BigTV English

Akash Prime Missile: యుద్ధానికి సిద్ధం..! ఆ ఒక్కరోజు 3 క్షిపణి పరీక్షలు ఎందుకు చేశారంటే?

Akash Prime Missile: యుద్ధానికి సిద్ధం..! ఆ ఒక్కరోజు 3 క్షిపణి పరీక్షలు ఎందుకు చేశారంటే?

Akash Prime Missile: ఇటు దేశ రక్షణ- అటు ఆయుధ మార్కెట్ విస్తరణ.. భారత్ ఈ దిశగా పావులు కదుపుతోందా? తన ఆయుధ సామర్ధ్యాన్ని అంతకంతకూ విస్తరిస్తోందా? దీని ద్వారా పాక్, చైనాకు దబిడి దిబిడేనా? తాజాగా భారత్ చేసిన ఈ ఆయుధ పరీక్షల వివరాలేంటి? వాటి ద్వారా భారత్ పొందగలిగే ఆయుధ సదుపాయం ఎలాంటిది? ఈ మూడు క్షిపణుల ప్రత్యేకత ఎలాంటిది?


ఆకాశ్ ప్రైమ్ టెస్ట్ సక్సెస్
అగ్ని-I, పృథ్వీ-II టెస్టింగ్ కూడా
భారత్ రక్షణ సామర్ధ్యం పెరుగుదల..
రక్షణ మంత్రి రాజ్ నాథ్ ప్రశంస

భారత్ ఇరవై నాలుగు గంటల్లో మూడు ప్రధాన క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది. వ్యూహాత్మకంగా తన ఆయుధ సామర్ధ్యాన్ని పెంచుకుంది. సక్సెస్ ఫుల్ గా తన వెపన్ కెపాసిటీ టెస్ట్ చేసింది. ఈ పరీక్షల ద్వారా భారత్ తన అణు, వాయు రక్షణ సామర్ధ్యాలను మరింత మెరుగు పరుచుకుంది.


ఆకాశ్ శక్తి గణనీయంగా పెరుగుదల

భారత్ తన తాజా పరీక్షల్లో ఆకాశ్ శక్తిని గణనీయంగా పెంచుకోగా.. ఈ పరీక్షల్లో స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులైన పృథ్వీ-II, అగ్ని-I సైతం అనుకున్న లక్ష్యాలను చేధించి.. భళా అనిపించాయి.

టర్కిష్ డ్రోన్లు, చైనీస్ మిస్సైళ్లపై..

మొన్నటి వరకూ ఒక లెక్క. ఆపరేషన్ సిందూర్ గెలుపు తర్వాత మరొక లెక్కగా భావిస్తోంది భారత్. ఆయుధ సామర్ధ్యాన్ని పెంచుకోవడంలో మరింత సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. పాక్ ప్రయోగించిన టర్కిష్ డ్రోన్లు, చైనిస్ మిస్సైళ్లను ఆకాశ్ ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కుంది భారత్. దీంతో వీటిపై మరింత ఫోకస్ చేసింది.

ఆకాశ్ సీరీస్ లోనే ఇది లేటెస్ట్

జూలై 16న సైన్యం అప్ గ్రేడ్ చేసిన ఆకాశ్ ప్రైమ్ క్షిపణిని లడఖ్ లో 4500 మీటర్ల ఎత్తులో విజయవంతంగా పరీక్షించింది. ఇక్కడ తక్కువ ఆక్సిజన్ ఉండటం మాత్రమే కాదు.. కఠినమైన వాతావరణం సైతం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తన వాయు రక్షణ వ్యవస్థ మరింత ఎక్కువ సవాళ్లను ఎదుర్కునే విధంగా.. తన సామర్ధ్యాన్ని మెరుగు పరుచుకుంది భారత్.

18- 20 కి. మీ రేంజ్ లో..

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇంప్రూవ్ చేసిన ఆకాశ్ ప్రైమ్ ఇప్పటి వరకూ ఉన్న ఆకాశ్ సీరీస్ లోనే ఇది లేటెస్ట్ వర్షెన్. 30- 35 మీటర్ల పరిధి, 18, 20 కిలోమీర్ల ఎత్తులో ఫైటర్ జెట్లు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ల ముప్పు నివారించగలదు.

