BigTV English

Viral video: ఆడపిల్ల కాదు ఆడపులి.. అమాంతం ఆటోని పైకి లేపి తల్లిని కాపాడిన బాలిక! వైరల్ వీడియో

Viral video: ఆడపిల్ల కాదు ఆడపులి.. అమాంతం ఆటోని పైకి లేపి తల్లిని కాపాడిన బాలిక! వైరల్ వీడియో

Daughter Lifts Auto to Save Mother After Vehicle Hits her in Freak Accident : ఆడపిల్ల అని తక్కువ అంచనా వేసేరు. ఏదైనా ఆపద వచ్చిందంటే ఆడపిల్ల కాస్త ఆడ పులిగా మారుతుంది. తన కళ్ల ముందు ఏదైనా సమస్య కానీ, ఆపద కానీ వచ్చిందంటే చాలు ఎలాంటి సాహసానికైన వెనకడుగు వెయ్యదు. అలాంటిది.. ఇక కన్న తల్లికి ఆపద వచ్చిందంటే ఊరుకుంటుందా చెప్పండి. నిమిషం కూడా ఆలోచించదు. తాజాగా జరిగిన ఒక ఇన్సిడెంట్ చూస్తే ఆ బాలికను అభినందించాల్సిందే.. ఓ స్కూల్ విద్యార్ధిని తన తల్లిని కాపాడుకునేందుకు.. బాల్తాపడిన ఆటోను అమాంతం పైకెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


వివరాళ్లోకి వెళ్తే.. మంగళూరు సమీపంలోని కిన్నిగోళి రామ్‌నగర్ అనే గ్రామంలో  ఓ మహిళ అవతలి వైపు ఉన్న తన కూతురి కోసం రోడ్డు దాటడానికి ప్రయత్నించగా.. ఇంతలో  ఓ ఆటో వచ్చి ఆమెను ఢీ కొట్టింది. తల్లిపై ఆటో పడటం చూసిన విద్యార్ధిని మెరుపు వేగంలా పరుగున వచ్చి  రెండు చేతులతో ఆటోను పైకి లేపి తన తల్లిని కాపాడుకుంది. అయితే ఆ ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఉండటం గమనర్హం. తన మాతృమూర్తిని కాపాడుకునేందుకు ఆ చిన్నారికి అంత శక్తి ఎలా వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి.

ఇక ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయాలుపాలైన మహిళను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో ఆటో డ్రైవర్ తో పాటు అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన దృశ్యాలు రోడ్డు ప్రక్కన ఉన్న సీసీ కెమరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో గాయాలు పాలైన మహిళ రాజరత్నాపూర్‌కి చెందిన చేతన (35) గా పోలీసులు గుర్తించారు.


Also Read: ఇదేం పైత్యం.. వరద ముంచుకొస్తుంటే వీడియోలా.. చివరకు

ట్యూషన్‌కి వెళ్లిన తన కుమార్తెను తీసుకురావడానికి వచ్చిన ఆ మహిళ.. ఆ సమీపంలోనే  ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే తల్లిని కాపాడిన బాలికను చూసి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. అంత షార్ట్ టైం‌లో హెల్ప్ చేయాలి అని అనిపించింది అంటే .. really proud of brave girl  అంటూ.. సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు.  బాలిక  శీఘ్ర ఆలోచన,  ధైర్య సాహసాలు  మెచ్చుకొని పలువురు ప్రశంసలు కురుపించారు.

Related News

Viral Video: సినిమా శైలిలో రెచ్చిపోయిన యువ జంట.. అందరిచూపు వారిపై, చివరకు ఏమైంది?

Bar in Van: వారెవ్వా మొబైల్ బార్లు, రమ్మన్న చోటుకు వచ్చేస్తాయ్!

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళల దుమ్మురేపే గొడవ.. వీడియో వైరల్!

Youtuber Arrest: యూట్యూబ్ లో వంటల వీడియోలు పోస్ట్ చేస్తున్నారా? ఐతే ఇది మీకోసమే

Viral dance video: ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్ దుమ్ముదులిపేశారు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!

Octopus video: అద్భుతమైన వీడియో.. తనను కాపాడినందుకు అక్టోపస్ ఎలా థ్యాంక్స్ చెప్పిందో చూడండి..!

Big Stories

×