OTT Movie : ప్రేమ, మోసం అనే థీమ్స్ తో ఒక కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఒక కుట్రలో భాగంగా ఈ స్టోరీ నడుస్తుంది. ఇందులో ప్రేమ పేరుతో ఒకరినిఒకరు మోసం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా చివరివరకూ ట్విస్టులతో కేక పెట్టిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
ఈ కొరియన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది హ్యాండ్‌మెయిడ్’ (The Handmaiden). 2016 లో విడుదలైన ఈ సినిమాకి పార్క్ చాన్-వూక్ దర్శకత్వం వహించారు. ఇది సారా వాటర్స్ 2002లోరాసిన “ఫింగర్‌స్మిత్” అనే నవల నుండి స్ఫూర్తి పొందింది. ఈ చిత్రంలో కిమ్ మిన్-హీ, కిమ్ తే-రీ, హా జంగ్-వూ, చో జిన్-వూంగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 145 నిమిషాల నిడివితో, ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. IMDbలో ఈ సినిమాకి 8.1/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
1930లలో జపాన్ ఆక్రమణ కింద ఉన్న కొరియాలో, సూకీ అనే అమ్మాయి పిక్‌పాకెట్ చేస్తూ, ఒక చిన్న దొంగగా జీవితం గడుపుతుంటుంది. అయితే ఒక స్కామ్‌లో భాగంగా లేడీ హిడెకో అనే ఒక జపనీస్ వారసురాలితో ఉండేందుకు, సూకీని హ్యాండ్‌మెయిడ్‌గా “కౌంట్ ఫుజివారా” అనే మోసగాడు నియమిస్తాడు. అతను హిడెకో సంపదను దొంగిలించడానికి ఆమెను వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఆమెను మానసిక ఆసుపత్రిలో చేర్చి, సంపదను సూకీతో పంచుకోవాలని ప్రణాళిక రూపొందిస్తాడు. ఈ క్రమంలో సూకీ హిడెకోకి సేవకురాలిగా చేరుతుంది. హిడెకోను ఫుజివారాతో ప్రేమలో పడేలా ప్రోత్సహిస్తుంది. హిడెకో తన అత్త మరణం తర్వాత తన, శాడిస్ట్ మామ కౌజుకి ఆధీనంలో ఒక ఒంటరి జీవితం గడుపుతోంది. అతను హిడెకోని తన పెద్ద ఎస్టేట్‌లో బందీగా ఉంచుతాడు. ఈ క్రమంలో సూకీ, హిడెకో మధ్య ఒకరకమైన సంబంధం ఏర్పడుతుంది.
ఇంతలో హిడెకో, ఫుజివారాతో కలిసి సూకీని మోసం చేయడానికి ఒక ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. హిడెకో తన మామ నుండి తప్పించుకోవడానికి ఫుజివారాతో ఒక ఒప్పందం చేసుకుంటుంది. ఆమె సూకీని “హిడెకో”గా మానసిక ఆసుపత్రిలో చేర్చడానికి సహాయం చేస్తుంది. దీని ద్వారా ఆమె సంపదతో తప్పించుకోవచ్చు. అయితే సూకీతో ఆమె ఏకాంత బంధం ఆమె ఆలోచనలను మార్చివేస్తుంది. సూకీ, హిడెకో ఒకరిపట్ల ఒకరు నిజమైన ప్రేమను పెంచుకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఫుజివారా, కౌజుకి ఇద్దరినీ మోసం చేయడానికి ఒక కొత్త ప్లాన్ రూపొందిస్తారు. వీళ్ళు ప్లాన్ ఏమిటి ? సూకీ, హిడెకో లవ్ స్టోరీ ఏమవుతుంది ? ఫుజివారా, కౌజుకి లను వీళ్ళు మోసం చేయగలరా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : ఒకే ఏరియాలో 40 మంది అమ్మాయిలపై… కన్పిస్తే చాలు వదలకుండా అదే పని… క్లైమాక్స్ రచ్చ రచ్చే