రెండు హై స్పీడ్ డ్రోన్ లను హిట్ చేసిన ఆకాశ్

ఆకాశ్ రాడార్, కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్ తో పాటు క్షిపణి లాంచర్లను సైతం అనుసంధానిస్తుంది. ఇది వివిధ రకాల రక్షణనందిస్తుంది. ట్రయల్ టైంలో ఇది రెండు హై స్పీడ్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకోగలిగింది. ఇందులో మరో కీలకమైన విషయమేంటంటే.. దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్. ఇది వైమానిక లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. అంతే కాదు మిస్సైళ్లను ఖచ్చితమైన దారుల్లో మార్గదర్శనం చేయగలదు. ఇలాంటి ఫెసిలిటీ కేవలం కొన్ని దేశాలకు మాత్రమే ఉంది.

అతి త్వరలో సరిహద్దులో ఆకాశ్ ప్రైమ్ మొహరింపు

ఫస్ట్ ఆఫ్‌ ప్రొడక్షన్ మోడల్ ఫైరింగ్ ట్రయల్ లో భాగంగా ఈ పరీక్ష నిర్వహించారు. DRDO, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తో పాటు ఇతర ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు ఈ పరీక్షలలో పాల్గొన్నాయి. ఆకాశ్ ప్రైమ్ అప్ గ్రేడ్ చేయడంలో.. ఎందరో ఆయుధ రంగ నిపుణులు, ఇతరత్రా సంస్థల అభిప్రాయం బేస్ చేసుకున్నారు. ఎక్కువ ఎత్తు చేరేలా ఆధునీకరించారు. అతి త్వరలో ఆకాశ్ ప్రైమ్ ని సరిహద్దుల్లో మొహరించే అవకాశం కనిపిస్తోంది.

జూలై 17న, ఒడిశాలో చాందీపూర్ లో..

జూలై 17న, ఒడిశాలో చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత్ పృథ్వీ-II, అగ్ని-I స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సైతం పరీక్షించింది. ఈ రెండు పరీక్షలు కూడా.. వ్యూహాత్మక దళాల కమాండ్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఇవి అన్ని పారామీటర్స్ ని క్రాస్ చేయగలిగాయి.

ఘన ఇంధనంతో నడిచే అగ్ని-I

పృథ్వీ-II.. ద్రవ ఇంధనంతో నడిచే, సర్ ఫేస్ టూ సర్ఫేస్ 350 కిలోమీటర్ల పరిధి కలిగిన క్షిపణి. ఇది అంతటి ఖచ్చితత్వాన్ని ప్రదర్శించింది. ఇక అగ్ని-I, కాస్త ఎక్కువ పరిధి కలిగి ఉంటుంది. ఘన ఇంధనం ద్వారా పనిచేస్తుంది. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఈ రెండు క్షిపణులు అణు, వాయు రక్షణ విషయంలో భారత అమ్ముల పొదిలో అత్యంత కీలకం కానున్నాయి.

అత్యంత కీలకమైనవి పృథ్వీ-II, అగ్ని-I

ఆకాశ్ ప్రైమ్ విక్టరీ తర్వాత భారత్ పృధ్వీ టూ, అగ్ని వన్ మిస్సైళ్ల ద్వారా తన అణ్వాయుధ బలాన్ని మరింత పెంచుకుంటూ వెళ్తోంది. ఇందులో అత్యంత కీలకమైనవి పృథ్వీ-II, అగ్ని-I. ఇవి విజయవంతం కావడం భారత్ సామర్ధ్యం మరింత పెరింగదని చెప్పాలంటారు నిపుణులు.

15 వేల అడుగుల ఎత్తులో ఆకాశ్ సైతం గొప్ప విషయం

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ ప్రైమ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ వ్యవస్థ 15 వేల అడుగుల ఎత్తులో పరీక్షించడం.. కూడా గర్వించాచాల్సిన విషయం. లడఖ్ లో రెండు వైమానిక హై స్పీడ్ మానవ రహిత లక్ష్యాలను నాశనం చేసింది. దీంతో పాటు.. పృథ్వీ-II, అగ్ని-I పరీక్షలు సైతం విజయవంతం కావడం.. ఇండియన్ ఆర్మీ వెపన్ కెపాసిటీని పెంచినట్టయ్యిందని భావిస్తున్నారు ఆయుధ రంగ నిపుణులు.

