Mrunal Takur : టాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ( mrunal takur) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.. అయితే కొన్ని సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. గత ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది కానీ ఆ సినిమా అనుకున్న హిట్ ను అందుకోలేక పోయింది.. ఆ సినిమా ఎఫెక్ట్ తో సినిమా అవకాశాలు కూడా తగ్గాయి అని తెలుస్తుంది.. దీంతో మళ్ళీ బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇక తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు అనే సమయంలో మరో సినిమా అనౌన్స్ చేసింది. ఇక ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh)సరసన క్రేజీ థ్రిల్లర్ ‘డెకాయిట్'(Dacoit Movie) లో నటిస్తుంది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా పెళ్లికూతురు గెటప్ లో ఉన్న వీడియోని షేర్ చేసింది.. ఆ వీడియో క్షణంలో వైరల్ అవ్వడంతో మృణాలు ఠాకూర్ సైలెంట్ గా పెళ్లి చేసుకుంటున్నాను ఫాన్స్ కామెంట్లు చేస్తున్నారు.. అసలు మేటర్ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.. ఆ వీడియోలో పెళ్లి కూతురు గెటప్ లో సిగ్గు పడుతూ కనిపిస్తుంది. ఆ వీడియోను చూస్తే నిజంగానే పెళ్లి చేసుకుంటుందా అనే అనుమానం కలుగుతుంది. కానీ ఆ గెటప్ ఏంటో అర్థం కాలేదు. ఏదైనా యాడ్ షూట్ చేస్తుందా..? లేదా సినిమానా? లేదా నిజంగానే షాక్ ఇస్తుందా అనేది తెలియలేదు కానీ వీడియో మాత్రం వైరల్ అవుతుంది.. అసలు ఆ వీడియోని ఎందుకు పోస్ట్ చేసిందో ఆమె క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం అర్థం కాదు.. ఏమైనా కూడా పెళ్లికూతురు గెటప్ లో మృణాల్ ఠాకూర్ చాలా అందంగా ఉంది. గతంలో ఈమె ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.. మరి పెళ్లి కూడా సైలెంట్ గా చేసుకుంటుందో ఏమో అని ఫాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారు.
Also Read :సమంత రెండో పెళ్లి పై యూట్యూబర్ షాకింగ్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్..
ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. 2023లో ఈమె నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2024 లో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కనీసం యావరేజ్ టాక్ ను కూడా అందుకోలేకపోయింది. దాంతో తెలుగులో మృణాల్అవకాశాలు దూరమయ్యాయి.. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. 32 ఏళ్ల మృణాల్ ఠాకూర్ తన నట జీవితాన్ని సీరియల్స్ ద్వారా ప్రారంభించింది . మృణాల్ హీరోయిన్ గా 2014లో మరాఠీ చిత్రం హలో నందన్ లో నటించింది.. ఆమె మొదటి హిందీ చిత్రం లవ్ సోనియా, 2018లో విడుదలైంది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ తో నటించిన మొదటి సినిమానే హిట్ అయ్యింది. ఇక తెలుగులో మరో హిట్ సినిమా పడితేనే అవకాశాలు వస్తాయి.. లేదంటే బాలీవుడ్ లో మళ్లీ ప్రయత్నాలు చెయ్యాల్సిందే..
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">