OTT Movie : వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలు ఎంత ఎంగేజింగ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ అలాంటి సినిమాలు చూసినప్పుడే సమాజంలో ఇలాంటి పనులు కూడా చేస్తాయా ? అని ఆశ్చర్యం, భయం కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కుశ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిందే. ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు “The Diplomat”. 2025లో తెరపైకి వచ్చిన ఈ మూవీ ఒక హిందీ సైకలాజికల్ థ్రిల్లర్. భారత్-పాకిస్తాన్ సంబంధాల నేపథ్యంలో నడిచే ఒక నిజమైన కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం ఒక భారతీయ దౌత్యవేత్త జీవితంలో వచ్చే ఛాలెంజెస్, ఒక యువతి ఎదుర్కొన్న భయంకర అనుభవం, దౌత్య సమస్యలను ప్రేక్షకుల కళ్ళకు కట్టింది. జానర్ పరంగా ఇది పొలిటికల్ థ్రిల్లర్, డ్రామా, భావోద్వేగ కథాంశం కలగలసిన సినిమా.
శివం నాయర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్ ఆబ్రహం (జె.పి. సింగ్), సాదియా ఖతీబ్ (ఉజ్మా అహ్మద్), కుముద్ మిశ్రా (ఎన్.ఎం. సయ్యద్), షరీబ్ హష్మీ (తివారీ), రేవతి (సుష్మా స్వరాజ్), జగ్జీత్ సంధు (తాహిర్ అలీ) నటించారు. ప్రస్తుతం ఈ సినిమా Netflixలో అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే…
జె.పి. సింగ్ అనే భారతీయ రాయబారి పాకిస్తాన్‌లోని భారత హై కమిషన్‌లో పని చేస్తాడు. అతని జీవితం సాధారణంగా సాగుతుండగా, 2017 మే 5న ఉజ్మా అహ్మద్ అనే యువతి హై కమిషన్ కు వస్తుంది. ఉజ్మా తనను భారతీయురాలిగా చెప్పుకుంటూ, పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా (KPK)లోని బునర్ అనే గ్రామంలో తనను తాహిర్ అనే వ్యక్తి బలవంతంగా వివాహం చేసుకుని, హింసించినట్లు చెబుతుంది.
ఉజ్మా ఒక జబ్బు ఉన్న కూతురుకు సింగిల్ మదర్. మలేషియాలో తాహిర్‌ను కలిసి, అతని మంచితనంపై నమ్మకంతో పాకిస్తాన్‌కు వెళ్తుంది. కానీ అక్కడ తాహిర్ ఆమెను మోసం చేసి, బలవంతంగా ఒక మారుమూల గ్రామంలో బంధిస్తాడు. శారీరకంగా, మానసికంగా హింసిస్తాడు. జె.పి. సింగ్ ఉజ్మా కథను విని, ఆమెను రక్షించడానికి పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతాడు.
పాకిస్తాన్ అధికారులు ఉజ్మాను భారత గూఢచారిగా భావిస్తూ, ఆమె KPKలో తిరుగుబాటు దారులతో సంబంధం కలిగి ఉందని ఆరోపిస్తారు. ఈ ఆరోపణలు సింగ్ మిషన్‌ను మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తాయి. అతను భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ ఒత్తిడులను, పాకిస్తాన్ న్యాయవ్యవస్థను ఎదుర్కొంటూ, ఉజ్మాను వాఘా బార్డర్ ద్వారా సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి పోరాడతాడు. ఈ ప్రక్రియలో, అతను సుష్మా స్వరాజ్ (అప్పటి భారత విదేశాంగ మంత్రి) సహాయం తీసుకుంటాడు. మరి చివరికి సింగ్ ఉజ్మాను పాకిస్తాన్ నుంచి బయట పడేశాడా? ఈ క్రమంలో అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు ? అనేది స్టోరీ.
Read Also : భర్త లేని టైమ్ లో మరో వ్యక్తితో… ఆమె చేసిన తప్పుకు భర్త ఏం చేస్తాడో తెలిస్తే ఫ్యూజులు అవుట్