500 కిలోల పేలోడ్, అణు వార్ హెడ్ రెండింటినీ హ్యాండిల్ చేసే పృథ్వీ-II

పృథ్వీ-II క్షిపణి 350 కిలోమీటర్ల పరిధి మాత్రమే కాదు.. 500 కిలోల పేలోడ్, అణు వార్ హెడ్ రెండింటినీ మోయగలిగిన సామర్ధ్యం దీని సొంతం. ఇక అగ్ని సంగతి చూస్తే.. వెయ్యి కిలోల పేలోడ్‌ను మోయగలదు.

ఎలైట్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షల నిర్వహణ

ఈ రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగ బాధ్యతలను ఎలైట్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ నిర్వహించింది. ఈ ప్రయోగాలు సాంకేతిక పరిమితులన్నిటినీ అధిగమించాయని సగర్వ ప్రకటన చేసింది భారత రక్షణ మంత్రిత్వ శాఖ.

ఎక్కువ ఎత్తునుంచి ఆయుధ ప్రయోగం గర్వకారణం- రక్షణమంత్రి

ఈ ప్రయోగాలపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఈ విజయవంతమైన ఆయుధ పరీక్షలు.. భారత వైమానిక రక్షణ సామర్ధ్యాలను మరింత పెంచాయని అన్నారాయన. మరీ ముఖ్యంగా ఎక్కువ ఎత్తు నుంచి కూడా మనం మన ఆయుధాలను ప్రయోగించగలిగే కెపాసిటీ కలిగి ఉండటం గర్వకారణంగా అభివర్ణించారు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.

నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధాలు గెలవలేం

నిన్నటి ఆయుధాలతో నేటి యుద్ధాలు గెలవలేం. రేపటి ఆయుధాలు కావాలన్నది భారత చీఫ్ డిఫెన్స్ స్టాప్ రీసెంట్ గా చేసిన కామెంట్. అంతే కాదు.. ఆయుధాలను సొంతంగా తయారు చేసుకుంటే.. దాని సౌలభ్యం వేరని అన్నారాయన. ఇదే పాక్ చైనా టర్కిష్ ఆయుధాలు వాడి వాటి ద్వారా నష్టాన్ని చవి చూసిందే తప్ప లాభ పడిన దాఖలా లేదు. ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా, మనదైన శైలిలో మన దగ్గర మనం తయారు చేసుకుంటే దానిపై వచ్చే పట్టే వేరంటారాయన. ప్రెజంట్ భారత్ వెపన్ టెక్నాలజీని సొంతంగా రూపొందించుకోవడం ఎందుకంత కీలకం. ఇప్పుడు చూద్దాం.

ఆకాశ్ అప్ గ్రేడ్ చేయడంలో ఓన్ టెక్నాలజీ

ఇకపై భారత్ తో యుద్ధమంటే పది సార్లు ఆలోచించాలిఆకాశ్ ని అప్ గ్రేడ్ చేయడంలో తన సొంత టెక్నాజీనే ఎక్కువగా వాడింది భారత్. కారణమేంటంటే.. ఓన్ టెక్నాలజీ ఉంటే దాని సర్వీసింగ్ స్పేర్ పార్ట్స్ కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న ఆయుధాల్లో అత్యధిక శాతం రష్యావి, ఆ తర్వాత ఫ్రెంచ్, ఆపై ఇజ్రాయెల్. ఇక్కడ సమస్య ఏంటంటే.. ఏదైనా రిపేర్ వస్తే.. అందుకోసం ఇతరులపై ఆధార పడాల్సి ఉంటుంది. మన దగ్గర ఇప్పటికీ రష్యన్ ఆయుధాలే ఎక్కువ. స్పేర్ పార్ట్స్ కోసం.. ఈ దేశంపైనా ఆధార పడాల్సి ఉంటుంది. దానికి తోడు రష్యా చూస్తే ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలుగా ఉంది. ఈ సమయంలో ఆ దేశం నుంచి సాయం ఆశించడం ఒకింత కష్టమే. అప్పటికీ రష్యా తామెంత యుద్ధంలో ఉన్నా.. ఇటు చమురు అటు ఇతర ఆయుధ సాంకేతిక సాయం చేస్తూనే ఉంది. అదే మరో దేశమైతే.. ఇంత యుద్ధంలో ఉండగా స్పందించడం కష్టమే.

