BigTV English

OTT Movie : భార్య, భర్తల క్రైమ్ స్టోరీని వెంటాడే పోలీస్… మలుపులతో పరుగులు పెట్టే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : భార్య, భర్తల క్రైమ్ స్టోరీని వెంటాడే పోలీస్… మలుపులతో పరుగులు పెట్టే సస్పెన్స్  థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూస్తూ మూవీ లవర్స్ బాగా థ్రిల్ అవుతారు. వీటిలో హాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు మూవీ లవర్స్ ని ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ, ఊహించని మలుపులతో పరుగులు పెడుతూ ఉంటుంది. కిడ్నాప్ అయిన అమ్మాయిని పోలీస్ ఆఫీసర్ వెతికే క్రమంలో స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది గిల్టీ‘ (The Guilty). ఈ మూవీకి ముల్లర్ దర్శకత్వం వహించారు. ‘ది గిల్టీ’ మూవీ పూర్తిగా ఎమర్జెన్సీ కాల్ సెంటర్ పరిధుల్లోనే సాగే డ్రామా. ఇన్‌కమింగ్ 112 ఎమర్జెన్సీ కాల్‌లను హ్యాండిల్ చేసే డెడ్లీ ఫోర్స్ పోలీసు అధికారి అస్గర్ హోల్మ్ పాత్ర చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీలో జాకబ్ సెడెర్గ్రెన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో ఎమర్జెన్సీ కాల్‌లను హ్యాండిల్ చేసే ఒక పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలోనే 19 సంవత్సరాల కుర్రాడిని చిన్న తప్పు కారణంగా షూట్ చేసే ఉంటాడు. ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ రేపు ఉండగా, హీరోకి ఒక కాల్ వస్తుంది. అందులో ఒక మహిళ తను కిడ్నాప్ అయినట్టు చెబుతుంది. ఆ తర్వాత కాల్ కట్ అయిపోతుంది. ఆమె ఒక వైట్ కలర్ కారులో ఉన్నట్టు హీరో తెలుసుకుంటాడు. అయితే ఆ కార్ నెంబర్  తెలియకపోవడంతో ట్రేస్ చేయడం కష్టమవుతుంది. ఆ తర్వాత తను కాల్ చేసిన ల్యాండ్ నెంబర్ కి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఒక చిన్న పిల్ల ఆ కాల్ లిఫ్ట్ చేసి, మా మమ్మీ, డాడీ గొడవ పడ్డారని, మా మమ్మీని బలవంతంగా డాడీ తీసుకెళ్లాడని చెప్తుంది. మా మమ్మీని ఎలాగైనా కాపాడాలని చిన్న పాప  అడుగుతుంది. హీరో కాపాడతానని చెప్పి ఒక పోలీసుని ఎక్కడికి పంపిస్తాడు.

అయితే ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లాడిని అప్పటికే చంపి ఉంటారు. హీరో ఆ మహిళ భర్త ఇదంతా చేసి ఉంటాడని అనుకుంటాడు. ఆ తర్వాత కిడ్నాప్ అయిన మహిళ హీరోకి కాల్ చేస్తుంది. హీరో ఆ మహిళకు ధైర్యం చెప్పి ఏదైనా వెపన్ ఉందేమో చూడమంటాడు. కార్ డిక్కీలో ఒక ఇటుక రాయి ఉంటుంది. కారు స్లో అవ్వగానే దానితో దాడి చేయమంటాడు హీరో. ఇక్కడే హీరోకి దిమ్మతిరిగే ట్విస్ట్ తెలుస్తుంది. అదేమంటే ఆ అబ్బాయిని చంపింది కిడ్నాప్ అయిన మహిళ అని తెలుసుకుంటాడు. చివరికి హీరో ఆ మహిళని కాపాడుతాడా? నిజంగానే ఆ పిల్లాడిని ఎవరు చంపి ఉంటారు? భర్త ఎందుకు ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×