BigTV English

The GOAT OTT: ‘గోట్’ ఓటీటీ స్ట్రీమింగ్.. గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్, అలా రిలీజ్ చేస్తారట!

The GOAT OTT: ‘గోట్’ ఓటీటీ స్ట్రీమింగ్.. గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్, అలా రిలీజ్ చేస్తారట!

The GOAT OTT Update: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో క్లీన్ హిట్ సాధించినా.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. విడుదలయిన రోజే మిక్స్‌డ్ టాక్ అందుకొని కలెక్షన్స్ విషయంలో వెనకబడింది ‘ది గోట్’. అయితే ఒక రొటీన్ కథకు రన్ టైమ్ కూడా ఎక్కువగా ఉందని భావించిన ప్రేక్షకులు.. ఈ మూవీకి నెగిటివ్ రివ్యూలు అందించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వెంకట్ ప్రభు.. తానే స్వయంగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ గురించి బయటపెట్టారు.


డైరెక్టర్స్ కట్‌

‘ది గోట్’ మూవీని అత్యధిక రన్ టైమ్‌తో తెరకెక్కించారట దర్శకుడు వెంకట్ ప్రభు. అసలైతే ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలు అని వెంకట్ ప్రభు స్వయంగా బయటపెట్టారు. కానీ ఎప్పటికైనా ఆ రన్ టైమ్‌తో ప్రేక్షకులకు సినిమా చూపించాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. అందుకే ఓటీటీలో ‘ది గోట్’ను డైరెక్టర్స్ కట్‌తో కలిపి 3 గంటల 40 నిమిషాల నిడివితో విడుదల చేయాలని నిర్మాత అర్చన కలపతి నిర్ణయించుకున్నారని వెంకట్ ప్రభు అన్నారు. కానీ ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదని తెలుస్తోంది. థియేటర్లలో తక్కువ నిడివితో విడుదలయినా కూడా ‘ది గోట్’ చాలామందిని ఆకట్టుకోలేకపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేకర్స్.. డైరెక్టర్స్ కట్‌ను విడుదల చేస్తారో లేదో చూడాలి.


Also Read: ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తోన్న ‘స్త్రీ 2’.. ఎప్పటి నుంచంటే?

ట్రైలర్‌కే నెగిటివ్ టాక్

ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో, అడ్వాన్స్ టెక్నాలజీతో ‘ది గోట్’ను తెరకెక్కించారు వెంకట్ ప్రభు. విజయ్ లాంటి స్టార్ హీరో సినిమా కాబట్టి ముందు నుండే ‘ది గోట్’పై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా మొదటినుండి సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ అని తెలిసేలా పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఆడియన్స్ అంచనాలు మరింత పెరిగిపోయాయి. కానీ ట్రైలర్ విడుదలయిన తర్వాత వారి అంచనాలు రీచ్ అవ్వలేకపోయిందని వార్తలు వినిపించాయి. చాలామంది ఆడియన్స్.. ‘ది గోట్’ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా హిట్ అవుతుందని నమ్మకం లేదని ఓపెన్‌గానే స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. వారు ఊహించినట్టుగానే మూవీకి మిక్స్‌డ్ టాక్ లభించింది.

హాలీవుడ్ రేంజ్ యాక్షన్

‘ది గోట్’లో విజయ్‌కు జోడీగా స్నేహ, మీనాక్షి చౌదరీ నటించారు. ప్రభుదేవా, జయరామ్, ప్రశాంత్, మోహన్ లాంటి సీనియర్ యాక్టర్స్.. ఇందులో కీలక పాత్రలో కనిపించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం, పాటలు చాలామందిని ఆకట్టుకోగలిగాయి. ‘ది గోట్’ మూవీ కథ, కథనం రొటీన్‌గా ఉందని చాలామంది ప్రేక్షకులు భావించినా.. యాక్షన్ సీన్స్‌కు మాత్రం వారు ఫిదా అయ్యారు. ఈ మూవీలో విజయ్ యాక్షన్ చాలా బాగుందని, హాలీవుడ్ రేంజ్ ఫీల్ వచ్చిందని రివ్యూల్లో తెలిపారు. ‘ది గోట్’కు పెద్ద ప్లస్ పాయింట్ యాక్షనే అని, అందులో విజయ్ యాక్టింగ్ కూడా చాలా బాగుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×