బ్రిటన్ F35 రిపేర్ చేయడం ఎవరి తరమూ కాలేదు

మొన్నటికి మొన్న బ్రిటన్ కి చెందిన F 35.. సంగతి చూసే ఉంటాం. ఇది కేరళ లో చిక్కుకు పోయాక.. దాన్ని రిపేర్ చేయడం ఎవరి తరమూ కాలేదు. ఆఖరికి బ్రిటన్ నుంచి నలభై మంది సాంకేతిక నిపుణులు వచ్చినా సరే ప్రయోజనం కనిపించలేదు. దీంతో గ్లోబ్ మాస్టర్ తో ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఎఫ్ 35 లాంటి ఫైటర్ జట్స్ ఒక నట్టు విప్పాలన్నా.. అందుకంటూ ఒక కోడ్ ఉంటుంది. అంత క్రిటికల్ గా ఉంటుంది. జస్ట్ ఆ ఫైటర్ జెట్ కేరళలో ఆగడం వల్ల ఇటు ఎయిర్ పోర్టు మెయిన్ టైన్స్ ఫీజుతో పాటు.. బ్రిటన్ కి లిఫ్ట్ చేయడానికి ఎంతో ఖర్చు అయి ఉంటుంది. అది యూఎస్ మేడ్ జెట్ కావడంతో రిపేర్ కి ఎంత ఖర్చవుతుందో చెప్పలేమంటారు నిపుణులు. ఆయుధాల మెయిన్ టైన్స్ కావచ్చు, వాటి వినియోగం కావచ్చు.. ఆ స్థాయిలో ఖర్చుతో కూడుకుని ఉంటాయి. అత్యంత కఠినతరంగా ఉంటాయి.

సొంత ఆయుధాలతో ఉద్యోగిత, మార్కెట్లో వాటా సొంతం

బేసిగ్గానే ఇలాంటి మిస్సైళ్లు, ఇతరత్రా ఆయుధ సామాగ్రి భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు. వీటిని సొంతంగా తయారు చేసుకోవడం వల్ల ఎంతో ఖర్చు మిగులుబాటు అవుతుంది. తయారీ ద్వారా ఇక్కడ కొందరికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక ప్రపంచ ఆయుధ మార్కెట్లో వాటా పొందే ఛాన్సు సైతం లభిస్తుంది. ప్రస్తుతం యూఎస్- చైనా- రష్యా- ఫ్రాన్స్- ఇజ్రాయెల్ వంటి కొన్నంటే కొన్ని దేశాలకు మాత్రమే ఆయుధ తయారీ సామర్ధ్యముంది. భారత్ ఇప్పుడిప్పుడే రష్యా, ఇజ్రాయెలీ సాంకేతిక సహకారంతో.. ఆయుధ తయారీలో ముందడుగు వేస్తోంది. అంతే కాదు మార్కెట్ వాటాను క్రమేపీ ఆక్రమిస్తోంది.

మొన్న చైనా విద్యుత్ ఉత్పత్తి నిర్వీర్యం చేసే ఆయుధ తయారీ

మొన్న చైనా ప్రత్యర్ధి దేశాల విద్యుత్ సరఫరా నిర్వీర్యం చేసే సామర్ధ్యం గల ఆయుధాలను తయారు చేసింది. మనం అంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవల్సి ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్, యూఎస్ ఐరన్, గోల్డన్ డ్రోమ్ వంటి సరికొత్త సాంకేతిక సైనిక సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇక ఇజ్రాయెల్ లేజర్ టెక్నాలజీతో డ్రోన్లు, ఫైటర్ జెట్లను కూల్చే సామర్ధ్యం సొంతం చేసుకుంది. ప్రపంచ దేశాలు ప్రస్తుతం సైనిక పరంగా ఆయుధ సామర్ధ్యం పరంగా మున్ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో భారత్ తనదైన ఆయుధ సామర్ధ్యాన్ని నానాటికి పెంచుకుంటూ పోవడం వల్ల మాత్రమే సరికొత్త ప్రపంచ నాయకత్వం అలవడుతుంది. గ్లోబల్ సౌత్ లీడర్షిప్ కి మార్గం సుగమం అవుతుంది.

