OTT Movie : ఒక హాలీవుడ్ హారర్ సినిమా సౌండ్ ఎఫెక్ట్స్ తో కేకలు పెట్టిస్తోంది. ఇది సుండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు అందుకుని, హారర్ జానర్‌లో కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆరుగురు మహిళల గుహలో చిక్కుకోవడం, భయంకరమైన జీవులను ఎదుర్కునే సంఘటనలతో ఒక సర్వైవల్ థ్రిల్ ను ఇస్తుంది. ఈ బ్రిటిష్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
సారా తన భర్త, కుమార్తెతో రాఫ్టింగ్ ట్రిప్‌లో ఉంటుంది. ఒక ట్రాజిక్ కార్ యాక్సిడెంట్‌లో ఆమె భర్త, కుమార్తె చనిపోతారు. సారా తీవ్రమైన బాధలో మిగిలిపోతుంది. ఒక సంవత్సరం తర్వాత సారా, జూనో, బెత్, సామ్, రెబెక్కా, హోలీ అనే తన స్నేహితులతో, యునైటెడ్ స్టేట్స్‌లోని అప్పలాచియన్ మౌంటైన్స్‌లో ఒక కేవ్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రిప్‌కు వెళ్తుంది. జూనో ఒక రిస్క్-టేకర్, గ్రూప్ లీడర్, సారాను ఈ అడ్వెంచర్‌తో రికవర్ చేయాలని ప్లాన్ చేస్తుంది. వీళ్ళు ఒక అన్‌చార్టెడ్ గుహలోకి దిగుతారు. జూనో దీనిని బోర్హామ్ కేవ్ అని చెప్పినప్పటికీ, అది వాస్తవానికి అన్‌డాక్యుమెంటెడ్ కేవ్. ఈ సమయంలో గుహలో ఒక టన్నెల్ కూలిపోతుంది. వారు బయటకు వెళ్లే మార్గం లేకుండా చిక్కుకుంటారు. జూనో తప్పుగా ఈ అన్‌చార్టెడ్ కేవ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇది గ్రూప్‌లో టెన్షన్‌ను పెంచుతుంది.
గుహ లోపల వారు భయంకరమైన హ్యూమనాయిడ్ జీవులను ఎదుర్కొంటారు. ఈ జీవులు గుహలో వందల్లో వీళ్ళను హంట్ చేస్తాయి.సారా ఆమె స్నేహితులు సర్వైవ్ అవ్వడానికి పోరాడతారు, కానీ అవి వారిని ఒక్కొక్కరినీ ఎటాక్ చేస్తాయి. హోలీ మొదట చనిపోతుంది. ఈ గ్రూప్ స్ప్లిట్ అవుతుంది. సామ్, రెబెక్కా కూడా వీటి చేతిలో దారుణంగా చనిపోతారు. సారా, బెత్ కలిసి ఎస్కేప్ కు ప్రయత్నిస్తారు. కానీ ఒక షాకింగ్ రివిలేషన్ వస్తుంది. జూనో ఒకప్పుడు సారా భర్తతో ఎఫైర్ పెట్టుకుని ఉంటుంది. ఇది సారాకు బెత్ చెప్పడం వల్ల తెలుస్తుంది. ఇంతలో బెత్‌ను ఒక ఆ జీవులు దాడి చేయడంతో సారా ఆమెను సేవ్ చేయలేకపోతుంది. సారా జూనోను అక్కడే వదలి ఒంటరిగా ఎస్కేప్ అవ్వడానికి పోరాడుతుంది. చివరికి సారా ప్రాణాలతో బయట పడుతుందా ? జూనో ఆ వింత జీవులకు బలవుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
‘ది డిసెంట్’ 2005లో విడుదలైన బ్రిటిష్ హారర్-థ్రిల్లర్ చిత్రం. నీల్ మార్షల్ దర్శకత్వంలో సెలాడోర్ ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇందులో షౌనా మక్‌డొనాల్డ్ (సారా కార్టర్), నటాలీ మెండోజా (జూనో కప్లాన్), అలెక్స్ రీడ్ (బెత్ ఒ’బ్రియన్), సాస్కియా ముల్డర్ (రెబెక్కా వెర్నెట్) నటించారు. 1 గంట 39 నిమిషాల రన్‌టైమ్ తో ఈ సినిమా IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, షుడర్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులో ఉంది.
Read Also : సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్… చూసిన వాళ్ళను వదలకుండా ముక్కలు ముక్కలుగా నరికి… క్రేజీ కొరియన్ థ్రిల్లర్