OTT Movie : నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఎన్నోసినిమాలు, డాక్యుమెంటరీలు వస్తున్నాయి. వీటిని ఓటీటీలో ప్రేక్షకులు కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే డాక్యుమెంటరీ ఒక సీరియల్ కిల్లర్ ఆధారంగా తెరకెక్కింది. గోవాలో ఇతను పదహారు మంది ఆడవాళ్లను కిరాతకంగా చంపేశాడు. ఈ డాక్యుమెంటరీ పేరు ఏమి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
మహానంద్ నాయక్, గోవాకు చెందిన ఒక రిక్షా డ్రైవర్ గా పని చేస్తుంటాడు. ఇతను 1994 నుండి 2009 వరకు 16 మంది మహిళలను వాళ్ళ సొంత దుపట్టాలతో ఊపిరి ఆడకుండా చేసి చంపి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, ఆభరణాలను దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అతను మహిళలను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, సమాజంలో వివాహం కాని మహిళలను టార్గెట్ చేస్తుంటాడు. ఈ హత్యలు గోవాలోని పలు ప్రాంతాలలో జరిగాయి. అతడు చంపిన శవాలను కనుక్కోవడం కూడా కష్టంగా మారింది. ఎందుకంటే నాయక్ వాటిని రహస్యంగా దాచిపెట్టేవాడు. ఈ డాక్యుమెంటరీ నాయక్ నేరాలను మాత్రమే కాకుండా, అతని మానసిక స్థితిని గురించి కూడా తెలియజేస్తుంది.
15 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన తర్వాత, మంచి ప్రవర్తన కారణంగా నాయక్ విడుదల కావచ్చనే ప్రశ్న సమాజంలో చర్చనీయాంశంగా మారింది. ఒక సీరియల్ కిల్లర్ నిజంగా సమాజంలో మంచి మనిషిగా మార్పు చెందగలడా? అతను స్వేచ్ఛగా జీవించడానికి అర్హుడా? అనే ప్రశ్నలను ఈ డాక్యుమెంటరీ పరిశీలిస్తుంది. న్యాయ వ్యవస్థ లోపాల కారణంగా నాయక్ 16 హత్యలకు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, సాక్ష్యాల కొరత కారణంగా కేవలం రెండు కేసులలో మాత్రమే శిక్ష పడింది. ఈ డాక్యుమెంటరీ న్యాయ వ్యవస్థలోని లోపాలను కూడా చర్చిస్తుంది.
Read Also : బ్యాచిలర్ పార్టీలో ఫ్రెండ్ మిస్సింగ్ … కేక పెట్టించే కామెడీ థ్రిల్లర్ … ప్రత్యేక పాత్రలో మైక్ టైసన్ …
మూడు ఓటిటిలలో స్ట్రీమింగ్
ఈ డాక్యుమెంటరీ మూవీ పేరు ‘ది దుపట్టా కిల్లర్’ (The dupatta killer). 2025 లో వచ్చిన ఈ డాక్యుమెంటరీకి పాట్రిక్ గ్రాహం దర్శకత్వం వహించారు. ఇది గోవాలోని అత్యంత క్రూరమైన సీరియల్ కిల్లర్ మహానంద్ నాయక్ కథను ఆధారంగా చేసుకుని తీయబడింది. ఇందులో మహానంద్ నాయక్ అనే వ్యక్తి 16 మంది మహిళలను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, కేవలం రెండు హత్యలకు మాత్రమే దోషిగా నిర్ధారించి జైలు శిక్ష అనుభవించాడు. ఈ డాక్యుమెంటరీ ఇంగ్షీషు, హిందీ, తమిళం, తెలుగులో అందుబాటులో ఉంది. ఈ డాక్యుమెంటరీ డాక్యుబే (Docubay), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video) , ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ (Airtel Xtream) వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో 2025 మార్చి 21 నుంచి ప్రీమియర్ అయింది.