Liquor Sales Record : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో ట్రోఫీ గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సంబురాలు జరుపుకున్నారు. చిన్న పల్లెటూరు నుంచి రాష్ట్ర స్థాయి వరకు దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు విజయోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు. పల్లెటూర్లలో కూడా యువకులు కేకులు కట్ చేస్తూ.. లిక్కర్ తో తెగ ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ముఖ్యంగా కర్నాటక రాష్ట్రంలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి. రూ.157.94 కోట్ల విలువైన మద్యం సేవించడం విశేషం. ఇలాంటి మ్యాచ్ లు నెలకి ఒక్కటి ఉంటే ఎంత బాగుండేదో అని మద్యం వ్యాపారులు పేర్కొనడం విశేషం.
Also Read : Trolls On Allu Ayaan : ఫుట్ బాల్ జెర్సీ వేసి ఆర్సీబీ ఫ్యాన్ అంటాడేంటి ?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఫైనల్ లో ఆర్సీబీ విజయం సాధించడంతో విరాట్ కోహ్లీ ఎమోషనల్ కావడంతో వారి సంతోషం పట్టలేక కొంత మంది అయితే అప్పులు చేసి మరీ మద్యం సేవించారట. ఈ మ్యాచ్ లో తొలుత పంజాబ్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఆర్సీబీ బౌలర్లలో కృణాల్ పాండ్యా మినహా అందరూ పరుగులు సమర్పించుకున్నారు. అయితే భువనేశ్వర్ పరుగులు సమర్పించుకున్నప్పటికీ 17వ ఓవర్ లో ఇద్దరి వికెట్లు తీయడంతో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపు మళ్లింది. 17 ఓవర్ వరకు కూడా పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తుందని రేటింగ్ కూడా 60/40 అని చెప్పారు. కానీ అనూహ్యంగా బెంగళూరు బౌలర్లు పుంజుకొని వికెట్లు తీయడంతో పంజాబ్ కింగ్స్ జట్టుకి కళ్లెం వేశారు. దీంతో రాయల్ ఛాలలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.
బెంగళూరు విజయం సాధించడం ఒక ఎత్తయితే.. విజయం సాధించిన తరువాత సంబురాలు జరపడం మరో ఎత్తుగా మారింది. నిన్న రాత్రి చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ యాజమాన్యం విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆర్సీబీ టీమ్ ఓపెన్ టాప్ బస్సులో స్టేడియం వద్దకు చేరుకున్నారు. తమ క్రికెటర్లను చూసేందుకు మెట్రోలలో, బస్సుల్లో చిన్న స్వామి స్టేడియం వద్దకు ఆర్సీబీ అభిమానులు భారీగా చేరుకున్నారు. అభిమానులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఇది కేవలం ఒక్క చిన్నస్వామి స్టేడియం వద్దనే. దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు 25 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ఆర్సీబీ జట్టు 18వ సీజన్ లో విజయం సాధించడం.. విరాట్ కోహ్లీ జెర్సీ నెం.18 కావడం విశేషం. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షలాది మంది వీక్షించారు. ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం కావడం విశేషం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే మూడుసార్లు టైటిల్ గెలవకుండా ఫైనల్ లో ఇంటిదారి పట్టేది. కానీ ఎట్టకేలకు ఈ సీజన్ లో టైటిల్ సాధించడంతో అభిమానులు అంతా ఇంకా కూడా అక్కడక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు.