E-Paper
Advertisement

Modi Cabinet: రెండు రోజుల్లో మోదీ కేబినెట్‌లో భారీ మార్పులు, పలువురికి పదవీ గండం, కొత్తగా వచ్చేదెవరు?

Modi Cabinet: రెండు రోజుల్లో మోదీ కేబినెట్‌లో భారీ మార్పులు,  పలువురికి పదవీ గండం, కొత్తగా వచ్చేదెవరు?
Advertisement

Modi Cabinet: మోదీ కేబినెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయా? దానికి సంబంధించిన పనులు తెర వెనుక జోరుగా జరుగుతున్నాయా? దాదాపు అరడజను మందిని మార్చే అవకాశముందా? కొత్తగా వచ్చే నేతలెవరు? తెలుగు రాష్ట్రాల నేతలకు ఈసారి చోటు దక్కుతుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

మోదీ కేబినెట్‌లో భారీ మార్పులు, రెండు రోజుల్లో పునర్వ్యవస్థీకరణ

Advertisement

మోదీ మంత్రివర్గంలో భారీ మార్పులు జరగనున్నాయి. దాదాపు అరడజను మందిని తప్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వారంతా వార్తల్లో నలుగుతున్న నేతలు. దీనికి సంబంధించి గడిచిన నాలుగైదు రోజులుగా మోదీతోపాటు పలువురు సీనియర్లు విస్తృతంగా మంతనాలు సాగిస్తున్నారు.

జాతీయ అవార్డుల ప్రధానం తర్వాత ప్రధాని నరేంద్రమోదీ.. రాష్ట్రపతి ముర్ముతో సమావేశమయ్యారు. దాదాపు అరగంటపాటు వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అది జరిగి ఓ రోజు తర్వాత హోంమంత్రి అమిత్‌ షా గురువారం రాష్ట్రపతి‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు అరగంట పైగానే జరిగిందని ఢిల్లీ పొలిటికల్ వర్గాల మాట.

Advertisement

పలువురు నేతలకు పదవీ గండం.. కొత్తగా వచ్చేదెవరు?

రెండురోజుల కిందట బుధవారం తొమ్మది మంది మంత్రులు, వారి మంత్రివర్గ శాఖల పని తీరుపై సమీక్షించారు. రెండు రోజులుగా రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో అమిత్‌ షా, పీయూష్‌ గోయెల్‌వంటి నేతలు చర్చలు చేస్తుండడంతో కీలక మార్పులు జరుగుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

నేటి మూడురోజులపాట సీషెల్స్‌ పర్యటనకు వెళ్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఆయన తిరిగి రాగానే కేబినెట్‌లో భారీగా మార్పులు ఉంటాయని చెబుతున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే జూన్ 28-29 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హెచ్ఆర్డీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలగిస్తారనే వాదన బలంగా నడుస్తోంది.

ALSO READ: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్.. ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం, మరి ధరలు తగ్గుతాయా? 

ఆ శాఖ పని తీరు కారణంగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిందని బీజేపీలోని కొందరు పెద్దలు అంచనా. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాజీనామా చేశారు. సీతారామన్‌కు శాఖ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానవ వనరుల అభివృద్ధి శాఖను ఆమెకు అప్పగించడం ఖాయంగా చెబుతున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్‌సింగ్ పూరిలతోపాటు మరో ముగ్గురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల రేసులో ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్, అనురాగ్ ఠాకూర్, శ్రీకాంత్ షిండే, అరుణ్ గోవిల్ వారికి చోటు దక్కే అవకాశాలున్నట్లు సమాచారం. ఆరుగురు ఎంపీలను ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చిన శివసేనకు మరో పదవి దక్కవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో ఎంపీ శ్రీకాంత్ షిండే పరిశీలనకు వచ్చినట్టు చెబుతున్నారు.

యూపీలోని మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్ పేరు బలంగా వినిపిస్తోంది. పంజాబ్ రాజకీయాలతో సంబంధ ఉన్న రాఘవ్ చద్దా లేకుంటే అశోక్ మిట్టల్‌‌ల్లో ఒకరికి బెర్త్ దక్కవచ్చనే చర్చ జరుగుతోంది. బీహార్ మాజీ సీఎం నితిష్‌కుమార్ పేరు కూడా ఉందట. త్వరలో పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికల రానుబోతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు నడుస్తున్నాయి.  ప్రమోషన్ ఇస్తారా? లేకుంటే తొలగిస్తారా? అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సివుంది. ఎన్నికలకు ముందు ఓ రాజకీయ సందేశాన్ని పంపే ప్రయత్నంగా భావిస్తున్నారు.

Related News

ఢిల్లీలో చెంపదెబ్బ వీడియో కలకలం.. అసలు నిజం బయటపెట్టిన మంత్రి పర్వేష్ వర్మ!

కరెంట్ వాడకంపై కేంద్రం కీలక ఆదేశాలు.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!

ఢిల్లీలో షాకింగ్ న్యూస్.. ఓ యువకుడిని చెంప దెబ్బ కొట్టిన ఢిల్లీ మంత్రి?

విరిగిన కొండచరియలు.. బద్రీనాథ్ – రిషికేశ్ మధ్య నిలిచిన రాకపోకలు, చిక్కుకున్న 4 వేల యాత్రికులు

యూపీలో మారిన సీన్.. రాహుల్-అఖిలేష్ ఒక్కటయ్యారా? గెలుపు ఎవరిది?

షాకైన వాహనదారుడు, గిటార్‌పై AI రూ. 500 చలాన్! బెంగుళూరులో ఘటన

ఓ ఫేక్ వార్త.. ఎల్‌పియులో ధ్వంసం..విశ్వవిద్యాలయానికి నిప్పు, హైవేను దిగ్బంధించిన స్టూడెంట్స్

రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. వెంటనే అప్లై చేసేయండి

Big Stories

Advertisement
×