OTT Movie : పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయింబడతాయి అనే డైలాగ్ ను అందరూ వినే ఉంటారు. కానీ ఆ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాలంటేనే ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమందికి అయితే అసలు ఈ జన్మకు పెళ్లవుతుందా ? అనే అనుమానం కూడా వస్తుంది. మరికొంత మందికి పెళ్లి అనగానే డేంజర్ బెల్స్ మోగుతాయి. అలాంటి డేంజరస్ సిట్యుయేషన్ లో ఏం చేస్తారనే కథాంశంతో తెరకెక్కిన మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్.
Thanu Radhe Nenu Madhu అనేది తాజా తెలుగు షార్ట్ ఫిల్మ్. ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వంలో, ETV Win కథా సుధా సిరీస్‌లో భాగంగా, ఈ షార్ట్ ఫిల్మ్ 2025 సెప్టెంబర్ 14న ETV Win OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయింది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఫిల్మ్ లో థాను విజయ్ (థాను), రాధే శ్రీవాస్తవ్ (రాధే) హీరోహీరోయిన్లుగా నటించారు. IMDbలో ఈ షార్ట్ ఫిల్మ్ కి 7.2 రేటింగ్ ఉండడం విశేషం. ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు.
కథ థాను (థాను విజయ్), రాధే (రాధే శ్రీవాస్తవ్) చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ప్రేమలో ఉంటారు. కానీ ఆ విషయం బయటకు రాకుండా సీక్రెట్ రిలేషన్ లో ఉంటారు. థాను ఒక సాధారణ యువకుడు. రాధే పట్ల తీవ్రమైన ఆకర్షణ కలిగి ఉంటాడు. కానీ వారి ప్రేమలో దాగి ఉన్న ఒక డార్క్ సీక్రెట్ బయట పడుతుంది. రాధే ఒక మిస్టీరియస్ మహిళ. తన గతం, వాటికి సంబంధించిన అంతుచిక్కని రహస్యాలతో ఉంటుంది. నెమ్మదిగా వీరిద్దరి ప్రేమలో జెలసీ, అనుమానాలు, అనూహ్య ట్విస్ట్‌లు వస్తాయి. ఫిల్మ్ లో ఎమోషనల్ మూమెంట్స్, హృదయాన్ని కదిలించే సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ వరకూ బాగానే ఉన్న హీరోయిన్ పెళ్ళికి మాత్రం ఒప్పుకోదు. హీరోకి ఆ అమ్మాయి లైఫ్ లో అడుగు పెడితే డేంజర్ అనే విషయం తెలియడంతోనే అలా వ్యవహరిస్తుంది. అయితే హీరో మాత్రం విషయం తెలిసి కూడా ఆమెను పెళ్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. క్లైమాక్స్ ఒక షాకింగ్ రివెలేషన్‌తో ముగుస్తుంది. ఇంతకీ పెళ్లైతే ఎదురయ్యే ఆ డేంజర్ ఏంటి? హీరోయిన్, హీరో చివరికి ఒక్కటయ్యారా లేదా? కథలో అసలు ట్విస్ట్ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.
Read Also : ఆత్మహత్య కోసం వెళ్లి ఐలాండ్ లో ఇరుక్కుపోయే అమాయకుడు… ట్విస్టులతో మెంటలెక్కించే సర్వైవల్ థ్రిల్లర్