OTT Movie : రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఒక వెబ్ సిరీస్ లో మతిపోయే ట్విస్టులు ఉన్నాయి. ఈ సిరీస్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని కస్తూర్బా నగర్ స్లమ్‌లో భారత్ కాళీచరణ్ యాదవ్ (అక్కు యాదవ్) అనే గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరుగుతుంది. ఇతను సుమారు 40 మంది మహిళలపై అఘాయిత్యాలు చేసాడనే ఆరోపణలు ఎదుర్కున్నాడు. అక్కు యాదవ్ 13 సంవత్సరాల నుంచి (1991-2004) ప్రాంతంలో హత్య, దోపిడీ, అఘాయిత్యం, ఇంటిపై దాడులు వంటి నేరాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. మూడు ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్ పేరు ‘ఇండియన్ ప్రిడేటర్: మర్డర్ ఇన్ ఎ కోర్ట్‌రూమ్’ (Indian Predator: Murder in a Courtroom ). 2022 అక్టోబర్ 28న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదలైన ఈ మూడు ఎపిసోడ్‌ల సిరీస్ ను వైస్ స్టూడియోస్ నిర్మించగా, ఉమేష్ వినాయక్ కులకర్ణి దర్శకత్వం వహించారు. IMDb లో ఈ సిరీస్ కి 7.1/10 రేటింగ్ ఉంది. ఇది హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ సిరీస్ 2004 ఆగస్టు 13 న నాగ్‌పూర్ జిల్లా కోర్టు నెం. 7లో అక్కు యాదవ్‌ను సుమారు 200 మంది మహిళలు కత్తులతో 70 సార్లు పొడిచి, 15 నిమిషాల్లో హత్య చేసిన ఘటనతో ప్రారంభమవుతుంది. అక్కు, కస్తూర్బా నగర్ స్లమ్‌లో 40 మందికి పైగా దళిత మహిళలపై అఘాయిత్యం, ముగ్గురి హత్యలు, పలు దోపిడీలు, ఇంటిపై దాడులు వంటి నేరాలు చేశాడు. అతని గ్యాంగ్ ఈ స్లమ్‌ను భయం లో ముంచెత్తింది. పోలీసులు కూడా అతనికి మద్దతు ఇచ్చారని, లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్కు యాదవ్‌ను “హైమన్ థీఫ్” అని పిలిచే మహిళలు, అతని రాకను “మేడమ్ వస్తోంది” అనే కోడ్‌తో హెచ్చరించేవారు. ఎందుకంటే అమ్మాయిలను హెచ్చరించడానికి అలా చేసేవాళ్ళు. ఇక ఇతని అరాచకం చెప్తుంటేనే ఇలా ఉందంటే, అనుభవించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇతని స్టోరీ మూడు ఎపిసోడ్స్ తో తెరకెక్కించారు.
ఎపిసోడ్ 1 (57 నిమిషాలు): కోర్టులో అక్కు యాదవ్ లించింగ్‌తో సిరీస్ ఓపెన్ అవుతుంది. బాధిత మహిళలు జర్నలిస్టుల ఇంటర్వ్యూల ద్వారా అక్కు నేరాల గురించి వివరిస్తుంటారు. ఈ ఎపిసోడ్ అతని ఆధిపత్యాన్ని, పోలీసుల నిర్లక్ష్యాన్ని హైలైట్ చేస్తుంది.
ఎపిసోడ్ 2 (58 నిమిషాలు): అక్కు యాదవ్ గత 13 సంవత్సరాల(1991-2004) హయాంలో కస్తూర్బా నగర్ భయపడిన వాతావరణాన్ని వివరిస్తుంది. ఉషా నారాయణే అనే ఒక మహిళ అతని బెదిరింపులకు వ్యతిరేకంగా నిలబడుతుంది. ఒక గ్యాస్ సిలిండర్‌తో అతన్ని ఎదిరించిన సంఘటనను చూపిస్తుంది. ఈ ఎపిసోడ్ కమ్యూనిటీలోని కోపం, నిరాశ, ముఖ్యంగా పోలీసుల నుండి సహాయం లేకపోవడం వల్ల, లించింగ్‌కు దారితీసిన సంఘటనలను చూపిస్తుంది.
ఎపిసోడ్ 3 (53 నిమిషాలు): చివరికి కస్తూర్బా నగర్ మహిళలు ఒక రక్తపాత పథకాన్ని పన్నాగం చేస్తారు. కోర్టు గదిలో అక్కును ఎదుర్కొని, కత్తులతో దాడి చేస్తారు. ప్రతి మహిళా అతన్ని కనీసం ఒక్కసారైనా పొడవడానికి ప్రయత్నిస్తుంది. అతని మరణం తర్వాత స్లమ్‌లో సంబరాలు జరుగుతాయి. కానీ పోలీసులు ఐదుగురు మహిళలను అరెస్టు చేస్తారు. వారిపై ఆధారాలు లేకపోవడంతో 2014లో విడుదల చేస్తారు.
Read Also : అమ్మాయిలను బుక్ చేసుకుని, టార్చర్ చేసి చంపేసే సైకో… వర్త్ వాచింగ్ రియల్ కొరియన్ కథ