OTT Movieసైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఒక హాలీవుడ్ సినిమా ఓటీటీలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇందులో హానీమూన్ కి వెళ్ళిన ఒక జంట అనుకోని సమస్యల్లో చిక్కుకుంటుంది. ఒక ఏలియన్ ఎంట్రీ తో అసలు స్టోరీ మొదలవుతుంది. క్లైమాక్స్ వరకు ఊపిరి బిగబెట్టే ట్విస్టులు వస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
బీ, పాల్ కొత్తగా పెళ్లైన జంట. రొమాంటిక్ సమయాన్ని గడపడానికి ఒక ప్లాన్ చేస్తారు. కెనడాలోని ఒక అడవి ప్రాంతంలో ఉండే స్వంత గెస్ట్ హౌస్ కి హనీమూన్ కోసం వెళతారు. ఈజంట ప్రేమతో, ఆనందంగా ఉంటూ, సరస్సులో బోటింగ్, ఫిషింగ్ లాంటివి చేస్తూ రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు. ఒక రోజు స్థానిక రెస్టారెంట్‌లో, బీ చిన్ననాటి స్నేహితుడు విల్, అతని భార్య ఆనీ ని కలుస్తారు. కానీ అక్కడ విల్ భార్య ఆనీ వింతగా ప్రవర్తిస్తుంది. వీళ్ళు అక్కడి నుంచి త్వరగా బయటికి వస్తారు. ఆ రాత్రి పాల్ నిద్రలో నుంచి మేల్కొని చూస్తే బీ పక్కన ఉండదు. అతను ఆమె కోసం చుట్టుపక్కల అంతా వెతుకుతాడు. అడవిలో ఒక చోట ఆమె ఒంటి మీద నూలు పోగు లేకుండా, ఒంటరిగా గందరగోళ పరిస్థితిలో ఉంటుంది. బీ తాను స్ట్రెస్ వల్ల స్లీప్ వాకింగ్ చేశానని చెప్తుంది. కానీ ఆమెకు స్లీప్‌వాకింగ్ అలవాటు లేదని పాల్‌కి తెలుసు. బీ ప్రవర్తన రోజురోజుకూ వింతగా మారుతుంది. ఆమె సాధారణ విషయాలు కూడా మరచిపోతుంది. అంతేకాకుండా ఆమె శరీరంపై విచిత్రమైన గుర్తులు కనిపిస్తాయి.
పాల్, బీ ప్రవర్తనలోని మార్పులను గమనిస్తూ ఆమెను అనుమానిస్తాడు. ఆమెకు విల్‌తో ఏదో సంబంధం ఉందేమో అని మొదట అనుకుంటాడు, కానీ త్వరలోనే ఇది సాధారణ విషయం కాదని అర్థమవుతుంది. రాత్రిపూట కనిపించే వింత కాంతి, బీ శరీరంలోంచి బయటకు వచ్చే పురుగులాంటి జీవి వంటి సంఘటనలు కథను భయంకరంగా మారుస్తాయి. చివర్లో ఇదంతా ఒక ఏలియన్ పనిగా తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ కూడా ఊహించని ట్విస్టులు ఇస్తుంది. ఇంతకీ ఆ ఏలియన్ ఎక్కడి నుంచి వచ్చింది ? అమ్మాయిలని ఎందుకు టార్గెట్ చేస్తోంది ? ఈ హనీమూన్ ట్రిప్ ఎలాంటి ముగింపు ఇస్తుంది ? అనే విషయాలను ఈ సైకలాజికల్ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.
‘Honeymoon’ 2014లో విడుదలైన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ చిత్రం. లీ జానియాక్ దర్శకత్వంలో, రోజ్ లెస్లీ (బీ), హ్యారీ ట్రెడ్‌వే (పాల్), బెన్ హబర్ (విల్), హన్నా బ్రౌన్ (ఆనీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2014 సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలై, 1 గంట 27 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.7/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హులులో ఇంగ్లీష్ ఆడియోతో, ఇంగ్లీష్, హిందీ, తెలుగు సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.