OTT Movies : ఓటీటి సంస్థలు వచ్చిన తర్వాత ఫ్లాప్ అవుతుందన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి. థియేటర్లలో ఒకవేళ లా పైన అటు ఓటిటిలో మాత్రం భారీ సక్సెస్ ని అందుకుంటున్నాయి. అందుకే చాలామంది తమ సినిమాలను థియేటర్లలో కంటే ఓటిటిలోని ఎక్కువగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓటిటిలో దర్శనమిస్తుంది. అది కూడా నెలలోపే డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రావడం విశేషం. ఓటీడీలో తమిళ్ తెలుగు మలయాళం అన్ని సినిమాలు వివిధ భాషల్లో రిలీజ్ అవుతుంటాయి. ఇక తాజాగా ఓ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ పేరేంటి? స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
మూవీ & ఓటీటి..
మలయాళం తమిళ్ ఇలా పలు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక్కడ రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో మలయాళంలో రిలీజ్ అవుతున్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాంటి వాటిలో పోన్ మ్యాన్ ఒకటి. ఎలాంటి హడావిడి, అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై విజయం సాధించిన ఇది. ఈ ఏడాది జనవరి 30వ తేదీన రిలీజ్ అయిన డార్క్ కామెడీ మూవీ ప్రేక్షకుల మన్ననను అందుకుంది. బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించాడు.. సజిన్ గోపు, లిజొమోల్ జోస్, ఆనంద్ మన్మధన్, దీపక్ పరంబోల్ కీలకపాత్రలు పోషించారు. జోతిష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు మేకర్స్..
Also Read : బాలీవుడ్ నేర్చుకుంది.. సౌత్ ఇంకా మారలేదు.. పరువు తీసేసిన హీరోయిన్..
స్టోరీ విషయానికొస్తే..
మలయాళ మూవీస్ ఎప్పుడు కొత్తగా ఉంటాయి. అలాగే ఈ మూవీ కూడా సరికొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలో బేసిల్ గోల్డ్ మెన్ పాత్రలో నటించాడు. విచిత్రమైన వ్యాపారవేత్తగా జనాల మధ్యలో హైలెట్ అయ్యాడు.. తన దగ్గర ఉన్న బంగారాన్ని పెళ్లి కూతురు ఇంట్లో వాళ్లకు ఇచ్చి. పెళ్లిలో వచ్చే డబ్బు మొత్తం తనకు ఇవ్వాలని షరతులు పెట్టే వ్యాపారం చేస్తుంటాడు. కానీ ఓ కుటుంబానికి 25 సవర్ల బంగారం ఇవ్వగా.. కేవలం 13 సవర్లే తిరిగి చెల్లిస్తుంది. మిగిలిన 12 సవర్ల కోసం అడగ్గా వాళ్ళు ఎదురు తిరుగుతారు.. ఆ తర్వాత పెద్ద వివాదమే ఏర్పడుతుంది. 12 సవర్ల బంగారం కోసం హీరో ఏం చేశాడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? ఈ సినిమాలో చూడొచ్చు.. థియేటర్లలో బాగానే ఆడిన ఈ సినిమా ఓటిటిలో ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి.. బేసిల్ ఎలాంటి సినిమా చేసిన ప్రత్యేకంగానే ఉంటుంది.. గత ఏడాది నుంచి ఆయన నుంచి వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ ఏడాది వచ్చిన సూక్ష్మదర్శిని మూవీ మంచి విజయాన్ని అందుకుంది.