిచయం చేశాడు. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

నీరజ కోన దర్శకత్వంలో వచ్చిన ఈ ‘తెలుసు కదా’ తెలుగు రొమాంటిక్ సినిమాను టి. జి. విశ్వ ప్రసాద్ వివేక్ కుచిభోట్ల నిర్మించారు . ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు. దీనికి తమన్ సంగీతం సమకూర్చాడు. ఇది 2025 అక్టోబర్ 17 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

అనాథగా పెరిగిన వరుణ్ కి చిన్నప్పటి నుంచి ఒక మంచి ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటాడు. కాలేజ్ లైఫ్ లో రాగ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ ప్రేమ బ్రేకప్ అయిపోయి, ఒక్కోళ్లు ఒక్కో మార్గంలో వెళ్లిపోతారు. ఈ విషయంలో వరుణ్ చాలా బాధపడతాడు. కొంతకాలం తారువాత దీని నుంచి బయటపడి, అంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. లైఫ్ సెటిల్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇంతలోనే అంజలికి పిల్లలు పుట్టే అవకాశం తక్కువ అని తెలుస్తుంది. దీంతో ఈ జంట ఒక్క సారిగా షాక్ అవుతారు. ఈ జంట ఈ విషయంలో బాధపడుతున్న వేళ స్టోరీ ఊహించని మలుపు తీసుకుంటుంది.

Read Also : వర్షాకాలంలో మాత్రమే మొగుడి దగ్గరకు వచ్చే భార్య… కేక పెట్టించే కొరియన్ డ్రామా

ఇప్పుడు వరుణ్ లైఫ్ లోకి పాత ప్రేమ రాగా ఎంట్రీ ఇస్తుంది. ఈ జంట పిల్లల కోసం ఆమె ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంటుంది. దీంతో స్టోరీ ట్రయాంగిల్ లవ్ కి మారుతుంది. ఇక్కడి నుంచి ఆసక్తికరమైన జర్నీ స్టార్ట్ అవుతుంది. రాగా తీసుకున్న నిర్ణయం ఏమిటి ? గతంలో వీళ్ళు ఎందుకు విడిపోయారు ? ఇప్పుడు ఎందుకు రాగా వచ్చింది ? వరుణ్ కి సంతానం ఎలా కలుగుతుంది ? ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే ప్రశ్నలకి సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Advertisement

 

Related News

డ్యూటీలో ప్రాణాలు పణంగా పెట్టే స్పై ఏజెంట్లు.. ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్

పల్లెటూర్లో టీనేజర్ల సీక్రెట్ లవ్.. ఇంట్లో తెలిసిపోవడంతో ఊహించని ట్విస్ట్.. తెలుగు మూవీనే

ఈజిప్ట్ ఎడారిలో విగతజీవిగా చిన్నారి.. మమ్మీగా ఇంట్లోకి ఎంట్రీ.. దాన్ని ముట్టుకుంటే పోతారు!

లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ.. ప్రేమికులు మిస్ అవ్వకుండా చూడాల్సిన రొమాంటిక్ డ్రామా

పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించే అండర్‌కవర్ టీమ్.. హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

Big Stories

Advertisement
×