India Pakistan War: భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ను చుక్కలు చూపిస్తోంది. ఉగ్రవాదుల అంతమొందించడమే లక్ష్యంగా భారత్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. రెండు రోజుల క్రితం పాక్, పాక్ అక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మిసైల్ దాడులతో విరుచుకపడింది. దీంతో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ పాకిస్థాన్ మాత్రం తప్పుడు లెక్కలు చెబుతోంది. అయితే భారత్ మాత్ర ఆపరేషన్ సిందూర్ ను కొనసాగిస్తుంది.
BREAKING: Pakistani Missiles have been destroyed by S-400 in Jammu, India.#DroneAttack #IndiaPakistanWar pic.twitter.com/X0EOqxP0Nx
— Shourajit Saikia (@ShourajitSaikia) May 8, 2025
తాజాగా పది పాక్ డ్రోన్లను భారత్ S-400 సాయంతో ధ్వంసం చేసింది. పాక్ డ్రోన్ దాడులకు భారత్ ధీటుగా సమాధానం చెబుతోంది. కుప్వారా రెండు దేశాల మధ్య ఎదురుదాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ F-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం కూల్చేసింది. అలాగే రెండు JF-17 యుద్ధ విమానాలను కూడా భారత్ ఆర్మీ సమర్థవంతంగా ధ్వంసం చేసింది. జమ్ము టార్గెట్ గా పాకిస్థాన్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే జమ్ము, కశ్మీర్, పంజాబ్ లోని అమృత్ సర్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలు బ్లాక్ అవుట్ అయ్యాయి.
Also Read: India Pak War: జమ్ము ఎయిర్‌పోర్టుపై పాక్ రాకెట్ దాడి.. యుద్ధం మొదలైంది..!
జమ్ముకశ్మీర్ లో ఇంటర్ నెట్ సేవలను కూడా భారత్ ప్రభుత్వం నిలిపివేసింది. వార్ సైరన్ లతో ప్రజలును భారత ఆర్మీ అప్రమత్తం చేసింది. ప్రజలు ఇంట్లో నుంచి అసలు బయటకు రావొద్దని భారత్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది. సూసైడ్ డ్రోన్ లతో పాకిస్థాన్ అటాక్ చేస్తుంటే.. భారత్ సమర్థవంతంగా ఎదురుదాడులు చేస్తోంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ కు చెందిన మూడు యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది.
Also Read: BIG BREAKING: ఆపరేషన్ సిందూర్.. ఓటీటీలకు కేంద్రం కీలక ఆదేశాలు, అవి అపేయండి