రష్యా నుంచి చమురు కొంటే 500 పన్ను వేస్తాన్న యూఎస్

వచ్చే రోజుల్లో అమెరికా ఒంటెత్తు పోకడల కారణంగా.. ప్రపంచం రెండుగా చీలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. మొన్నటికి మొన్న యూఎస్- రష్యన్ ఆయిల్ కొనే దేశాలైన భారత్, చైనా, ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ పై 500 శాతం సుంకాలు విధిస్తానని భయపెడుతోంది. ఇప్పుడు కూడా.. భారత ఆటోమొబైల్ విడిభాగాలపై కూడా పన్నులు విధించడానికి సిద్ధపడుతోంది. ఈ క్రమంలో చూస్తే అమెరికా ప్రపంచ వ్యతిరేకతను పెద్ద ఎత్తున మూట గట్టుకుంటోంది. సరిగ్గా ఈ సమయంలో భారత్ అన్ని రకాలుగా అర్హతలను సంపాదించడం వల్ల ప్రపంచ నాయకత్వానికి మరింత దగ్గర కావచ్చని అంటారు నిపుణులు.

మనం కూడా ఎస్ 400 కి దీటుగా ప్రాజెక్ట్ కుష

ప్రస్తుతం అమెరికా ప్రపంచాన్ని ఇంతగా శాసించగలగడానికి ఆదేశానికున్న ఆయుధ సామర్ధ్యమే. దీంతోనే అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఎక్కడ ఏ యుద్ధం జరిగాని అక్కడ ప్రముఖంగా కనిపించేది అమెరికన్ ఆర్మీ, ఆపై యూఎస్ మేడ్ వెపనరీ. మొన్నటికి మొన్న ఇరాన్- ఇజ్రాయెల్ వార్ లో కూడా అమెరికా తన బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ కెపాసిటీ కేవలం యూఎస్ దగ్గర తప్ప.. మరే దేశం దగ్గరా లేదు. భారత్ ఇక్కడే తనదైన ఆయుధ వ్యూహం రచించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎస్ 400 కి దీటుగా ప్రాజెక్ట్ కుషా, ఆపై రాఫెల్స్, F35లకు బదులుగా ఫిఫ్త్ జెన్ ఫైటర్ జెట్ల రూపకల్పన చేస్తోంది. వీటిని వచ్చే రోజుల్లో వినియోగంలోకి తేగలిగితే.. భారత్ వార్ మాస్టర్ కాగలదు. సైనిక పరంగా ఎంతో ముందున్న భారత్ కి ఆయుధ సామర్ధ్యం కూడా జతకలిస్తే ఆ రేంజే వేరుగా ఉంటుందని అంటారు వార్ ఎక్స్ పర్ట్స్.

అంతరిక్షంలో సొంత స్పేస్ సెంటర్ కోసం భారత యత్నం

ప్రస్తుతం అంతరిక్ష రంగంలో కూడా భారత్ ఇలాగే ఒక్కొక్క సామర్ధ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. చంద్రయాన్ ద్వారా విశేష ఖ్యాతిని సంపాదించాం. ఆపై శుభాంశు శుక్లా వంటి వారిని అంతరిక్షానికి పంపి ముందడుగు వేశాం. సొంతంగా అంతరిక్షంలో స్పేస్ సెంటర్ నెలకొల్పాలని చూస్తున్నాం. ఇదంతా భారత్ ని ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలుపుతోంది.

ఆకాశ్, పృధ్వీ, అగ్ని.. యుద్ధం రంగంలో పాక్, చైనాలకు చెక్

ఆకాశ్ పృధ్వి అగ్ని.. ఇవి మన పంచభూతాల్లోనివి మాత్రమే కాదు.. మనల్ని ప్రపంచ ఆయుధ రంగంలో ముందుకు తీసుకెళ్లే అస్త్రాలు. యుద్ధమనే ఈ చదరంగంలో పాక్, చైనాలకు చెక్ పెట్టే పావులు. మొన్న పరాయి ఆయుధాలను వాడి పాక్ ఎలా చతికిల పడిందో చూసే ఉంటాం. చైనా ఎంత ఆధునిక ఆయుధ సంపత్తిని ఇచ్చినా దాన్ని వాడ్డం చేతగాక పాక్ వెనకబడ్డం గమనించే ఉంటాం.

ఇకపై భారత్ తో యుద్ధమంటే పది సార్లు ఆలోచించాలి

దీని ద్వారా తెలిసిందేంటంటే ఆయుధాలుండటం ముఖ్యాం కాదు వాటి వాడకం అత్యంత కీలకం. అలా జరగాలంటే వాటిని సొంతంగా తయారు చేసుకోవడం ఆవస్యం అంటారు ఇండియన్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ అనిల్ చౌహాన్.

Related News

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Big Stories

×