E-Paper
Advertisement

లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ.. ప్రేమికులు మిస్ అవ్వకుండా చూడాల్సిన రొమాంటిక్ డ్రామా

లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ.. ప్రేమికులు మిస్ అవ్వకుండా చూడాల్సిన రొమాంటిక్ డ్రామా
Advertisement

Romantic Drama: ప్రేమలో ఉన్న ఇద్దరికీ అదే సమయంలో కీలకంగా కెరీర్ కూడా మారితే ఏం జరుగుతుంది ? ఒకరు డాన్స్‌లో తమ కలను అందుకోవడానికి దూరంగా వెళ్లాలి. మరొకరు స్పోర్ట్స్‌ లో స్టార్‌ గా ఎదగడానికి పూర్తిగా ఆటపైనే ఫోకస్ చేయాలి. ఇద్దరి మధ్య దూరం పెరిగితే ప్రేమ అలాగే బలంగా ఉంటుందా ? ఒకరికి తీవ్రమైన గాయం, మరొకరికి ఊహించని జాబ్ ఆఫర్ వస్తే.. చివరికి ప్రేమను ఎంచుకుంటారా ? లేక తమ భవిష్యత్తు కోసం వేరే దారులు పట్టుకుంటారా ? ఇలాంటి ప్రశ్నల చుట్టూ తిరిగే యూత్ రొమాంటిక్ డ్రామానే ‘ది బ్యాడ్ బాయ్ అండ్ మీ 2’ (The Bad Boy and Me 2). మరి ఈ రొమాంటిక్ డ్రామా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే ?

కథలోకి వెళ్తే…

డాలస్ కు మదర్స్ మెమోరియల్ డాన్స్ కాలేజ్‌ లో చేరాలన్నది పెద్ద కల. ఆ కలను నిజం చేసుకున్న తర్వాత ఆమె జీవితంలో కొత్త స్నేహాలు, కొత్త అవకాశాలు మొదలవుతాయి. అదే సమయంలో డ్రేటన్ యూఎస్‌సీ ఫుట్‌బాల్ టీమ్‌లో స్టార్ క్వార్టర్‌బ్యాక్‌గా తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని చూస్తుంటాడు. ఇద్దరూ లాస్ ఏంజెల్స్‌లోని వేర్వేరు కాలేజీల్లో ఉండటంతో వారి ప్రేమ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌గా మారుతుంది. మొదట్లో దూరాన్ని ప్రేమతో అధిగమించేందుకు ప్రయత్నించినా… కాలేజీ లైఫ్, కొత్త బాధ్యతలు, కెరీర్‌పై ఒత్తిడి క్రమంగా ఇద్దరి మధ్య గ్యాప్‌ను పెంచుతాయి.

Advertisement

డాలస్ డాన్స్ ప్రాక్టీస్, స్నేహాలు, తన భవిష్యత్తు కోసం బిజీ అవుతుంది. డ్రేటన్ మాత్రం ఫుట్‌బాల్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడంపైనే దృష్టి పెడతాడు. అసలు సమస్య మాత్రం డ్రేటన్‌ కు ఎదురయ్యే అనూహ్యమైన గాయంతో మొదలవుతుంది. మ్యాచ్‌ లో జరిగిన ఇంజ్యూరీ అతని స్పోర్ట్స్ కెరీర్‌ పైనే ప్రశ్నలు లేవనెత్తుతుంది. తాను ఎంతో ఇష్టపడే ఫుట్‌బాల్‌ ను ఇక కొనసాగించలేనేమోననే భయం అతడిని మానసికంగా కుంగదీస్తుంది. ఆ సమయంలో డాలస్ అతడికి అండగా నిలవాలని ప్రయత్నిస్తుంది.

అదే సమయంలో డాలస్‌కు న్యూయార్క్‌లో మంచి జాబ్ ఆఫర్ వస్తుంది. అది ఆమె కెరీర్‌కు పెద్ద అవకాశం. కానీ డ్రేటన్ పరిస్థితి చూస్తుంటే అతడిని వదిలి వెళ్లడం కూడా అంత సులభంగా అనిపించదు. ప్రేమ కోసం తన కలను పక్కన పెట్టాలా ? లేక తన భవిష్యత్తు కోసం కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా ? ఇలా డాలస్ సందిగ్ధంలో పడుతుంది. కెరీర్ ఒత్తిడి, దూరం, అపార్థాలు చివరికి వారి ప్రేమను బ్రేకప్ అంచుల వరకు తీసుకెళ్తాయి.

Advertisement

డాలస్ న్యూయార్క్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా… డ్రేటన్ తన ఫుట్‌బాల్ కెరీర్‌ను తిరిగి నిలబెట్టుకునేందుకు పోరాటం మొదలుపెడతాడు. మరి ఈ ఇద్దరి ప్రేమ నిజంగా ఇక్కడితో ముగిసిపోయిందా ? డాలస్ తన కలను ఎంచుకుంటుందా ? డ్రేటన్ మళ్లీ మైదానంలోకి వస్తాడా ? ఇద్దరూ తమ కెరీర్‌లతో పాటు ప్రేమను కూడా కాపాడుకోగలరా ?… సమాధానం కోసం ఈ యూత్ డ్రామాను చూడాల్సిందే.

హాట్‌స్టార్లో అందుబాటులో

‘ది బ్యాడ్ బాయ్ అండ్ మీ 2’ ప్రస్తుతం జియో హాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నోవా బెక్ (Noah Beck), సీనా అగుడాంగ్ (Siena Agudong), చార్లీ గిల్లెస్పీ (Charlie Gillespie) కీలక పాత్రల్లో నటించారు. ఇది రొమాంటిక్ డ్రామా… టీనేజ్ యూత్ డ్రామా నేపథ్యంలో సాగుతుంది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో ఇంగ్లీష్ ఒరిజినల్, హిందీ ఆడియోలు మాత్రమే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.

Read Also: చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

Tags

Related News

ఈజిప్ట్ ఎడారిలో విగతజీవిగా చిన్నారి.. మమ్మీగా ఇంట్లోకి ఎంట్రీ.. దాన్ని ముట్టుకుంటే పోతారు!

పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించే అండర్‌కవర్ టీమ్.. హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

లాటరీలో వందల కోట్లు.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఆఫీస్‌‌లో అరాచకం, తెలుగులోనూ ఉంది

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

Big Stories

Advertisement
×